హీరోయిన్ల పెళ్లి పెటాకులవడం అనేది ఎప్పటి నుండో వస్తోన్న ఆనవాయితీ అని, సినిమా ఇండస్ట్రీలో విడాకుల వ్యవహారం చాలా మామూలు విషయం అని ఇలా గతంలో పిచ్చి పిచ్చి కామెంట్స్ చేసిన బాలీవుడ్ సినీ విశ్లేషకుడు కమల్ ఆర్ ఖాన్, మరో సారి తన పైత్యాన్ని ప్రదర్శించాడు. అయితే, ఈ సారి ఆ పైత్యం గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా మీద ఎక్కువ ప్రభావం చూపింది.
రానున్న కాలంలో ప్రియాంక చోప్రాకి విడాకులు ఖాయం అంటూ ఈ సినీ విశ్లేషకుడు చెప్పుకొచ్చాడు. ఈ సందర్భంగా ‘ప్రియాంకకు ఆమె భర్త నిక్ జోనస్ మరో పది సంవత్సరాలలో విడాకులు ఇవ్వడం తథ్యం’ అని ఏదో బ్రహ్మంగారు కాలజ్ఞానం చెప్పినట్లు చెప్తూ కేఆర్‌కే ఒక ట్వీట్ పడేశాడు. ఆ ట్వీట్ చూసిన నెటిజన్లు అతగాడి మీద విరుచుకుపడుతున్నారు.
ఇక ప్రియాంక ఫ్యాన్స్ అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ‘ప్రియాంక జంట విడిపోవాలని కోరుకునే హక్కు నీకెక్కడిది ? నువ్వు ఒక పనికిమాలిన వెధవ్వి.. స్టార్ల వ్యక్తిగత విషయాల గురించి నువ్వు మాట్లాడకపోతేనే నీకు మంచిది. లేకపోతే నువ్వు ఎన్నో బాధలు అనుభవించాల్సి ఉంటుంది’ అంటూ నెటిజన్లు మండిపడుతున్నారు.
అయినా ఈ ‘ప్రిడిక్షన్’ పైత్యంతో నోటికొచ్చినట్లు మాట్లాడే కేఆర్‌కేను పబ్లిక్ లో చితక్కొట్టాలని.. అసలు ఇతగాడికి ప్రతిదాంట్లో తలదూర్చడం అలవాటు అయిపోయింది అని, అందుకే ఆ అలవాటు మానుకునేలా అతనికి తగిన శాస్తి చేయాలని సల్మాన్ ఖాన్ ఫ్యాన్స్ రంగంలోకి దిగారు. ఎవరు తనను ఎంతగా బెదిరించినా సెలబ్రిటీల మీద వ్యంగ్యాస్త్రాలు సంధించడమే తన బాధ్యత అన్నట్టు ఉండే కేఆర్‌కే ఇప్పట్లో ఎవర్నీ వదిలిపెట్టేలా లేడు.