Damini: బిగ్ బాస్ దామిని అమ్మానాన్నలతో కలిసి ఉండకపోవడానికి అసలు కారణం ఇదేనా

బిగ్ బాస్ హౌజ్ లోకి ఎంట్రీ ఇచ్చి ప్రేక్షకులకు మరింత చేరువైంది దామిని. కానీ హౌజ్లో కొన్ని సార్లు టాస్క్ ల వల్ల నెగిటివిటి సంపాదించింది. బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లి వచ్చిన తర్వాత వరుస ఇంటర్య్వూలు ఇస్తూ ఫుల్ బిజీగా గడుపుతోంది.

  • Written By: Suresh
  • Published On:
Damini: బిగ్ బాస్ దామిని అమ్మానాన్నలతో కలిసి ఉండకపోవడానికి అసలు కారణం ఇదేనా

Follow us on

Damini: తెలుగు ప్రేక్షకులకు బిగ్ బాస్ కంటెస్టెంట్ సింగర్ దామిని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వకముందే ఈమె సింగర్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరుచుకుంది. తెలుగులో ఎన్నో సినిమాలకు పాటలు పాడి ఫిమేల్ సింగర్స్ లిస్ట్ లో ముందువరుసలో ఉంది. చాలా సందర్భాలలో బుల్లితెరపై ప్రసారం అవుతున్న కామెడీ షోలకు కూడా ఎంట్రీ ఇచ్చి లైవ్ లో కూడా ఎన్నో పాటలు పాడి ప్రేక్షకులను అలరించింది. ఇక ప్రస్తుతం తెలుగులో ప్రసారం అవుతున్న బిగ్ బాస్ సీజన్ 7లోకి కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. కానీ ఊహించని విధంగా మధ్యలోనే ఎలిమినేట్ అయింది.

బిగ్ బాస్ హౌజ్ లోకి ఎంట్రీ ఇచ్చి ప్రేక్షకులకు మరింత చేరువైంది దామిని. కానీ హౌజ్లో కొన్ని సార్లు టాస్క్ ల వల్ల నెగిటివిటి సంపాదించింది. బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లి వచ్చిన తర్వాత వరుస ఇంటర్య్వూలు ఇస్తూ ఫుల్ బిజీగా గడుపుతోంది. ఈ నేపథ్యంలోనే ఓ ఇంటర్వ్యూలో తన ఫ్యామిలీ గురించి, ఎందుకు దూరంగా ఉంటుందో దానికి గల కారణాలు కూడా తెలిపింది సింగర్ దామిని. తనకు దైవ భక్తి ఎక్కువట. అందుకే తను దేవుళ్లను పూజించడం, దేవాలయాలకు వెళ్లడం ఎక్కువగా చేస్తుందట. గుడిలో ప్రశాంతంగా ఉంటేనే వెళ్లాను అని కూడా తెలిపింది దామిని.

అమ్మనాన్నతో ఎందుకు కలిసి ఉండడం లేదనే ప్రశ్నకు సమాధానమిస్తూ.. నాకు ప్రస్తుతం 29 సంవత్సరాలు. 28 సంవత్సరాలు వచ్చే వరకు ఫ్యామిలీతోనే కలిసి ఉన్నాను. నేను మా అక్క కూడా ఇద్దరం కలిసి ఒకే బెడ్ రూమ్ లోనే ఉండే వాళ్లం. కానీ ఎప్పుడు ఒకటే విధంగా ఉండకుండా బయట ప్రపంచం తెలియాలంటే కొంచెం మారాలి. అన్ని అలవాటు చేసుకోవాలంటూ మాట్లాడింది దామిని. అందుకు వారి అమ్మానాన్నను ఒప్పించి కొద్ది రోజులు బయటకు వెళ్లాను. దీంతో ఒంటిరిగా ఒక ఇల్లు తీసుకొని ఉంటున్నాను. నాకు సంబంధించిన ప్రతి ఖర్చు నేనే భరించుకుంటాను అని తెలిపింది.

ప్రైవసీ కోసం, బయట ప్రపంచం అర్థం చేసుకోవడం కోసం మొత్తం మీద దామిని ఇంట్లో నుంచి వచ్చేసింది అన్నమాట. అయితే ఇలా ఒంటిరిగా ఉండడం వల్ల దానిని అపార్థం చేసుకుంటున్నారని వాళ్లు అనుకుంటున్నట్టుగా ఏం జరగలేదని..
అందుకే నేను మా అమ్మ నాన్నను ఒప్పించి కొద్ది రోజులు బయటికి వెళ్తాను అని చెప్పింది.బయట ఒంటరిగా ఒక ఇల్లు తీసుకుని ఉంటాను.నాకు సంబంధించిన ప్రతి ఒక ఖర్చులు నేనే భరించుకుంటాను అని చెప్పి ఇంట్లో వాళ్ళ నుంచి కొంచెం దూరం వచ్చాను అంతే..కానీ ప్రస్తుతం సమాజంలో మాత్రం దానిని తప్పుగా అపార్థం చేసుకుంటున్నారు. నేను మా అమ్మానాన్న అంగీకారంతోనే బయటకు వచ్చి స్వతంత్రంగా ఒక ఇంటిని మెయింటెన్ చేయగలనా లేదా అనేది తెలుసుకోవడానికి మాత్రమే బయటకు వచ్చాను అని తెలిపింది.

Read Today's Latest Tollywood News, Telugu News LIVE Updates on Oktelugu

సంబంధిత వార్తలు