Homeఎంటర్టైన్మెంట్Bigg Boss Telugu 10 : బిగ్ బాస్ 10 మొదటి ఎపిసోడ్ కి రానున్న...

Bigg Boss Telugu 10 : బిగ్ బాస్ 10 మొదటి ఎపిసోడ్ కి రానున్న పాన్ ఇండియన్ స్టార్ హీరో…

Bigg Boss Telugu 10 : ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీ తో పాటుగా బుల్లితెర మీద వచ్చే కొన్ని రియాల్టీ షోలు సైతం ప్రేక్షకులను విశేషంగా అలరిస్తున్నాయి. నిజానికి సినిమాల కంటే రియల్టీ షో లకే ప్రేక్షకుల్లో ఎక్కువ ఆదరణ దక్కుతుంది. వాటిని చూసి ఎంజాయ్ చేసేవారు చాలా మంది ఉన్నారు. ఇక అందులో బిగ్ బాస్ షో ఒకటి…స్టార్ మా వాళ్ళు చాలా ప్రస్టేజియస్ గా తీసుకుని చేస్తున్న ఈ షో గత 9 సీజన్స్ […]

Bigg Boss Telugu 10 : ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీ తో పాటుగా బుల్లితెర మీద వచ్చే కొన్ని రియాల్టీ షోలు సైతం ప్రేక్షకులను విశేషంగా అలరిస్తున్నాయి. నిజానికి సినిమాల కంటే రియల్టీ షో లకే ప్రేక్షకుల్లో ఎక్కువ ఆదరణ దక్కుతుంది. వాటిని చూసి ఎంజాయ్ చేసేవారు చాలా మంది ఉన్నారు. ఇక అందులో బిగ్ బాస్ షో ఒకటి…స్టార్ మా వాళ్ళు చాలా ప్రస్టేజియస్ గా తీసుకుని చేస్తున్న ఈ షో గత 9 సీజన్స్ గా చాలా బాగా వర్క్ అవుట్ అయింది. ఇక ఇప్పుడు 10 వ సీజన్ సైతం స్టార్ట్ అవ్వడానికి సిద్ధమవుతుంది. ఇందులో ఎవరు కంటెస్టెంట్లుగా రాబోతున్నారనే విషయం పక్కన పెడితే మొదటి ఎపిసోడ్ కి ప్రభాస్ చీఫ్ గెస్ట్ గా రాబోతున్నాడనే విషయం చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఈ షో కి నాగార్జున హోస్టుగా చేస్తున్న విషయం మనందరికి తెలిసిందే…

ఇక ప్రభాస్ మొదటి ఎపిసోడ్ కు వచ్చి ఈ షో లో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి ఆల్ ది బెస్ట్ చెప్పబోతున్నారట. ఇక ఏది ఏమైనా కూడా ప్రభాస్ ఈ షోలో పాల్గొంటే మాత్రం షో బ్రాండ్ వాల్యూ విపరీతంగా పెరిగిపోతుందని యజమాన్యమైతే భావిస్తున్నారట. ఇక ఏది ఏమైనా కూడా ప్రభాస్ ప్రస్తుతం చాలా బిజీగా ఉన్నాడు. అయినప్పటికి నాగార్జున పిలవడంతో ఈ షోకి అటెండ్ అవుతున్నట్టుగా తెలుస్తుంది.

ప్రస్తుతం నాగార్జున హోస్ట్ గా తనను తాను మరోసారి ఎలివేట్ చేసుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక దాంతో పాటుగా తన వందో సినిమాని సైతం శరవేగంగా షూటింగ్ కంప్లీట్ చేసే విధంగా ప్రయత్నిస్తుండడం విశేషం… నాగార్జున వీటన్నింటిని చాలా వరకు బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు సాగుతున్నాడు. గత సంవత్సరం వచ్చిన కుబేర, కూలీ సినిమాలతో విలన్ గా మారిన నాగార్జున ఈ షో కు హోస్టుగా చేస్తూ అలాగే తన సినిమాల్లో హీరోగా నటిస్తూనే ప్రేక్షకులందరిని ఆకట్టుకుంటున్నాడు. ముఖ్యంగా బుల్లితెర ఆడియన్స్ విపరీతంగా ఆలోచిస్తుండటం విశేషం…

బిగ్ బాస్ గేమ్ షో ద్వారా అతనికి చాలా వరకు మైలేజ్ దొరికింది. ఇక ఇలాంటి క్రమంలోనే ఇండస్ట్రీకి మరోసారి సూపర్ సక్సెస్ ని అందుకొని సీనియర్ హీరోల్లో తను కూడా నెంబర్ వన్ పొజిషన్ ను అందుకునే పరిస్థితిలో ఉన్నానని ప్రూవ్ చేసుకుంటాడా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper