Homeఆధ్యాత్మికంToday horoscope in telugu 18.8.2026 : ఈ ఐదు రాశుల వారు ఈరోజు గొప్ప...

Today horoscope in telugu 18.8.2026 : ఈ ఐదు రాశుల వారు ఈరోజు గొప్ప వారవుతారు..

Today horoscope in telugu : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మంగళవారం ద్వాదశ రాశులపై స్వాతి నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కొన్ని రాశుల వారికి ఈరోజు అదృష్టం తలుపు తట్టనుంది. మరికొన్ని రాశుల వారు ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి. మేషం నుంచి మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం.. మేష రాశి (అశ్విని, భరణి,1,2,): ఈ రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉండే అవకాశం ఉంది. ఆత్మవిశ్వాసంతో […]

Today horoscope in telugu : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మంగళవారం ద్వాదశ రాశులపై స్వాతి నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కొన్ని రాశుల వారికి ఈరోజు అదృష్టం తలుపు తట్టనుంది. మరికొన్ని రాశుల వారు ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి. మేషం నుంచి మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం..

మేష రాశి (అశ్విని, భరణి,1,2,): ఈ రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉండే అవకాశం ఉంది. ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తారు. జీవిత భాగస్వామితో వాగ్వాదాలు ఉండే అవకాశం ఉంటుంది. ఇలాంటి సమయంలో మౌనంగా ఉండడమే మంచిది. వ్యాపారులకు కలిసి వస్తుంది. ఉద్యోగులకు కొత్త బాధ్యతలు ఏర్పడతాయి. ఒత్తిడి లేకుండా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. దూర ప్రయాణాలు చేయాల్సివస్తుంది.

వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : ఈ రాశి ఉద్యోగులకు ఈరోజు ప్రశంసలు దక్కుతాయి. మాటతీరుతో ఎటివారిని ఆకట్టుకుంటారు. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి ఇప్పుడు లాభాలు పొందుతారు. అయితే కొత్తగా పనులు ప్రారంభించడానికి ఈరోజు సరైనది కాదు. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. కానీ నాణ్యమైన ఆహారాన్ని తీసుకునే ప్రయత్నం చేయాలి. పిల్లల కెరీర్ పై కీలక నిర్ణయం తీసుకుంటారు.

మిథున రాశి( మృగశిర 3,4 ): ఈ రాశి వారు ఈరోజు ఎక్కువగా కుటుంబ సభ్యులతో గడుపుతారు. జీవిత భాగస్వామి కోసం వస్తువులు కొనుగోలు చేస్తారు. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు. కోపాన్ని నియంత్రించుకునేందుకు ప్రయత్నించాలి. ఇలాంటి సమయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోకూడదు. ఆర్థిక సమస్యలు తొలగిపోయే అవకాశాలుంటాయి. మానసికంగా ప్రశాంతంగా ఉంటారు.

కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : ఈ రాశి వారు ఈ రోజు వస్తువుల కొనుగోలు చేస్తారు. జీవిత భాగస్వామితో దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఆరోగ్య సమస్యలు ఉంటాయి. వీటి విషయంలో నిర్లక్ష్యంగా ఉండకూడదు. బంధువుల మధ్య సంబంధాలు పెరిగిపోతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. పిల్లల కెరీర్ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంటారు. కొత్తగా పెట్టుబడులు పెట్టడానికి ఇదే మంచి సమయం.

సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : ఈ రాశి వారికి ఈ రోజు ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది. ఉద్యోగులకు పదోన్నతులు వచ్చే అవకాశాలు ఉంటాయి. వ్యాపారులకు అదనపు ఆదాయం చేయగలుగుతుంది. అయితే కొన్ని విషయాల్లో అధిక కోపాన్ని ప్రదర్శించవద్దు. సమాజంలో గౌరవం లభించే అవకాశం ఉంటుంది. ఇలాంటి సమయంలో మాట తీరును మెరుగుపరుచుకోవాలి. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు.

కన్య రాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : ఈ రాశి వారికి ఈ రోజు ఉన్న ఫలంగా లాభాలు వస్తాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఆరోగ్య సమస్యల నుంచి బయటపడతారు. పూర్వికులు ఆస్తికి సంబంధించి శుభవార్తలు వింటారు. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి ఇప్పుడు లాభాలు పొందుతారు. స్నేహితులతో ఉల్లాసంగా ఉంటారు. కుటుంబ సభ్యులతో విహారయాత్రలకు వెళ్లేందుకు ప్లాన్ చేస్తారు.

తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : ఈ రాశి వారికి ఈ రోజు అన్ని అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. కొత్తగా పెట్టుబడులు పెట్టడానికి అనుకూలంగా ఉంటుంది. సమాజంలో గౌరవం లభిస్తుంది. ఆకస్మిక నిర్ణయాల వల్ల కొన్ని ముఖ్యమైన పనులు పూర్తవుతాయి. వ్యాపారస్తులు కొత్తగా ప్రాజెక్టులను చేపడతారు. భావోద్వేగాలకు లోనవుతారు. విద్యార్థుల కెరీర్ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంటారు.

వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : ఈ రాశి వారికి ఈ రోజు శుభవార్తలు అందుతాయి. అయితే ఇతరులతో జాగ్రత్తగా ఉండాలి. ఇంట్లోని రహస్యాలు ఇతరులకు చెప్పకూడదు. వ్యాపారులు కొత్తగా పెట్టుబడులు పెట్టాల్సి వస్తే కుటుంబ సభ్యుల సలహా తీసుకోవాలి. మానసికంగా ఆందోళన ఉన్నట్లయితే ధ్యానం వైపు దృష్టి పెట్టాలి. ఉద్యోగులకు ఊహించని విధంగా ఆదాయం ఏర్పడుతుంది. దూర ప్రయాణాలకు ఇదే మంచి సమయం.

ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : ఈ రాశి వ్యాపారులకు ఈరోజు అత్యధిక లాభాలు ఉంటాయి. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. పాత బాకీలు వసూలు అవుతాయి. అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. అర్హులైన వారికి వివాహ ప్రతిపాదనలు వస్తాయి. ఉద్యోగులు కొత్త బాధ్యతలు చేపడతారు. అనవసరపు వివాదాల్లోకి తలదూర్చకుండా ఉండాలి.

మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : ఈ రాశి వారికి ఈ రోజు కొత్త అవకాశాలు లభిస్తాయి. వ్యాపారులు గతంలో కంటే ఇప్పుడు అధిక లాభాలు పొందుతారు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. కుటుంబ జీవితం సంతోషంగా సాగుతుంది. శారీరక శ్రమ వలన ఆరోగ్యంగా ఉండగలుగుతారు. అవసరమైన విశ్రాంతి తీసుకోవాలి. కొత్తగా పెట్టుబడును పెట్టేవారు పెద్దలను సంప్రదించాలి.

కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) :. ఈ రాశి వారికి ఈ రోజు కుటుంబ సభ్యుల మద్దతు ఉంటుంది. అనుకోకుండా అదృష్టం కలిసి వస్తుంది. దీంతో ఉద్యోగులకు అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ఆర్థిక లావాదేవీలు మెరుగుపడతాయి. గతంలో కంటే ఇప్పుడు ఆదాయం ఎక్కువగా ఉంటుంది. అయితే కొత్తగా పెట్టుబడులు పెట్టేవారు కొన్ని రోజులు వెయిట్ చేయడం మంచిది. ఎవరికైనా డబ్బు ఇస్తే తిరిగి వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి.

మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : ఈ రాశి వారు ఈ రోజు వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. నిర్ణయాలు తీసుకునేటప్పుడు బాగా ఆలోచించాలి. కొందరికి డబ్బు నష్టం జరిగే అవకాశం ఉంటుంది. అందువల్ల ఎవరితోనైనా ఆర్థిక వ్యవహారాలు జరిపేటప్పుడు ఆచితూచి వ్యవహరించాలి. మానసికంగా ప్రశాంతంగా ఉండే ప్రయత్నం చేయాలి.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Related News

Most Popular

Oktelugu Epaper