Homeఆంధ్రప్రదేశ్‌జగన్ పై రఘురామ ట్రాప్.. అడ్డంగా బుక్కైనట్లేనా?

జగన్ పై రఘురామ ట్రాప్.. అడ్డంగా బుక్కైనట్లేనా?

Raghurama Raju vs CM Jaganవైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణం రాజు వ్యవహారం చివరికి చేరినట్లు అనిపిస్తోంది.రెబల్ ఎంపీపై అనర్హత వేటు వేయాలని వైసీపీ ఎంపీలు ఫిర్యాదు చేసినా లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా పట్టించుకోకపోవడంతో ఒత్తిడి పెంచేందుకు వైసీపీ తీసుకున్న నిర్ణయం రఘురామకే మేలు చేసేలా ఉంది. జగన్ బెయిల్ రద్దు కోసం రఘురామ చేస్తున్న పోరాటం, దానికి వైసీపీ నుంచి ఎదురవుతున్న ప్రతిఘటన ఇప్పుడు జాతీయ స్థాయిలో రచ్చ చేయబోతోంది.

వైసీపీపై రఘురామ చేస్తున్న పోరాటం ఏడాదిన్నరగా సాగుతోంది. దీంతో జగన్ చిక్కులు ఎదుర్కోవాల్సి వస్తోంది. రఘురామపై పెట్టిన సీఐడీ కేసు తర్వాత ఆయన రూటు మార్చడంతో ఇప్పుడు వైసీపీకి కొత్త చిక్కులు వచ్చి పడుతున్నాయి. జగన్ వర్సెస్ రఘురామ అంకం తుది దశకు చేరుకుంటుందని అందరు భావిస్తున్నారు. అయితే ప్రభుత్వం ప్రయోగించే బుల్లెట్ మిస్ ఫైర్ అయితే మాత్రం జగన్ మరింత కష్టాల్లో పడిపోవడం ఖాయంగా కనిపిస్తోంది.

రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజుపై వేటు కోసం లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాను కలిసి పలుమార్లు విన్నవించినా పలితం లేకపోయింది. స్పందన లేకపోవడంతో ఇక ముఖాముఖి పోరుకే రెడీ అయిపోయారు. లోక్ సభ స్పీకర్ ను టార్గెట్ చేస్తూ పార్లమెంట్ లో నిరసన చేపట్టేందుకు నిర్ణయించుకున్నట్లు సమాచారం. దీంతో పార్లమెంట్ సమావేశాల్లో వైసీపీ ఎంపీలంతా రఘురామపై అనర్హత వేటు వేయాలని నిరసన చేపట్టబోతున్నట్లు తెలుస్తోంది. దీనికి పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి నేతృత్వం వహిస్తున్నట్లు సమాచారం. దీంతో వైసీపీ చేస్తున్న పోరు తుది అంకానికి చేరినట్లు భావిస్తున్నారు.

మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ జగన్, రఘురామ వ్యవహారంలో క్లైమాక్స్ ఏంటో చెప్పేశారు. ఒక ఎంపీపై ప్రజల మద్దతు కలిగిన సీఎం పోరాటం చేయడం ఆయనకే నష్టమని స్పష్టం చేశారు. ఏడాదిన్నర క్రితం మొదలైన రఘురామ పోరు ఇప్పుడు పతాక స్థాయికి చేరిందని అని పేర్కొన్నారు. రఘురామ విసురుతున్న వలలో జగన్ చిక్కుకుంటారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

పార్లమెంట్ లో వైసీపీ ఎంపీలంతా నిరసనకు దిగితే అది రఘురామకే ప్లస్ అయ్యే అవకాశాలున్నాయి. ఇంత మంది ఎంపీలు అంతా కలిసి ఒకడినే టార్గెట్ చేస్తే ప్రచారం ఇంకా ఎక్కువగా వస్తుంది. ఇప్పటికే జగన్ బెయిల్ రద్దు కోరుతున్న రెబల్ ఎంపీగా జాతీయ స్థాయిలో పెరుతెచ్చుకున్న రఘురామ ఇప్పుడు పార్టమెంట్ లో సైతం తన ప్రభావాన్ని చూపించుకున్నట్లు అవుతుంది. మొత్తానికి పార్లమెంట్ వేదికగా దేశం మొత్తం ప్రచారం అయ్యే వీలుంటుంది. అప్పుడు వైసీపీకే నష్టం కలిగే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులుచెబుతున్నారు.

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.

Related News

Most Popular

AP Heavy Rains

AP Heavy Rains: ఏపీకి భారీ వాయుగుండం.. అయినా సరే!

AP Heavy Rains: బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడింది. ఇది తీవ్ర వాయుగుండం గా మారింది. ప్రస్తుతం ఉత్తరం వైపు ప్రయాణిస్తూ ఒడిస్సాలోని బాలాసోర్, పశ్చిమ బెంగాల్లోని హల్దియా మధ్య కేంద్రీకృతమై ఉంది. ఈరోజు...
TDP MLC Candidates

TDP MLC Candidates: ఆశావహులు 20 మంది.. టిడిపిలో ఆ ఇద్దరికీ ఎమ్మెల్సీ పదవి!

TDP MLC Candidates: ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల సందడి ప్రారంభం అయింది. గత వైసిపి ప్రభుత్వంలో గవర్నర్ కోటా కింద ఎన్నికైన ఇద్దరు ఎమ్మెల్సీలు పదవీ విరమణ చేయనున్నారు. మండలి డిప్యూటీ చైర్...
ADR Report 2026

ADR Report 2026: ఏడీఆర్ నివేదిక: ఆ విషయంలో రేవంత్ ను ఎవరూ బీట్ చేయలేరు..

ADR Report 2026: దేశంలో రాజకీయ నాయకుల మీద ఉన్న కేసులు.. వారు సంపాదించిన ఆస్తులు.. ఇతర వ్యవహారాల మీద ఎప్పటికప్పుడు అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రి ఫార్మ్స్ అనే సంస్థ...
West Indies vs Pakistan

West Indies vs Pakistan: పాపం పాకిస్తాన్.. వెస్టిండీస్ బౌలర్ గ్రీవ్స్ దెబ్బకు తోక ముడిచింది..

West Indies vs Pakistan: ఆ బంతులు బుల్లెట్లు.. చూస్తుండగానే వికెట్లను పడగొట్టాయి. చూస్తుండగానే వికెట్ల మందు దొరకబుచ్చుకున్నాయి.. చూస్తుండగానే బ్యాటర్లకు నరకం చూపించాయి. ఇదంతా కూడా ఒక్కడు చేసిన అద్భుతం....
Jogi Ramesh

Jogi Ramesh: జోగి రమేష్ మతమార్పిడి.. దుర్గమ్మ వద్ద ప్రమాణం!

Jogi Ramesh: వైసీపీలో పదవి కావాలంటే మతం మారాలా? క్రిస్టియన్ మతం తీసుకోవాల్సిందేనా? వైసీపీలో ఉన్న నేతల్లో ఎక్కువమంది అలానే చేసారా? ఇప్పుడు పొలిటికల్ వర్గాల్లో దీనిపై చర్చ నడుస్తోంది. తాజాగా మాజీ...
Oktelugu Epaper