Devara: దేవర సినిమా లో ఎన్టీయార్ పోషించే పాత్ర ఇదేనా..?

పాత్రల కోసం ఎన్టీఆర్ చాలా రకాలుగా కష్టపడుతున్నాడనే వార్తలు అయితే వస్తున్నాయి. అయితే ఇందులో ఒకటి హీరో క్యారెక్టర్ అవ్వగా, మరొకటి విలన్ కి సహాయం చేసే పాత్రగా తెలుస్తుంది.

  • Written By: Gopi
  • Published On:
Devara: దేవర సినిమా లో ఎన్టీయార్ పోషించే పాత్ర ఇదేనా..?

Follow us on

Devara: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న స్టార్ నటలలో ఎన్టీఆర్ ఒకరు. ఈయన చేసిన సినిమాలు వరుసగా ఇండస్ట్రీలో మంచి విజయాలు సాధించాయి. ఇక త్రిబుల్ ఆర్ సినిమాతో ఆల్ ఇండియా హీరోగా కూడా మంచి పేరు సంపాదించుకున్నాడు. ఇక అందులో భాగంగానే ఇప్పుడు బాలీవుడ్ నుంచి కూడా ఎన్టీఆర్ కు మంచి ఆఫర్లు వస్తున్నాయి ఇక ఇప్పటికే ఒక రెండు బాలీవుడ్ సినిమాలను కూడా ఎన్టీఆర్ సైన్ చేసినట్టుగా తెలుస్తుంది.ఇక ప్రస్తుతం ఎన్టీఆర్ కొరటాల శివ డైరెక్షన్ లో దేవర అనే సినిమా చేస్తున్నాడు.ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ లో నటిస్తున్నాడు…

ఇక ఈ పాత్రల కోసం ఎన్టీఆర్ చాలా రకాలుగా కష్టపడుతున్నాడనే వార్తలు అయితే వస్తున్నాయి. అయితే ఇందులో ఒకటి హీరో క్యారెక్టర్ అవ్వగా, మరొకటి విలన్ కి సహాయం చేసే పాత్రగా తెలుస్తుంది. అయితే ఈ సినిమాలో ఒకటి యంగ్ క్యారెక్టర్ కాగా మరొకటి ముసలి క్యారెక్టర్ గా తెలుస్తుంది…

ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్ర చాలామందికి హెల్ప్ చేస్తూ వాళ్ళని కాపాడుకుంటూ వచ్చే క్యారెక్టర్ కావడంతో ఈ పాత్ర పాజిటివ్ గా ఉంటుంది.ఇక ఇంకో పాత్ర లో ఎన్టీయార్ 60 ఏళ్ల ముసలి పాత్ర లో కనిపించబోతున్నాడు. యంగ్ ఎన్టీయర్ చేసే పనులు ముసలి ఎన్టీయార్ కి నచ్చక పోవడం తో అతను విలన్స్ తో చేతులు కలిపి ఎన్టీఆర్ ని నమ్ముకున్న వాళ్ళని చంపేయాలనే ఉద్దేశ్యం లో ఉంటాడు. ఎందుకంటే ముసలి ఎన్టీయార్ రౌడీ లతో కలిసి ఒక పెద్ద స్కం చేయాలని చూస్తాడు…అయితే ముసలి పాత్ర లో ఎన్టీయార్ నటన అద్భుతంగా ఉంటుందని చిత్ర యూనిట్ ఆశాభావాన్ని వ్యక్తం చేస్తుంది…

అయితే ముసలి ఎన్టీఆర్ పాత్రలో నటించిన తీరు చూస్తుంటే ఎన్టీఆర్ కి నేషనల్ అవార్డ్ పక్కాగా వస్తుంది అన్నట్టుగా ఇప్పటికే చిత్ర యూనిట్ వాళ్ల లలో వాళ్ళు డిస్కస్ చేసుకుంటున్నట్టు గా కూడా తెలుస్తుంది…అయితే ఈ సినిమాకు డైరెక్టర్ అయిన కొరటాల శివ ఈ రెండు క్యారెక్టర్ల ను కూడా చాలా అద్భుతంగా మలిచినట్టుగా తెలుస్తుంది. ఇక ఒకటి అనే కాకుండా ఎన్టీయార్ రెండు క్యారెక్టర్ లలో కూడా తన నట విశ్వరూపం చూపించబోతున్నాడు అంటూ వార్తలు వస్తున్నాయి.

ఈ సినిమా రెండు పార్టులు గా రిలీజ్ అవుతుంది అంటూ రీసెంట్ గా సినిమా యూనిట్ అఫీషియల్ గా తెలియజేసింది. అయితే ముసలి ఎన్టీఆర్ క్యారెక్టర్ ఫస్ట్ పార్ట్ లో ఉంటుందా లేదా సెకండ్ పార్ట్ లో ఉంటుందా అనేది తెలియాల్సి ఉంది…

Read Today's Latest Tollywood News, Telugu News LIVE Updates on Oktelugu

సంబంధిత వార్తలు