Kisan Vikas Patra : డబ్బు సంపాదించాలని చాలామందికి ఉంటుంది. కానీ సరైన ప్లానింగ్ లేకపోవడం వల్ల ఆదాయాన్ని రెట్టింపు చేయడంలో విఫలమవుతూ ఉంటారు. సాధారణంగా మధ్యతరగతి ప్రజలు తమకు వచ్చే ఆదాయంలో చిన్న పొదుపులు చేసి.. ఎక్కువ ఖర్చులు చేస్తుంటారు. అయితే పొదుపులు సరైన మార్గంలో లేకపోవడం వల్ల వాటిపై పెద్దగా రిటర్న్స్ రావు. కానీ కొన్ని పెట్టుబడులు సురక్షితమైనవే కాకుండా.. రెట్టింపు ఆదాయాన్ని ఇచ్చేవిగా ఉంటాయి. అలాంటి వాటిలో ఈ ప్రభుత్వం పథకం గురించి తెలుసుకోవాలి. ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత కొన్ని సంవత్సరాలు వెయిట్ చేస్తే డబుల్ అయ్యే అవకాశం ఉంది. ఇంతకీ ఆ పథకం పేరు ఏంటి? అందులో ఎంత ఇన్వెస్ట్మెంట్ చేయాలి?
ఇప్పటివరకు ప్రభుత్వ పథకాల్లో అత్యధిక ఆదాయాన్ని ఇచ్చే వాటిలో సుకన్య సమృద్ధి గురించి తెలుసు. కానీ ఇప్పుడు మరో పథకం లో పెట్టుబడును పెట్టడం ద్వారా అధిక ఆదాయాన్ని పొందవచ్చు. ఇందులో ఎవరైనా..? ఎప్పుడైనా..? ఎంతైనా ఇన్వెస్ట్మెంట్ చేయవచ్చు. ఆ పథకం పేరే ‘కిసాన్ వికాస్ పత్ర’. సురక్షితమైన పెట్టుబడును కావాలని అనుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్ అని ఆర్థిక నిపుణులు అంటున్నారు.
నేటి కాలంలో ఎవరికైనా డబ్బు అప్పుగా ఇస్తే తిరిగి వచ్చే అవకాశాలు చాలావరకు లేవు. అలాగని బ్యాంకులో డిపాజిట్ చేయడం ద్వారా ఆశించిన వడ్డీ రాకపోవచ్చు. అయితే లాంగ్ పీరియడ్ లో కొన్ని అవసరాలకు ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలని అనుకుంటే ఈ పథకం ఎంతో ఆదాయాన్ని ఇస్తుందని అంటున్నారు. ఇందులో కనీసం రూ.1,000 నుంచి పెట్టుబడి ప్రారంభించవచ్చు. ఆ తర్వాత పరిమితి లేకుండా ఎంతైనా ఇన్వెస్ట్మెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది. మార్కెట్లో పరిస్థితులు ఎలా ఉన్నా కూడా దీనిపై 7.5% వడ్డీని అందిస్తారు.
అయితే దీర్ఘకాలిక పెట్టుబడును కోరుకునే వారికి మాత్రమే ఇది వర్తిస్తుంది. ఎందుకంటే ఇందులో ఒక్కసారి ఇన్వెస్ట్మెంట్ చేస్తే 30 నెలల వరకు డబ్బు తీసుకోవడానికి అవకాశం ఉండదు. కానీ ఆ తర్వాత 115 నెలల పాటు వెయిట్ చేయాల్సిందే. అప్పటివరకు ఆగితే ఎంత ఇన్వెస్ట్మెంట్ చేస్తే అంతవరకు రిటర్న్ ఇస్తుంటారు. ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి వ్యక్తిగతంగా లేదా ఇద్దరు లేదా ముగ్గురు కలిసి సంయుక్తంగా కూడా చేరవచ్చు. అయితే మైనర్లు ఉంటే వారితో సహా పెద్దలు కూడా ఖాతాను కలిగి ఉంటారు. అంతేకాకుండా దీనికి సంబంధించిన సర్టిఫికెట్ను ఒక పోస్ట్ ఆఫీస్ నుంచి మరో పోస్ట్ ఆఫీస్ కు బదిలీ చేసుకోవచ్చు.
ఇందులో పెట్టుబడులు పెట్టిన వారికి సెక్షన్ 80c ప్రకారం పన్ను మినహాయింపు ఉండదు. ప్రస్తుతం ప్రైవేట్ మార్కెట్లో కొన్ని కంపెనీలు మోసం చేస్తున్నాయి. ఇలాంటి తరుణంలో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఆదాయం రావడమే కాకుండా డబ్బు సురక్షితంగా ఉండే అవకాశం ఉంటుంది.