Sudigali Sudheer: హీరో సుధీర్ ని జబర్దస్త్ కమెడియన్ అంటున్నారా… గాలోడు రియాక్షన్ ఇదే!

జబర్దస్త్ షోతో వచ్చిన పాపులారిటీతో ఢీ షో యాంకర్ గా మారాడు. అక్కడ తన టాలెంట్స్ చూపిస్తూ బుల్లితెర స్టార్ అయ్యాడు. సుధీర్ కి మ్యాజిక్ తో పాటు సింగింగ్, డాన్స్ లో కూడా ప్రావీణ్యం ఉంది.

  • Written By: NARESH
  • Published On:
Sudigali Sudheer: హీరో సుధీర్ ని జబర్దస్త్ కమెడియన్ అంటున్నారా… గాలోడు రియాక్షన్ ఇదే!

Follow us on

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ అనగానే జబర్దస్త్ గుర్తుకు వస్తుంది. జబర్దస్త్ షో అనేక మంది సామాన్యులను స్టార్స్ చేసింది. అనసూయ, రష్మీ గౌతమ్, సుడిగాలి సుధీర్, హైపర్ ఆది, గెటప్ శ్రీను మహేష్ ఆచంట, చమ్మక్ చంద్ర, రచ్చ రవి, ఆటో రామ్ ప్రసాద్… చెప్పుకుంటూ పోతే ఈ లిస్ట్ పెద్దదే. ఒకప్పుడు తింటానికి ఉంటానికి లేక ఇబ్బంది పడిన చాలా మంది ఆర్టిస్ట్స్ సెటిల్ అయ్యారు. సుడిగాలి సుధీర్ సామాన్య కమెడియన్ గా ఎంట్రీ ఇచ్చి టీమ్ లీడర్ అయ్యాడు.

జబర్దస్త్ షోతో వచ్చిన పాపులారిటీతో ఢీ షో యాంకర్ గా మారాడు. అక్కడ తన టాలెంట్స్ చూపిస్తూ బుల్లితెర స్టార్ అయ్యాడు. సుధీర్ కి మ్యాజిక్ తో పాటు సింగింగ్, డాన్స్ లో కూడా ప్రావీణ్యం ఉంది. తర్వాత హీరోగా ఎంట్రీ ఇచ్చి సక్సెస్ కొట్టాడు. సుడిగాలి సుధీర్ సాఫ్ట్వేర్ సుధీర్, త్రీ మంకీస్ చిత్రాల్లో హీరోగా నటించాడు. మూడో చిత్రం గాలోడు తో హిట్ కొట్టాడు. ఊహించని వసూళ్లు రాబట్టిన ఈ మూవీ నిర్మాతలకు లాభాలు తెచ్చిపెట్టింది.

సుడిగాలి సుధీర్ ఇటీవల కాలింగ్ సహస్ర మూవీతో ప్రేక్షకులను పలకరించారు. తన ఇమేజ్ కి భిన్నంగా అవుట్ అండ్ అవుట్ క్రైమ్ థ్రిల్లర్ చేశాడు. అయితే ఫలితం దక్కలేదు. కాలింగ్ సహస్ర పరాజయం పై ఇటీవల ఇంటర్వ్యూలో సుధీర్ స్పందించాడు. 50 కథలు విన్న తర్వాత కాలింగ్ సహస్ర ఓకే చేశాను. నటనకు ప్రాధాన్యత ఉన్న ఓ మూవీ చేస్తే ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారో తెలుసుకోవాలి అనుకున్నాను. కాలింగ్ సహస్ర చిత్రంలో నా నటనకు ప్రశంసలు దక్కుతున్నాయి అన్నారు.

మీరు హీరో అయినా ఇంకా జబర్దస్త్ కమెడియన్ అంటున్నారు… దీనికి మీ స్పందన ఏంటని అడగ్గా… షాకింగ్ ఆన్సర్ ఇచ్చారు. నన్ను జబర్దస్త్ కమెడియన్ అని పిలిచినా నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. ఎందుకంటే నేను అక్కడ నుండి వచ్చినవాడినే. హీరో అయినా కూడా జబర్దస్త్ కమెడియన్ గా గుర్తింపు పొందడంలో నాకు ఎలాంటి అభ్యంతరం లేదన్నాడు. మరి సుధీర్ కామెంట్స్ చూస్తే ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనే మంచి మాట గుర్తుకు వస్తుంది. సుధీర్ హీరోగా మరికొన్ని ప్రాజెక్ట్స్ సెట్స్ పై ఉన్నాయి.

Read Today's Latest Tollywood News, Telugu News LIVE Updates on Oktelugu

సంబంధిత వార్తలు