Homeఆంధ్రప్రదేశ్‌Chandrababu Naidu : 2000 ఇచ్చి.. రెండు లక్షలు తీసుకుంటారు.. చంద్రబాబు చెప్పింది అక్షరాలా నిజం..

Chandrababu Naidu : 2000 ఇచ్చి.. రెండు లక్షలు తీసుకుంటారు.. చంద్రబాబు చెప్పింది అక్షరాలా నిజం..

Chandrababu Naidu : 2024 లో ఏపీ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తర్వాత చంద్రబాబు పూర్తిగా మారిపోయారు. తన 3.0 చూపిస్తున్నారు. గతంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రానికి సీఈఓ లాగా వ్యవహరించేవారు. తక్కువ మాట్లాడుతూ ఎక్కువ పని చేసేవారు. ఎప్పుడూ సీరియస్ లుక్ లో కనిపించేవారు. 2024లో ఏపీ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తర్వాత చంద్రబాబు పూర్తిగా మారిపోయారు. తన 3.0 చూపిస్తున్నారు. పింఛన్ల పంపిణీ.. పార్టీ సీనియర్ నాయకులను కలుసుకోవడం.. వారితో మాట్లాడటం.. పేదల […]

Chandrababu Naidu : 2024 లో ఏపీ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తర్వాత చంద్రబాబు పూర్తిగా మారిపోయారు. తన 3.0 చూపిస్తున్నారు. గతంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రానికి సీఈఓ లాగా వ్యవహరించేవారు. తక్కువ మాట్లాడుతూ ఎక్కువ పని చేసేవారు. ఎప్పుడూ సీరియస్ లుక్ లో కనిపించేవారు.

2024లో ఏపీ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తర్వాత చంద్రబాబు పూర్తిగా మారిపోయారు. తన 3.0 చూపిస్తున్నారు. పింఛన్ల పంపిణీ.. పార్టీ సీనియర్ నాయకులను కలుసుకోవడం.. వారితో మాట్లాడటం.. పేదల ఇంట్లోకి వెళ్లి భోజనం చేయడం.. వారితో కలిసి ఫోటోలు దిగడం వంటివి చేస్తున్నారు. తద్వారా చంద్రబాబు మారిపోయారు అనే సంకేతాలను ఏపీ ప్రజలకు ఇస్తున్నారు. వాస్తవానికి 70 ఏళ్లకు పైబడిన వయసులో కూడా చంద్రబాబు అదే ఉత్సాహంతో కనిపిస్తున్నారు. నవ యువకుడి లాగా ఏపీ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నారు.

స్వాతంత్ర వేడుకల్లో భాగంగా జరిగిన కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహిళలతో ఆయన సరదాగా మాట్లాడారు. ఎన్నికల సరళి.. ప్రజాస్వామ్యం వాటి వాటి మీద చంద్రబాబు మహిళలకు అర్థమయ్యే భాషలో చెప్పారు. మీరు ఎన్నికల సమయంలో నాయకుల దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటారు. వారు ఒక్కొక్క ఓటుకు 2000 చొప్పున ఇస్తారు. ఆ తర్వాత ఐదేళ్లలో మీకు ఇచ్చిన 2000 మీద రెండు లక్షల వరకు సంపాదిస్తారు. దీనివల్ల అవినీతి పెరిగిపోతుంది. రాజకీయ నాయకులు అవినీతికి పాల్పడితే రూపుమాపడం చాలా కష్టం. అందువల్లే మీరు ఎన్నికల సమయంలో ఓటును అమ్ముకోకూడదు. 2000 ఇస్తే మాకొద్దు అని చెప్పాలి. ఓటర్లలో చైతన్యం రావాలి. అప్పుడే వ్యవస్థ బాగుంటుందని”చంద్రబాబు చెప్పారు.

“ఎన్నికల సమయంలో ఓటుకు డబ్బులు తీసుకోకపోతే నాయకుల్లో భయం పెరుగుతుంది. జవాబుదారితనం ప్రదర్శించాలని అనిపిస్తుంది. అప్పుడు వ్యవస్థ బాగుంటుంది. అవినీతికి ఆస్కారం ఉండదు. నల్లధనం పోగుపడదు. అప్పుడు అభివృద్ధి అద్భుతంగా సాగిపోతూ ఉంటుంది. ప్రజలు చెల్లించే పన్నులకు సార్ధకత లభిస్తుందని” చంద్రబాబు పేర్కొన్నారు. చంద్రబాబు మాట్లాడిన ఈ మాటలు అందరిని ఆలోచింపజేస్తున్నాయి. చంద్రబాబు వాస్తవ పరిస్థితిని తెలియజేశారని.. ఆయన మాటలను ఓటర్లు మొత్తం ఆచరిస్తే ప్రజాస్వామ్యం ప్రక్షాళన అవుతుందని.. మెరుగైన సమాజం ఏర్పడుతుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఓటర్లు డబ్బులు తీసుకోవడం మానేస్తే అవినీతికి ఆస్కారం లేని స్వచ్ఛమైన సమాజం ఏర్పడుతుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Related News

Most Popular

Oktelugu Epaper