Jabardasth Naresh: లవర్ ని పరిచయం చేసి షాక్ ఇచ్చిన జబర్దస్త్ నరేష్… రెండేళ్లుగా సీక్రెట్ లవ్!

అయితే నరేష్ ఎట్టకేలకు తన ప్రేయసిని పరిచయం చేశాడు. చక్కని రూపంతో నరేష్ లవర్ అద్భుతంగా ఉంది. నరేష్ ప్రేయసిని చూసి జనాలు షాక్ అవుతున్నారు.

  • Written By: Neelambaram
  • Published On:
Jabardasth Naresh: లవర్ ని పరిచయం చేసి షాక్ ఇచ్చిన జబర్దస్త్ నరేష్… రెండేళ్లుగా సీక్రెట్ లవ్!

Follow us on

Jabardasth Naresh: జబర్దస్త్ నరేష్ పరిచయం అక్కర్లేని పేరు. జబర్దస్త్ సీనియర్ కమెడియన్స్ లో నరేష్ కూడా ఒకరు. వయసు పెరిగినా పొట్టిగా ఉండిపోయాడు. ఇక స్కిట్స్ లో తన సైజ్ మీదే కామెడీ రాస్తుంటారు. నరేష్ కి సపరేట్ కామెడీ స్టైల్, మేనరిజం ఉన్నాయి. ఏళ్లుగా బుల్లితెర మీద నవ్వులు పూయిస్తున్నాడు. చిన్న పిల్లాడిలా కనిపించే నరేష్ వయసులో పెద్దవాడే. ఈ క్రమంలో అతడికి పెళ్లి అయ్యిందా లేదా? ప్రేయసి ఉన్నారా? ఇలా అనేక సందేహాలు ఉన్నాయి.

అయితే నరేష్ ఎట్టకేలకు తన ప్రేయసిని పరిచయం చేశాడు. చక్కని రూపంతో నరేష్ లవర్ అద్భుతంగా ఉంది. నరేష్ ప్రేయసిని చూసి జనాలు షాక్ అవుతున్నారు. శ్రీదేవి డ్రామా కంపెనీ లేటెస్ట్ ఎపిసోడ్లో ఈ పరిణామం చోటు చేసుకుంది. యాంకర్ రష్మీ… నేను విన్నది నిజమేనా? నీకు లవర్ ఉందట కదా? అని అని నరేష్ ని అడిగింది. అవును రెండేళ్లగా రహస్యంగా ఉంచాను. ఇక చెప్పేస్తాను. నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను. అని ఓపెన్ అయ్యాడు.

తన ప్రేయసిని వేదిక మీదకు పిలిచాడు. నరేష్ లవర్ శ్రీదేవి డ్రామా కంపెనీ వేదిక మీదకు వచ్చింది. నరేష్ గురించి రొమాంటిక్ గా మాట్లాడింది. ఈ రెండేళ్లలో నన్నెంతో ప్రేమగా చూసుకున్నాడు. ప్రేమ అంటే ఏమిటో తెలియజేశాడని ఆ అమ్మాయి అన్నది. ఇద్దరు ఒకరికి మరొకరు ముద్దులు పెట్టుకున్నారు. గులాబీ, రెడ్ హార్ట్ సింబల్ ఇచ్చి మరోసారి నరేష్ ఆమెకు ప్రపోజ్ చేశాడు.

నరేష్ వాళ్ళ ఫాదర్ కూడా అక్కడే ఉన్నాడు. మరి వీరి ప్రేమను మీరు అంగీకరిస్తున్నారా? అని అడగడంతో. అంగీకరిస్తున్నాను అన్నాడు. ఇద్దరూ ఆశీర్వాదం తీసుకున్నారు. దీంతో నరేష్ కూడా ఒక ఇంటి వాడు కాబోతున్నాడని తెలుస్తుంది. కాగా గతంలో నరేష్ కి పెళ్లయింది. ఆయన భార్య ఆత్మహత్య చేసుకుందనే పుకార్లు ఉన్నాయి. అలాగే తన లవర్ మోసం చేసిందని నరేష్ ఓ సందర్భంలో చెప్పాడు.

Read Today's Latest Tollywood News, Telugu News LIVE Updates on Oktelugu

సంబంధిత వార్తలు