Irumudi Movie: మన తెలుగు సినిమాలకు ఇతర రాష్ట్రాల్లో ఎలాంటి ప్రాముఖ్యత ఇస్తారో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ముఖ్యంగా వాళ్ళ హీరోలకు సంబంధించిన సినిమా విడుదల అయితే, మన హీరోలకు మల్టీప్లెక్స్ థియేటర్స్ లో ఒకటి రెండు షోస్ మినహా , ఎక్కువ ఇవ్వరు. కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో ఎక్కువగా ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఉదాహరణకు గత ఏడాది భారీ అంచనాల నడుమ విడుదలైన పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ చిత్రం కర్ణాటక రాష్ట్రంలో మంచి వసూళ్లతో రన్ అవుతున్నప్పటికీ, రెండవ వారం లో ‘కాంతారా 2’ విడుదల అవ్వడంతో, బెంగళూరు సిటీ లో కనీసం 100 షోస్ కూడా కేటాయించలేదు ఓజీ చిత్రానికి. పవన్ కళ్యాణ్ లాంటి సూపర్ స్టార్, ఒక రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి సినిమాకే ఇలాంటి పరిస్థితి, ఇక మిగతా హీరోల పరిస్థితి ఎలా ఉంటుందో మీరే ఊహించుకోవచ్చు.
ఇకపోతే రీసెంట్ గానే విడుదలైన మాస్ మహారాజ రవితేజ ‘ఇరుముడి’ చిత్రానికి మొదటి ఆట నుండే ఎలాంటి సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. థియేటర్స్ వైపు జనాలు బారులు తీస్తూ, ఒక జాతర ని తలపిస్తున్నారు. ఉన్న షోస్ అసలు సరిపోవడం లేదు. ఆ స్థాయిలో హౌస్ ఫుల్స్ నమోదు అవుతున్నాయి. ముఖ్యంగా నైజాం ప్రాంతం లోని హైదరాబాద్ లో నిన్న , ఈరోజు టికెట్ ముక్క దొరకడం చాలా కష్టమైపోయింది. ఆ స్థాయిలో ఆడుతున్న సినిమాకు ఈ నెల 26 నుండి థియేటర్స్ భారీ రేంజ్ లో తగ్గనున్నాయి. కారణం ‘టాక్సిక్’ చిత్రం ఆరోజున విడుదల అవుతుంది కాబట్టి. ఈ చిత్రాన్ని నైజాం ప్రాంతం లో దిల్ రాజు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాడు. హైదరాబాద్ లోని టాప్ థియేటర్స్ మొత్తం ఈ చిత్రానికే వెళ్లిపోతున్నాయి. ‘ఇరుముడి’ నిర్మాతలు థియేటర్స్ ని హోల్డ్ చేసుకోవడం లో విఫలం అయిపోతున్నారు.
ఇంతటి వసూళ్ల సునామీ సృష్టిస్తున్న మన తెలుగు సినిమాకు థియేటర్స్ కొరత ఉండడం , అది కూడా ఒక డబ్బింగ్ సినిమా కారణంగా , ఇది చాలా దురదృష్టకరమైన సంఘటన అనే చెప్పాలి. పాపం ఎందుకో రవితేజ భారీ హిట్ కొట్టినప్పుడే ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటూ ఉంటాయి. గతం లో సంక్రాంతి కానుకగా విడుదలైన ‘క్రాక్’ చిత్రానికి కూడా ఇదే సమస్య ఎదురైంది. ప్రస్తుత తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ హీరో గా నటించిన ‘వారసుడు’ చిత్రం కోసం ‘క్రాక్’ థియేటర్స్ ని తీసేయాల్సి వచ్చింది. మంచి రన్ ఉన్నప్పటికీ కూడా ఇవ్వలేదు. మొన్న ‘వారసుడు’, ‘నేడు టాక్సిక్’ ఈ రెండు సినిమాలను నైజాం ప్రాంతం లో డిస్ట్రిబ్యూట్ చేసింది దిల్ రాజు నే అవ్వడం గమనార్హం.