Homeఆంధ్రప్రదేశ్‌Botsa Satyanarayana: బొత్సపై అచ్చెన్న ఫైర్.. ఏపీ మండలిలో అరుదైన సీన్లు!

Botsa Satyanarayana: బొత్సపై అచ్చెన్న ఫైర్.. ఏపీ మండలిలో అరుదైన సీన్లు!

Botsa Satyanarayana: ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ దూకుడు ప్రదర్శిస్తోంది. దానిని బాగానే తిప్పికొడుతోంది కూటమి. ప్రారంభం నుంచి 2025 డీఎస్సీలో అక్రమాలు అంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు చేయడం ప్రారంభించింది. అయితే ఆ చర్చకు సిద్ధం అన్నట్టు ప్రకటించి ఎదురు దాడి చేస్తుంది కూటమి. అయితే అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి శాసనసభకు హాజరు కాలేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ప్రతిపక్ష హోదా ఇవ్వకపోవడం అనే దానిపై నిరసన వ్యక్తం […]

Botsa Satyanarayana: ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ దూకుడు ప్రదర్శిస్తోంది. దానిని బాగానే తిప్పికొడుతోంది కూటమి. ప్రారంభం నుంచి 2025 డీఎస్సీలో అక్రమాలు అంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు చేయడం ప్రారంభించింది. అయితే ఆ చర్చకు సిద్ధం అన్నట్టు ప్రకటించి ఎదురు దాడి చేస్తుంది కూటమి. అయితే అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి శాసనసభకు హాజరు కాలేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ప్రతిపక్ష హోదా ఇవ్వకపోవడం అనే దానిపై నిరసన వ్యక్తం చేస్తూ శాసనసభకు వైసిపి గైర్హాజరవుతున్న సంగతి తెలిసిందే. ఈసారి కూడా అదే కారణంతో వైసిపి అసెంబ్లీకి హాజరు కాలేదు. కానీ శాసనమండలికి మాత్రం హాజరైంది. తగినంత సంఖ్యా బలంతో పాటు ప్రతిపక్ష హోదా ఉండడంతో అక్కడ గట్టిగానే వాదనలు వినిపిస్తోంది.

* ప్రారంభం నుంచే దాడి..
అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా మండలి సమావేశం ప్రారంభమైంది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పక్ష నాయకుడు బొత్స సత్యనారాయణ డీఎస్సీ 2025లో అక్రమాలు జరిగాయని ఆరోపించారు. అది మెగా డీఎస్సీ కాదని.. దగా డిఎస్సీ అంటూ విమర్శలు చేశారు. దీనిపై మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు గట్టిగానే తిప్పి కొట్టారు. పూర్తి పారదర్శకంగా డీఎస్సీ 2025 ఉపాధ్యాయుల భర్తీ ప్రక్రియ చేపట్టామని.. చర్చకు సిద్ధమని ప్రకటించారు. పూర్తిస్థాయిలో తమ వాదనలు వినిపించి ఇది కరెక్ట్ అని చెప్పే ధైర్యం తమకు ఉందని.. సరైన ఆధారాలతో రాగలరా అంటూ సవాల్ చేశారు. ఆధారాలు లేని ఆరోపణలు చేస్తూ వేలాదిమంది ఉపాధ్యాయుల జీవితాలతో ఆటలు ఆడుకుంటున్నారని.. ఇది మంచి పద్ధతి కాదు అంటూ మంత్రి హెచ్చరించారు.

* ఓ రేంజ్ లో విరుచుకు పడిన మంత్రి..
బొత్స సత్యనారాయణ అదే పనిగా డీఎస్సీ 2025 లో అక్రమాలు జరిగాయి అంటూ ఆరోపించడంతో.. మంత్రి కింజరాపు అచ్చెనాయుడు ఒక్కసారిగా ఫైర్ అయ్యారు. ఐదేళ్లు విద్యాశాఖ మంత్రిగా ఒక్క డీఎస్సీ అయినా ప్రకటించారా అంటూ ప్రశ్నించారు. మీ గొడ్డలి పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డిని ఒప్పించలేకపోయారంటూ ఎద్దేవా చేశారు. ఇప్పుడు దద్దమ్మలా మాట్లాడుతున్నారు అంటూ గట్టిగానే విరుచుకుపడ్డారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి కేకలు, అరుపులు వచ్చిన మంత్రి వెనక్కి తగ్గలేదు. తాము పారదర్శకంగా జరిపిన డీఎస్సీ ఉపాధ్యాయ నియామక ప్రక్రియ పై బురద జల్లుతారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం ఒక్క డీఎస్సీ అయినా ప్రకటించకపోగా.. తాము వేలాది పోస్టులను భర్తీ చేస్తే దానిపై విషయం చిమ్ముతారా అంటూ మంత్రి ఫైర్ అయ్యారు. నాలుగు రోజులపాటు సభలోనే ఉంటామని.. డీఎస్సీ 2025లో అక్రమాలు జరిగాయని ఆధారాలు చూపించాలంటూ సవాల్ చేశారు. చివరి వరకు చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని.. గొడ్డలి పార్టీ సిద్ధంగా ఉందా అంటూ నిలదీసే ప్రయత్నం చేశారు. మొత్తానికి అయితే అసెంబ్లీ సమావేశాలు ఇలా మొదలయ్యాయో లేదో.. అప్పుడే గొడవలు ప్రారంభం కావడం విశేషం.

 

View this post on Instagram

 

A post shared by TDP AT 175 (@tdpat175)

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

Oktelugu Epaper