Suman: జైలు జీవితం తర్వాత సుమన్ కు పిల్లనిచ్చి మళ్ళీ ఆయన్ని హీరోగా నిలబెట్టిన ఆ వ్యక్తి ఎవరంటే..?

అతని ఫ్రెండ్ అయిన భానుచందర్ సుమన్ ఇద్దరు కూడా మార్షల్ ఆర్ట్స్ లో ఫ్రెండ్స్ అవడం వల్ల భాను చందర్ హీరో గా ఇండస్ట్రీ కి వచ్చిన తర్వాత ఆయన ప్రోత్సాహంతో సుమన్ కూడా ఇండస్ట్రీ కి రావడం జరిగింది.

  • Written By: Gopi
  • Published On:
Suman: జైలు జీవితం తర్వాత సుమన్ కు పిల్లనిచ్చి మళ్ళీ ఆయన్ని హీరోగా నిలబెట్టిన ఆ వ్యక్తి ఎవరంటే..?

Follow us on

Suman: సినిమా ఇండస్ట్రీలో ఎదగడం అంటే మామూలు విషయం కాదు ఇక్కడ టాలెంట్ ఉన్నా కూడా హిట్లు ఉండాలి లేకపోతే ఇండస్ట్రీలో ఎక్కువ రోజులు నిలవడం చాలా కష్టమైన పనే అవుతుంది. ఈ విషయం ఇక్కడ కొందరి జీవితాలను చూస్తే తెలుస్తుంది. ఇక్కడికి హీరోలుగా వచ్చి మొదట ఒక వెలుగు వెలిగి ఆ తర్వాత కనుమరుగైన వారు ఇండస్ట్రీ లో చాలామంది ఉన్నారు. అలా కాకుండా ఇండస్ట్రీలోనే కష్ట నష్టాలు పడి వాళ్ల టాలెంట్ తో ప్రూవ్ చేసుకొని వరుస సక్సెస్ లు కొట్టి ఇండస్ట్రీలో టాప్ హీరోలుగా ఎదిగిన వారు కూడా ఉన్నారు. ఒక సక్సెస్ వచ్చిందని ఇక్కడ రిలాక్స్ అయిపోతే కుదరదు నిత్యం పోరాటం చేస్తూనే ఉండాలి.అలా అయితేనే ఇక్కడ సినిమాల్లో స్టార్లుగా రాణించగలుగుతారు. లేకపోతే చాలా తక్కువ టైంలోనే ఇండస్ట్రీ నుంచి ఫేడ్ అవుట్ అయిపోవాల్సి వస్తుంది. ఇక ఒకప్పుడు సూపర్ హీరోగా పేరు తెచ్చుకున్న నటుడు సుమన్ గురించి మనందరికీ తెలిసిందే. ఈయన తీసిన సినిమాలు అప్పట్లో మంచి విజయాలను అందుకున్నాయి. ఇక సుమన్ అసలు పేరు సుమన్ తల్వార్ ఈయనది తెలుగు రాష్ట్రం కాదు అయినప్పటికీ ఈయన చాలా స్పష్టంగా తెలుగు మాట్లాడుతూ, చదువుతూ ఉంటారు. ఇక ఇలాంటి సుమన్ మొదటగా మార్షల్ ఆర్ట్స్ లో ప్రావీణ్యం సంపాదించిన తర్వాత ఇండస్ట్రీ కి రావడం జరిగింది.

అతని ఫ్రెండ్ అయిన భానుచందర్ సుమన్ ఇద్దరు కూడా మార్షల్ ఆర్ట్స్ లో ఫ్రెండ్స్ అవడం వల్ల భాను చందర్ హీరో గా ఇండస్ట్రీ కి వచ్చిన తర్వాత ఆయన ప్రోత్సాహంతో సుమన్ కూడా ఇండస్ట్రీ కి రావడం జరిగింది. ఇలా వీళ్లిద్దరూ కూడా కలిసి కొన్ని సినిమాల్లో నటించారు. అయినప్పటికీ భానుచందర్ కంటే సుమన్ చాలా తొందరగా స్టార్ హీరోగా ఎదిగాడు. ఇండస్ట్రీ ని శాసించే స్థానానికి సుమన్ వెళ్తాడు అని అనుకున్న టైంలో నీలి చిత్రాల కేసులో ఇరుక్కొని చాలా రోజులపాటు జైల్లో గడిపాడు. సుమన్ ఆ కేసులో ఇరుక్కున్న తర్వాత ఆయనతో పాటు ప్రేక్షకులు కూడా చాలా బాధపడ్డారు…

అలా ఆయన కొద్దిరోజులు జైలు జీవితం గడిపి బయటికి వచ్చిన తర్వాత కూడా చాలా డిప్రెషన్ లోకి వెళ్లిపోయి చాలా రోజులపాటు సినిమాలు ఏమీ చేయకుండా ఖాళీగానే ఉన్నారు. ఇక ఇలాంటి టైంలో ఇండస్ట్రీలో పెద్దమనిషిగా చెప్పుకునే డి వి నరసరాజు అనే ఒక పెద్దాయన ఈయనకి తన మనవరాలు అయిన శిరీష ని సుమన్ కి ఇచ్చి పెళ్లి చేయడం జరిగింది.డి వి నరసరాజు అంటే కారు దిద్దిన కాపురం, యమగోల, రాముడు భీముడు, గుండమ్మ కథ లాంటి సినిమాలకి కథలను అందించిన రైటర్…ఈయన లాంటి పెద్దాయన సుమన్ ఏ తప్పు చేయలేదు అని సుమన్ ని నమ్మాడు..దాంతో ఇండస్ట్రీ లో ఉన్న వాళ్ళతో పాటు ప్రేక్షకులు కూడా సుమన్ ఏ తప్పు చేసి ఉండడు అందుకే ఆ పెద్దాయన ఆయనకి తన మనవరాలిని ఇచ్చి పెళ్లి చేశాడు అని అనుకొని సుమన్ సినిమాలు చూడటానికి ప్రేక్షకులు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించారు…

ఇక ఎప్పుడైతే శిరీష సుమన్ లైఫ్ లోకి వచ్చిందో సుమన్ లైఫ్ మళ్లీ గాడిలో పడింది. తను సినిమాల్లో సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టి చేసిన సినిమాలు వరుసగా సక్సెస్ లు సాధించాయి. అందులో ముఖ్యంగా చిన్నల్లుడు పెద్దింటి అల్లుడు, పరువు ప్రతిష్ట,బావ బావమరిది, అబ్బాయిగారి పెళ్లి లాంటి సినిమాలతో మంచి విజయాలను అందుకొని ఇండస్ట్రీలో మళ్లీ స్టార్ హీరో గా నెలదొక్కుకున్నాడు. దాంతో వరుసగా ఆయన సినిమాలను కూడా చాలా రోజులపాటు ప్రేక్షకులు ఆదరించారు…

కొద్దిరోజుల తర్వాత ఆయన సినిమాలు ఆడకపోవడంతో ఆయన మార్కెట్ బాగా డల్ అయింది ఇక దాంతో ప్రస్తుతం ఆయన క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేస్తూ ఇండస్ట్రీ లో సెటిల్ అయ్యాడు. ఇప్పటికి ఆయన చాలా సినిమాల్లో నటించి మంచి గుర్తింపుని తెచ్చుకున్నాడు. సుమన్ లాంటి ఒక నటుడు ఇండస్ట్రీలో ఉండడం నిజంగా ఇండస్ట్రీ చేసుకున్న అదృష్టం అనే చెప్పాలి…

Read Today's Latest Tollywood News, Telugu News LIVE Updates on Oktelugu

సంబంధిత వార్తలు