Homeబిజినెస్Business Secrets : చాలామంది వ్యాపారులకు తెలియని బిజినెస్ సీక్రెట్ ఇది.

Business Secrets : చాలామంది వ్యాపారులకు తెలియని బిజినెస్ సీక్రెట్ ఇది.

Business Secrets : ఉద్యోగం చేసే వారి కంటే వ్యాపారం చేసేవారికి ఎక్కువ ఆదాయం వచ్చే అవకాశాలు ఉంటాయి. కానీ వారు కొన్ని ఆలోచనలు మార్చుకోకపోవడంతో అనుకున్న ఆదాయాన్ని పొందలేరు. ముఖ్యంగా కొన్ని బిజినెస్ సీక్రెట్స్ తెలుసుకొని వాటిని ఫాలో కావడం వల్ల తొందర్లోనే అత్యధిక సేల్స్ను పొందడంతో పాటు అనుకున్న దానికంటే ఎక్కువ ఆదాయాన్ని తెచ్చుకునే అవకాశం ఉంటుంది. ఇలాంటి బిజినెస్ సీక్రెట్స్ లో 5..4…3.. ఫార్ములా ఒకటి. ఈ ఫార్ములా పాటించడం వల్ల ముఖ్యంగా దుస్తుల […]

Business Secrets : ఉద్యోగం చేసే వారి కంటే వ్యాపారం చేసేవారికి ఎక్కువ ఆదాయం వచ్చే అవకాశాలు ఉంటాయి. కానీ వారు కొన్ని ఆలోచనలు మార్చుకోకపోవడంతో అనుకున్న ఆదాయాన్ని పొందలేరు. ముఖ్యంగా కొన్ని బిజినెస్ సీక్రెట్స్ తెలుసుకొని వాటిని ఫాలో కావడం వల్ల తొందర్లోనే అత్యధిక సేల్స్ను పొందడంతో పాటు అనుకున్న దానికంటే ఎక్కువ ఆదాయాన్ని తెచ్చుకునే అవకాశం ఉంటుంది. ఇలాంటి బిజినెస్ సీక్రెట్స్ లో 5..4…3.. ఫార్ములా ఒకటి. ఈ ఫార్ములా పాటించడం వల్ల ముఖ్యంగా దుస్తుల వ్యాపారులు అత్యధికంగా లాభాలు పొందే అవకాశం ఉంటుంది. ఈ ఫార్ములా ను ఎలా ఉపయోగించాలో ఇప్పుడు చూద్దాం..

వ్యాపారులు ఉపయోగించాల్సిన ఫార్ములాలో మొదటిది 5.. ఒక షర్టు ను రూ. 100 కు కొనుగోలు చేసి రూ.200కి విక్రయించాలని అనుకుంటారు. కానీ కొందరు వినియోగదారులు ఇది తక్కువ ధర అని కొనడానికి ముందుకు రారు. అంతేకాకుండా మరికొందరు దీనిపై బేరం ఆడి రూ.150 కే కొనుగోలు చేయాలని అంటుంటారు. అప్పుడు తక్కువ లాభం మాత్రమే వస్తుంది. అయితే ఇక్కడ ఈ రూ.100 కు కొనుగోలు చేసిన షర్టును ఐదు రేట్లు పెంచి రూ.500 ధర నిర్ణయించాలి. ఆ తర్వాత దీనిపై 20 శాతం డిస్కౌంట్ ప్రకటించాలి. అప్పుడు ఈ షర్టు ధర రూ.400 అవుతుంది. ఇలా డిస్కౌంట్ ప్రకటించడం వల్ల కొందరు వినియోగదారులు దీనిని కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది.

అయితే ఇదే షర్టును దసరా, దీపావళి ఇలాంటి పండుగల సందర్భంగా మరింత తగ్గించినట్లు ప్రకటిస్తూ..4 రేట్లు ఎక్కువ ధరతో విక్రయించాలి. అంటే అప్పుడు ఈ షర్టు ధర రూ.400 అవుతుంది. కానీ దీని ధర రూ.350 కి ఇస్తున్నట్లు ప్రకటనలు చేయాలి. అంటే ఫస్ట్ ధర కంటే రూ.150 తగ్గిస్తున్నట్లు చెప్పాలి. దీంతో వినియోగదారుల్లో ఇంప్రెస్ కలిగి పండుగల సందర్భంగా ఇలాంటి వాటిని కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు.

మూడోది 3 ఫార్ములా.. కొన్నాళ్లు విక్రయించగా మిగిలిన ఈ షర్ట్స్ ను చివరగా రూ.200 కి చివరి సేల్స్ అని ప్రకటిస్తూ విక్రయించాలి. మొత్తంగా ఈ షర్ట్స్ ను కొన్నిటిని ఎక్కువ ధరకు.. మరికొన్నింటినీ మధ్యతరగకు.. మిగిలిన వాటిని మీరు అనుకుంటున్న ధరకు విక్రయిస్తారు. ఓవరాల్ గా వీటిపై అనుకున్న దానికంటే ఎక్కువ ఆదాయం వస్తుంది. ఈ విధమైన ఫార్ములాను పాటించి తమ వ్యాపారాలను అభివృద్ధి చేసుకోవచ్చు.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Related News

Most Popular

Oktelugu Epaper