Kavya Kalyanram: నడుము విల్లులా వంచి మడతలతో గిలిగింతలు పెట్టిన బలగం భామ… వైరల్ గా కావ్య కళ్యాణ్ రామ్ హాట్ ఫోటోస్

ఠాగూర్, అడవిరాముడు, విజయేంద్రప్రసాద్, బాలు, సుభాష్ చంద్రబోస్… ఇలా స్టార్ హీరోల చిత్రాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి మెప్పించింది. 2008లో విడుదలైన ఉల్లాసంగా ఉత్సాహంగా సినిమా తర్వాత చైల్డ్ ఆర్టిస్ట్ పాత్రలకు ఫుల్ స్టాప్ ఎత్తింది.

  • Written By: NARESH
  • Published On:
Kavya Kalyanram: నడుము విల్లులా వంచి మడతలతో గిలిగింతలు పెట్టిన బలగం భామ… వైరల్ గా కావ్య కళ్యాణ్ రామ్ హాట్ ఫోటోస్

Follow us on

Kavya Kalyanram: యంగ్ బ్యూటీ కావ్య కళ్యాణ్ రామ్ ఇప్పుడిప్పుడే పరిశ్రమలో ఎదిగే ప్రయత్నం చేస్తుంది. గ్లామర్ ఇండస్ట్రీలో రాణింఘాలంటే గ్లామర్ షో తప్పనిసరి. అమ్మడు అదే చేస్తుంది. ఇంస్టాగ్రామ్ వేదికగా వరుస ఫోటో షూట్స్ తో హోరెత్తిస్తుంది. కావ్య కళ్యాణ్ రామ్ లేటెస్ట్ ఫోటో షూట్ వైరల్ గా మారింది. కావ్య కళ్యాణ్ రామ్ చైల్డ్ ఆర్టిస్ట్ గా పలు చిత్రాల్లో నటించింది. స్నేహమంటే ఇదేరా ఆమె మొదటి చిత్రం. గంగోత్రి మూవీ కావ్య కళ్యాణ్ రామ్ కి ఫేమ్ తెచ్చింది. ఆ మూవీలో హీరోయిన్ చిన్ననాటి పాత్ర చేసింది.

ఠాగూర్, అడవిరాముడు, విజయేంద్రప్రసాద్, బాలు, సుభాష్ చంద్రబోస్… ఇలా స్టార్ హీరోల చిత్రాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి మెప్పించింది. 2008లో విడుదలైన ఉల్లాసంగా ఉత్సాహంగా సినిమా తర్వాత చైల్డ్ ఆర్టిస్ట్ పాత్రలకు ఫుల్ స్టాప్ ఎత్తింది. 14 ఏళ్ల తర్వాత 22లో రీఎంట్రీ ఇచ్చింది. మసూద మూవీలో హీరోయిన్ గా నటించింది. హీరోయిన్ గా కావ్య కళ్యాణ్ రామ్ కి ఇది మొదటి చిత్రం. తిరువీర్ హీరోగా నటించారు, సంగీత కీలక రోల్ చేసింది.

హారర్ జోనర్లో తెరకెక్కిన మాసూద సూపర్ హిట్ కావడం విశేషం. ఆమె రెండో చిత్రం బలగం. ఇది ఓ సెన్సేషన్. దర్శకుడు వేణు ఎల్దండి తెరకెక్కించాడు. తెలంగాణ నేటివిటీ, సాంప్రదాయాలు ప్రతిబింబిస్తూ తెరకెక్కిన బలగం బ్లాక్ బస్టర్ కొట్టింది. పల్లెల్లో ఈ మూవీని జనాలు గుంపులుగా చూశారు. బలగం చిత్రంలో ప్రియదర్శికి జంటగా కావ్య కళ్యాణ్ రామ్ నటించింది.

బలగం మూవీకి అంతర్జాతీయ అవార్డులు దక్కాయి. కావ్య కళ్యాణ్ రామ్ కి ఈ చిత్రం మంచి ఫేమ్ తెచ్చిపెట్టింది. కావ్య లేటెస్ట్ రిలీజ్ ఉస్తాద్ మాత్రం నిరాశపరిచింది. కీరవాణి రెండో కుమారుడు సింహా కోడూరి నటించిన ఈ చిత్రం అంతగా ఆడలేదు. హ్యాట్రిక్ కొట్టాలన్న కావ్య కళ్యాణ్ రామ్ కల నెరవేరలేదు. అధికారికంగా కావ్య కళ్యాణ్ రామ్ మరో చిత్రం ప్రకటించలేదు. గ్లామరస్ రోల్స్ కి కూడా సిద్దమే అని కావ్య కళ్యాణ్ రామ్ హింట్ ఇస్తుంది.

తాజాగా లంగా ఓణీలో నడుము వ్ వంపులు కనిపించేలా హాట్ ఫోటో షూట్ చేసింది. కావ్య లుక్ కిక్ ఇస్తుండగా సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. తన ఇంటి టెర్రస్ తప్పితే ఫోటోలు దిగేందుకు మరో ప్లేస్ దొరకడం లేదట. మంచి ప్రదేశం సజెస్ట్ చేయాలని ఫ్యాన్స్ ని కోరింది. ఆ మధ్య కావ్య కళ్యాణ్ రామ్ మీద కొన్ని పుకార్లు వినిపించాయి. దర్శకులు ఆమెపై బాడీ షేమింగ్ కి పాల్పడ్డారని, బొద్దుగా ఉంటే అవకాశాలు రావని అన్నారని ఆమె అన్నట్లు కథనాలు వచ్చాయి. ఈ వార్తలను ఆమె ఖండించారు.

 

View this post on Instagram

 

A post shared by Kavya Kalyanram (@kavya_kalyanram)

Read Today's Latest Tollywood News, Telugu News LIVE Updates on Oktelugu

సంబంధిత వార్తలు