Balakrishna: 6 పదుల వయస్సు దాటినప్పటకీ కుర్ర హీరోలకు ఏ మాత్రం తీసిపోని విధంగా సినిమాలు చేస్తూ, బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తున్న నందమూరి బాలకృష్ణ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ‘ఏజ్ ఈజ్ ఏ జస్ట్ నెంబర్’ అనే ట్యాగ్ కి న్యాయం చేసే హీరోల్లో బాలకృష్ణ ఒకరు. ఆమ్మో నా వల్ల కాదు , ఇంత రిస్కీ స్టంట్ నేను చెయ్యలేను అనే రకం కాదు బాలయ్య. ఈ వయస్సు లో కూడా ఆయన రిస్కీ స్తంట్స్ చేస్తూ ఉంటాడు. ప్రస్తుతం ఆయన గోపీచంద్ మైలినేని దర్శకత్వం లో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ లో , ఒక యాక్షన్ సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్నప్పుడు , ఆయన మోకాళ్ళకు తీవ్ర గాయాలు అయ్యాయి. ఆ కారణం చేత ఆయన్ని వెంటనే హాస్పిటల్ కి తరలించి సర్జరీ కూడా చేశారు.
అయితే సర్జరీ తర్వాత కొన్నాళ్ళు విశ్రాంతి తప్పనిసరిగా తీసుకోవాల్సిందే అని డాక్టర్లు చెప్పడం తో ఈ సినిమా షూటింగ్ తాత్కాలికంగా ఆగింది. రెండు నెలల పాటు విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్లు ఆయనకు సూచించారు. కానీ బాలయ్య వచ్చే నెల నుండే షూటింగ్ లో పాల్గొనేందుకు అమితాసక్తి ని చూపుతున్నట్టు సమాచారం. వచ్చే నెలలోనే తనకు సంబంధించిన షూటింగ్ మొత్తాన్ని పూర్తి చెయ్యాలని డైరెక్టర్ కి ఆదేశించాడట. ఇక ఆ తర్వాత అక్టోబర్ నెలలో ప్యాచ్ వర్క్ ని పూర్తి చేసి , నవంబర్ లో పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ని కూడా పూర్తి చేసి , ఎట్టి పరిస్థితిలోనూ ఈ చిత్రాన్ని ఈ ఏడాది డిసెంబర్ నెలలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకొని రావాలని బాలయ్య చూస్తున్నాడట. మన వల్ల నిర్మాత ఒక్క పైసా కూడా నష్టపోకూడదు అనే ఉద్దేశ్యం తోనే , పూర్తి స్థాయిలో ఆయన కోలుకోకపోయినప్పటికీ షూటింగ్ లో పాల్గొనేందుకు సిద్ధం అవుతున్నట్టు సమాచారం.
బాలయ్య చూపించిన ఈ ఉదార స్వభావం పై సోషల్ మీడియా నెటిజెన్స్ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. బాలయ్య కి ఇలాంటి దెబ్బలు కొత్తేమి కాదు , ‘అఖండ’ మూవీ షూటింగ్ సమయం లో ఆయన చెయ్యి విరిగింది. అయినప్పటికీ కూడా చేతి కట్టుతోనే ఆయన ‘జై బాలయ్య’ పాట షూటింగ్ లో పాల్గొన్నాడు. ఆ పాట ఎంత హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే. సాధారణ యాక్షన్ సన్నివేశాల్లో కూడా దూప్స్ ని వాడే కుర్ర హీరోలు ఉన్న ఈరోజుల్లో , 60 ఏళ్ళ వయస్సు దాటినప్పటికీ కూడా , డూప్స్ ని వాడకుండా , బాలయ్య ఈ స్థాయిలో పని చేయడం అనేది సాధారణమైన విషయం కాదు , ఆయన నుండి యువ హీరోలు చాలా నేర్చుకోవాలి అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు .