Homeప్రవాస భారతీయులుTANA : యువ సాంకేతిక ప్రతిభకు తానా ప్రోత్సాహం.. ఘనంగా ‘యూత్ కోడ్ ఎ థాన్...

TANA : యువ సాంకేతిక ప్రతిభకు తానా ప్రోత్సాహం.. ఘనంగా ‘యూత్ కోడ్ ఎ థాన్ 2026’

TANA : ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) మిడ్ అట్లాంటిక్ విభాగం ఆధ్వర్యంలో యువతలో సాంకేతిక నైపుణ్యాలను ప్రోత్సహించే ఉద్దేశంతో ‘యూత్ కోడ్ ఎ థాన్ 2026’ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కోడింగ్‌పై ఆసక్తి, ప్రతిభ ఉన్న విద్యార్థులకు వేదిక కల్పిస్తూ నిర్వహించిన ఈ పోటీల్లో పెద్ద సంఖ్యలో యువతీ యువకులు పాల్గొని తమ సృజనాత్మకతను చాటుకున్నారు. కోడింగ్ ద్వారా వినూత్న గేమ్‌లను రూపొందించిన విద్యార్థులు తమ సాంకేతిక ప్రతిభతో ఆకట్టుకున్నారు. కొత్త ఆలోచనలను ఆవిష్కరించడంతో […]

TANA : ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) మిడ్ అట్లాంటిక్ విభాగం ఆధ్వర్యంలో యువతలో సాంకేతిక నైపుణ్యాలను ప్రోత్సహించే ఉద్దేశంతో ‘యూత్ కోడ్ ఎ థాన్ 2026’ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కోడింగ్‌పై ఆసక్తి, ప్రతిభ ఉన్న విద్యార్థులకు వేదిక కల్పిస్తూ నిర్వహించిన ఈ పోటీల్లో పెద్ద సంఖ్యలో యువతీ యువకులు పాల్గొని తమ సృజనాత్మకతను చాటుకున్నారు.

కోడింగ్ ద్వారా వినూత్న గేమ్‌లను రూపొందించిన విద్యార్థులు తమ సాంకేతిక ప్రతిభతో ఆకట్టుకున్నారు. కొత్త ఆలోచనలను ఆవిష్కరించడంతో పాటు, సృజనాత్మకత, సమస్య పరిష్కార నైపుణ్యాలను ప్రదర్శించారు. తానా పాఠశాల సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా తానా అధ్యక్షులు డాక్టర్ నరేన్ కొడాలి, ఈవీపీ శ్రీనివాస్ లావు, బోర్డు డైరెక్టర్ రవి పొట్లూరి, సెక్రటరీ సునీల్ పంత్ర, బెనిఫిట్ కోఆర్డినేటర్ వెంకట్ సింగు, మిడ్ అట్లాంటిక్ రీజినల్ రిప్రజెంటేటివ్ ఫణి కంతేటి, సతీష్ తుమ్మల విద్యార్థులను అభినందించారు. కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన తల్లిదండ్రులు, స్పాన్సర్లు, వాలంటీర్లకు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమాన్ని సమర్థవంతంగా సమన్వయం చేసిన అపర్ణ వాగ్వాలకి, సాంకేతిక వేదికను అత్యుత్తమంగా నిర్వహించిన సుజిత్ వాగ్వాలకి తానా నాయకత్వం ప్రత్యేక ధన్యవాదాలు తెలిపింది. అలాగే ఈవెంట్ విజయవంతం కావడానికి సహకరించిన ధీరజ్ యలమంచి, కేతన్ మామిడి, క్రిషిత నందమూరి, సాత్విక దుడాలకు, విద్యార్థులకు నిరంతరం మార్గదర్శకత్వం అందించిన మెంటర్ గోపి వాగ్వాలకు అభినందనలు తెలిపింది.

‘టెక్నాలజీపై పట్టు సాధించాలి’

తానా బోర్డు డైరెక్టర్ రవి పొట్లూరి మాట్లాడుతూ.. యువత తమ ఆలోచనలకు పదును పెట్టడంతో పాటు కొత్త విషయాలను నేర్చుకోవడానికి ఇలాంటి వేదికలు ఎంతో ఉపయోగపడతాయని అన్నారు. విద్యార్థులు పెద్ద కలలు కనాలని, సాంకేతికతపై అవగాహన పెంచుకోవడంతో పాటు అందులో రాణించి ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని ఆకాంక్షించారు.

విజేతలు వీరే

మిడిల్ స్కూల్ విభాగం:

ప్రథమ బహుమతి – వృషిన్ వడకట్టు
ద్వితీయ బహుమతి – అబ్దుల్ రెహమాన్
తృతీయ బహుమతి – దివిజ్ కృష్ణ కోనేరు

హై స్కూల్ విభాగం:

ప్రథమ బహుమతి – రిషి నాగబండి
ద్వితీయ బహుమతి – సర్వేష్ కొమర్రాజు
ప్రత్యేక పురస్కారాలు
బెస్ట్ వీడియో: దివిజ్ కృష్ణ కోనేరు
బెస్ట్ గేమ్‌ప్లే: రిషి నాగబండి
బెస్ట్ ఆడియో: రిషి నాగబండి
బెస్ట్ థీమ్ ఇన్‌కార్పొరేషన్: వృషిన్ వడకట్టు
కహూట్ విజేత: వృషిన్ వడకట్టు

యువతలో సాంకేతిక నైపుణ్యాలను వెలికితీసి, వారికి భవిష్యత్ అవకాశాలపై అవగాహన కల్పించే దిశగా ‘యూత్ కోడ్ ఎ థాన్ 2026’ కార్యక్రమం విజయవంతంగా నిలిచింది. ఇలాంటి కార్యక్రమాల ద్వారా యువత తమ ప్రతిభకు మరింత పదును పెట్టుకునే అవకాశం లభిస్తుందని తానా నాయకత్వం పేర్కొంది.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Related News

Most Popular

Oktelugu Epaper