Rajamouli : రాజమౌళి తన కెరియర్ లో ఇప్పటి వరకు చేసిన ప్రతి సినిమాతో సూపర్ సక్సెస్ ని సాధించాడు. ఆయన చేసిన 12 సినిమాల్లో 12 మూవీస్ కూడా భారీ విజయాన్ని సాధించడం అనేది నిజంగా చాలా గొప్ప విషయమనే చెప్పాలి. ప్రస్తుతం మహేష్ బాబుతో చేస్తున్న ‘వారణాసి’ సినిమాతో మరోసారి ఇండస్ట్రీ రికార్డ్ లను తిరగరాయడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు దూసుకెళ్తున్నాడు. ఇక రాజమౌళి ఇప్పటివరకు ఫెయిల్యూర్ ని చూడలేదు. కాబట్టి వారణాసి సినిమా ను సక్సెస్ తీరాలకు చేర్చడంలో ఆయన చాలావరకు ముందుండి నడిపిస్తున్నాడనే వార్తలయితే వస్తున్నాయి. రాజమౌళి నుంచి ఒక సినిమా వస్తుందంటే చాలు అది విజువల్ వండర్ గా తెరకెక్కుతుందనే విషయం మనందరికి తెలిసిందే…గతంలో బాహుబలి ‘త్రిబుల్ ఆర్’ లాంటి సినిమాలతో గొప్ప క్రేజ్ ను అందుకున్న ఆయన ప్రస్తుతం పాన్ వరల్డ్ లోకి ఎంట్రీ ఇవ్వాలనే ప్రయత్నం చేస్తున్నాడు… ఇక ఇలాంటి క్రమంలోనే ఇప్పుడు ఆయన నుంచి రాబోయే సినిమాతో ప్రతి ఒక్కరు చాలా రకాల చర్చలైతే లేవనెత్తుతున్నారు. నిజానికి ఈ సినిమా కోసం మొదట 1000 కోట్ల బడ్జెట్ ని అనుకున్నారు. ఆ తర్వాత 1200 కోట్లు, ఇప్పుడు 1600 కోట్ల బడ్జెట్ తో వారణాసి సినిమా తెరకెక్కుతుంది.
ఈ సినిమా సక్సెస్ ఫుల్ టాక్ ను సంపాదించుకుంటే పర్లేదు కానీ ఫెయిల్యూర్ టాక్ వస్తే మాత్రం ఈ సినిమాకి విపరీతమైన నష్టాలు వచ్చే అవకాశాలైతే ఉన్నాయని మరి కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే రాజమౌళి తన సినిమాలో నటించే ఆర్టిస్టులతో ఎక్కువగా మాట్లాడుతూ వాళ్ల నుంచి తనకు ఏదైతే కావాలో వాళ్ళకి చెప్పి వాళ్ళ నుంచి రాబట్టుకునే ప్రయత్నం చేస్తాడు.
ఇక ఇలా తను శాంతి నివాసం అనే సీరియల్ తీసినప్పుడు ఒక సీనియర్ నటుడైతే రాజమౌళితో గొడవకి దిగాడాట. ఇంతకీ ఆ నటుడు ఎవరంటే రంగనాథ్ గారు కావడం విశేషం…రాజమౌళి తీసిన ‘శాంతినివాసం’ సీరియల్లో రంగనాథ్ మేజర్ రోల్ లో నటించాడు. ఆ సమయంలో రంగనాథ్ చేసిన యాక్టింగ్ విషయంలో రాజమౌళి అసంతృప్తిని వ్యక్తం చేశాడట.
దాంతో అప్పటికి రాజమౌళి ఎస్టాబ్లిష్ డైరెక్టర్ కాదు. కాబట్టి రంగనాథ్ రాజమౌళి మీద అరిచారట. దాంతో రాజమౌళి సైతం చేసేది ఏమీ లేక కామ్ గా ఉన్నారట. ఆ తర్వాత రాజమౌళి స్టార్ డైరెక్టర్ గా మారిపోవడంతో రంగనాథ్ తన సినిమాలో పెట్టుకోలేదని ఆ సందర్భంలో రాజమౌళి తనని ఎందుకు తీసుకోవడం లేదనే విషయాన్ని ఒక యాంకర్ అడిగినప్పుడు రంగనాథ్ స్వయంగా ఈ విషయాన్ని తెలియజేశాడు. అది మనసులో పెట్టుకొని రాజమౌళి తనని తీసుకోవడం లేదంటూ ఆయన మాట్లాడిన మాటలు అప్పట్లో నెట్టింట వైరల్ అయ్యాయి…ఇక రీసెంట్ గా ఈ విషయం మీద విజయేంద్ర ప్రసాద్ కూడా క్లారిటీ ఇచ్చాడు…