Homeఅంతర్జాతీయంKhalistan Movement: అంత ఘోరం జరుగుతున్నా మీ ఖలిస్తాన్ ఉద్యమం పాకిస్తాన్ లో ఉండదా?

Khalistan Movement: అంత ఘోరం జరుగుతున్నా మీ ఖలిస్తాన్ ఉద్యమం పాకిస్తాన్ లో ఉండదా?

Khalistan Movement: పాకిస్తాన్‌ ఒకవైపు ఖలిస్తాన్‌ ఉద్యమం పేరిట సిక్కు సమాజాన్ని భారతదేశం నుంచి వేరు చేసే ప్రయత్నాలు చేస్తోంది. ఖలిస్తానీలకు ఆశ్రయం ఇస్తోంది. ఆయుధాలు, పేలుడు పదార్థాలు అందిస్తోంది. ఆర్థిక సాయం కూడా చేస్తోంది. ఇక మరోవైపు తమ భూభాగంలోని సిక్కుల చారిత్రక ఆనవాళ్లను క్రమబద్ధంగా ధ్వంసం చేస్తోంది. ఇలా ద్వంద్వ వ్యూహాన్ని స్పష్టం చేస్తోంది. ఈ విరుద్ధ చర్యలు సిక్కు సమాజం వారసత్వం, రాజకీయ ఉద్యమాల మధ్య వైరుధ్యాలు చర్చనీయాంశమయ్యాయి. చారిత్రక గురుద్వారాలు ధ్వంసం.. […]

Khalistan Movement: పాకిస్తాన్‌ ఒకవైపు ఖలిస్తాన్‌ ఉద్యమం పేరిట సిక్కు సమాజాన్ని భారతదేశం నుంచి వేరు చేసే ప్రయత్నాలు చేస్తోంది. ఖలిస్తానీలకు ఆశ్రయం ఇస్తోంది. ఆయుధాలు, పేలుడు పదార్థాలు అందిస్తోంది. ఆర్థిక సాయం కూడా చేస్తోంది. ఇక మరోవైపు తమ భూభాగంలోని సిక్కుల చారిత్రక ఆనవాళ్లను క్రమబద్ధంగా ధ్వంసం చేస్తోంది. ఇలా ద్వంద్వ వ్యూహాన్ని స్పష్టం చేస్తోంది. ఈ విరుద్ధ చర్యలు సిక్కు సమాజం వారసత్వం, రాజకీయ ఉద్యమాల మధ్య వైరుధ్యాలు చర్చనీయాంశమయ్యాయి.

చారిత్రక గురుద్వారాలు ధ్వంసం..
పాకిస్తాన్‌లోని చారిత్రక గురుద్వారాలను ధ్వంసం చేసే ప్రక్రియ కొనసాగుతోంది. తాజాగా 125 సంవత్సరాల పురాతనమైన శ్రీ గురు సింగ్‌ సభా సాహెబ్‌ గురుద్వారాను కూల్చివేసింది. ఇది చారిత్రక, సాంస్కృతిక విలువ కలిగిన స్థలం. 1960లలో భారతదేశం నుండి వచ్చిన ముస్లింలకు ఈ స్థలాన్ని నివాసం కోసం అప్పగించినప్పుడు, దాని గురుద్వారా స్వరూపాన్ని మార్చకుండా ఉండాలని స్పష్టమైన షరతు విధించారు. అయినప్పటికీ, ఆ షరతును ఉల్లంఘించి పూర్తి ధ్వంసం చేయడం చారిత్రక వారసత్వం పట్ల అనాదరణను చూపిస్తోంది.

పాకిస్తాన్‌ ద్వంద్వ విధానం..
ఖలిస్తాన్‌ ఉద్యమం పేరిట సిక్కులను భారతదేశం నుంచి వేరు చేసి, పక్కదారి పట్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇది సిక్కు సమాజంలో అస్థిరత కలిగించేందుకు ఉపయోగపడుతోంది. అదే సమయంలో పాకిస్తాన్‌ తన దేశంలో సిక్కుల చారిత్రక గుర్తులను అంతం చేస్తుండటం ఈ ఉద్యమం వెనుక దాగిన ఉద్దేశాలపై సందేహాలు కలిగిస్తోంది. ఒకవైపు సిక్కులను ‘‘స్వతంత్ర రాష్ట్రం’’ పేరిట ఆకర్షించి, మరోవైపు తమ దేశంలోని సిక్కు సంస్కృతిని నాశనం చేయడం వ్యూహాత్మక వ్యతిరేకతను సూచిస్తోంది.

ఖలిస్తానీల మౌనం..
భారతదేశంలోని ఖలిస్తాన్‌ మద్దతుదారులు ఈ ధ్వంసం గురించి పూర్తిగా నిశ్శబ్దంగా ఉన్నారు. ఒక్కరు కూడా ఈ విషయంలో మాట్లాడడం లేదు. నిజమైన సిక్కు వారసత్వం, హక్కుల కోసం ఉద్యమిస్తున్నట్లయితే, పాకిస్తాన్‌ చేస్తున్న ఈ చర్యలపై వారు ఎందుకు మౌనం వహిస్తున్నారనేది ప్రశ్నార్థకం. పాకిస్తాన్‌పై పోరాటం చేయడం మానేసి, భారతదేశంపైనే దృష్టి సారించడం వారి ఉద్యమం యొక్క నిజమైన ప్రాధాన్యతను సందేహాస్పదం చేస్తోంది. ఇది ఉద్యమం సిక్కు సమాజం యొక్క వాస్తవ ప్రయోజనాల కోసం కాకుండా, ఇతర రాజకీయ లక్ష్యాల కోసం నడుస్తుందని సూచిస్తోంది.

ఢిల్లీలోని సిక్కు గురుద్వారా ప్రబంధ కమిటీ ఈ విషయంలో చర్యలు తీసుకోవాలని భారత ప్రభుత్వాన్ని కోరింది. అయితే, ఈ సమస్య నేరుగా పాకిస్తాన్‌తో ముడిపడి ఉంది కాబట్టి, పాకిస్తాన్‌ను నేరుగా సంప్రదించి, అంతర్జాతీయ వేదికలపై ఒత్తిడి తీసుకురావడం మరింత సమర్థవంతంగా ఉండవచ్చు. భారత ప్రభుత్వం దౌత్యపరమైన మార్గాల ద్వారా ఈ సమస్యను లేవనెత్తడం అవసరం. సిక్కు సమాజం ఏకమై, తమ చారిత్రక వారసత్వాన్ని కాపాడుకోవడానికి, ఈ విరుద్ధ చర్యలను ఖండించడానికి చర్యలు తీసుకోవాలి.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

Oktelugu Epaper