Homeఎంటర్టైన్మెంట్Star Heroes: స్టార్ హీరోలు చిన్న సినిమాలను నిర్మించేటప్పుడే అదొక్కటి చూసుకుంటే బాగుంటుందా..?

Star Heroes: స్టార్ హీరోలు చిన్న సినిమాలను నిర్మించేటప్పుడే అదొక్కటి చూసుకుంటే బాగుంటుందా..?

Star Heroes: సినిమా ఇండస్ట్రీలో చాలామంది టాప్ హీరోలు ప్రొడ్యూసర్లుగా మారి చిన్న చిన్న సినిమాలను నిర్మిస్తున్నారు. వాళ్ళు ఒకవైపు హీరోలుగా చేసుకుంటూనే మరొక హీరోను పెట్టి కొత్త దర్శకులను ఎంకరేజ్ చేస్తూ సినిమాలను నిర్మిస్తుండటం విశేషం… ఒకరకంగా ఇది చాలా మంచి పద్ధతి దీనివల్ల చాలామంది దర్శకులకు అవకాశం దొరికే ఛాన్స్ ఉంటుంది. ఇక ఇలాంటి క్రమంలోనే ఆయా హీరోలు కథల విషయంలో చాలా కేర్ఫుల్ గా ఉంటే బాగుంటుంది. ఇక దానికి తోడుగా దర్శకుడు […]

Star Heroes: సినిమా ఇండస్ట్రీలో చాలామంది టాప్ హీరోలు ప్రొడ్యూసర్లుగా మారి చిన్న చిన్న సినిమాలను నిర్మిస్తున్నారు. వాళ్ళు ఒకవైపు హీరోలుగా చేసుకుంటూనే మరొక హీరోను పెట్టి కొత్త దర్శకులను ఎంకరేజ్ చేస్తూ సినిమాలను నిర్మిస్తుండటం విశేషం… ఒకరకంగా ఇది చాలా మంచి పద్ధతి దీనివల్ల చాలామంది దర్శకులకు అవకాశం దొరికే ఛాన్స్ ఉంటుంది. ఇక ఇలాంటి క్రమంలోనే ఆయా హీరోలు కథల విషయంలో చాలా కేర్ఫుల్ గా ఉంటే బాగుంటుంది. ఇక దానికి తోడుగా దర్శకుడు వాళ్లకు చెప్పిన కథను చెప్పినట్టుగా తీస్తున్నాడా? లేదా అనేది ఒకటికి పది సార్లు చెక్ చేసుకుంటూ ఉండాలి. ఒకవేళ సినిమా ఎక్కడైనా గాడి తప్పినా కూడా మొదటి నుంచే దర్శకుడికి ఇన్స్ట్రాక్షన్స్ ఇచ్చుకుంటూ వస్తే బాగుంటుంది. దాని వల్ల చిన్న సినిమాలు బతికే అవకాశం ఉంటుంది.

అలాగే దర్శకుడు సైతం సినిమాని ఎఫెక్ట్ గా తీర్చిదిద్దడానికి ఆస్కారం ఉంటుంది. ఇక ఇలాంటి క్రమంలోనే చాలామంది హీరోలు ప్రొడ్యూసర్లుగా మారి తమ సత్తా ఏంటో చూపించుకుంటున్నారు. ఇప్పటికే మహేష్ బాబు సైతం చిన్న సినిమాలను నిర్మిస్తూ సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ గా పేరును సంపాదించుకుంటుండటం విశేషం…

ఇక తనతో పాటు మరి కొంతమంది స్టార్ హీరోలు సైతం చిన్న సినిమాలను ప్రొడ్యూస్ చేయడానికి ఒక ప్రొడక్షన్ హౌజ్ ను స్థాపించే అవకాశాలు కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది…ఇక నాని లాంటి హీరో సైతం ఇప్పటికే తను ప్రొడ్యూసర్ గా మారి ఆ,హిట్ సిరీస్, కోర్ట్ లాంటి సినిమాలను నిర్మించాడు. ఆ సినిమాలు మంచి విజయాలను సాధించాయి. ఇక ఇప్పుడు మరికొన్ని సినిమాలను కూడా తెరమీదకి తీసుకురావడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు…

ఇక వీళ్లతో పాటుగా మరికొంతమంది హీరోలు సైతం ప్రొడ్యూసర్లుగా మారడానికి సన్నాహాలు చేస్తున్నారు. వాళ్ళకి సరైన కథ దొరికితే ప్రొడ్యూస్ చేయడానికి వాళ్ళు ఎప్పుడు ముందు వరుసలో ఉన్నామని చెబుతున్నారు. ఇంకొంతమంది హీరోలు సైతం వాళ్ళ సినిమాలు రిలీజ్ అవ్వడానికి లేట్ అవుతుంది కాబట్టి ప్రొడ్యూసర్లుగా మారి సినిమాలను నిర్మిస్తే ఇండస్ట్రీ కి రెవెన్యూ పెరిగే అవకాశం ఉంటుంది. ఇండస్ట్రీలో ఉన్న సినీ కార్మికులకు సైతం ఎక్కువగా పని దొరకడానికి ఆస్కారం ఉంటుందనే ధోరణిలో ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తుంది…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper