Homeఅంతర్జాతీయంIraq Corruption: బంగారంతో లో దుస్తులు .. ఈ మహిళా ఎంపీ చేసిన పని...

Iraq Corruption: బంగారంతో లో దుస్తులు .. ఈ మహిళా ఎంపీ చేసిన పని తెలిస్తే అవాక్కే

Iraq Corruption: మనదేశంలో బంగారంతో మహా అయితే ఆడవాళ్లు ఆభరణాలు చేయించుకుంటారు. బాగా డబ్బున్న వాళ్ళైతే కాళ్ల పట్టీలు.. మెట్టెలు.. వడ్డాణం వంటివి చేయించుకుంటారు. ఇంకా బాగా డబ్బున్న వాళ్ళైతే కంచాలు.. మంచాలు.. సోఫా సెట్లు బంగారంతో చేయించుకుంటారు. కానీ బంగారంతో.. ఈమె చేయకూడని పని చేసింది. చివరికి ఇలా దొరికిపోయింది.. మనదేశంలోనే కాదు అవినీతి ప్రపంచ వ్యాప్తంగా ఉంది. గతంలో ఇతర దేశాలలో అవినీతి వ్యవహారాలు అంతగా వెలుగులోకి వచ్చేవి కాదు. సోషల్ మీడియా పెరిగిపోయిన […]

Iraq Corruption: మనదేశంలో బంగారంతో మహా అయితే ఆడవాళ్లు ఆభరణాలు చేయించుకుంటారు. బాగా డబ్బున్న వాళ్ళైతే కాళ్ల పట్టీలు.. మెట్టెలు.. వడ్డాణం వంటివి చేయించుకుంటారు. ఇంకా బాగా డబ్బున్న వాళ్ళైతే కంచాలు.. మంచాలు.. సోఫా సెట్లు బంగారంతో చేయించుకుంటారు. కానీ బంగారంతో.. ఈమె చేయకూడని పని చేసింది. చివరికి ఇలా దొరికిపోయింది..

మనదేశంలోనే కాదు అవినీతి ప్రపంచ వ్యాప్తంగా ఉంది. గతంలో ఇతర దేశాలలో అవినీతి వ్యవహారాలు అంతగా వెలుగులోకి వచ్చేవి కాదు. సోషల్ మీడియా పెరిగిపోయిన తర్వాత ప్రతి విషయం తెలిసిపోతున్న నేపథ్యంలో.. ఇతర దేశాలలో జరుగుతున్న అవినీతి వ్యవహారాలు కూడా బయటపడుతున్నాయి. అటువంటిదే ఇది కూడా. కాకపోతే ఇక్కడ అవినీతికి పాల్పడింది ఇద్దరు మహిళలు. వారిద్దరు కూడా ప్రజాప్రతినిధులు. వారు అవినీతికి పాల్పడిన తీరు వేరే లెవెల్. అసలు ఇలా కూడా చేస్తారా అని అందరూ ఆశ్చర్యపోతున్నారు.

ఇరాక్ దేశంలో కొంతకాలంగా అవినీతి భారీగా పెరిగిపోయింది. దీంతో అక్కడ ప్రభుత్వం తనిఖీలు మొదలుపెట్టింది. దాడులను విస్తృతం చేసింది. ఈ నేపథ్యంలో ఇద్దరు మహిళ ఎంపీల ఇళ్లల్లో లెక్కకు మిక్కిలిగా అక్రమంగా పోగు చేసిన ఆస్తులు బయటపడ్డాయి. ఇలా అక్రమంగా ఆస్తులు సంపాదించిన వారిలో హింద్ ఆల్ అబ్బాసి, అలియా నసీఫ్ అనే ఎంపీలు ఉన్నారు. వీరి దగ్గర నుంచి అధికారులు వందల కోట్లు నగదు.. కిలోల పరిమాణంలో బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.

అబ్బాసీ ఇంట్లో..

అవినీతి వ్యతిరేక అధికారులు ఇరాక్ దేశంలోని భాగ్యాధి ప్రాంతంలో గ్రీన్ జోన్ ఏరియాలో దాడులు జరిపారు. ఇందులో అబ్బాసి అనే ఎంపీ ఇంట్లో ఏకంగా 490 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు. 27 కిలోల అత్యంత స్వచ్ఛమైన బంగారాన్ని జట్టు చేశారు.. అబ్బాసి బంగారంతో లో దుస్తులు తయారు చేయించుకుంది. వాటిని ఆమె రాత్రిపూట ధరించేది. కొన్ని సందర్భాలలో తన ప్రైవేటు వ్యవహారాలలో పాల్గొన్నప్పుడు కూడా ధరించేది. బంగారంతో లో దుస్తులు రూపొందించుకున్న నేపథ్యంలో అబ్బాసి ఒక్కసారిగా ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారారు.

నసీఫ్ ఇంట్లో

నసీఫ్ అనే ఎంపీ అవినీతికి వ్యతిరేకంగా పోరాటాలు చేశారు. చివరికి ఆమె అవినీతి పరురాలిగా మారిపోయారు. పార్లమెంట్ ఇంటిగ్రేటెడ్ కమిటీకి ఆమె వైస్ చైర్మన్ గా పని చేశారు. తనకున్న గుర్తింపును అవినీతికి అనుకూలంగా మార్చుకున్నారు. ఆమె ఇంట్లో ఏకంగా 130 కోట్ల నగదు లభించింది.. భారీగా బంగారం దొరికింది.. ఎక్కువగా చమురు మంత్రిత్వ శాఖలో అక్రమాలు జరిగిన నేపథ్యంలో.. అధికారులు విచారణ జరిపారు. ఇందులో 67 మందికి పైగా అధికారులు.. ఎంపీలను ఇరాక్ అధికారులు అరెస్ట్ చేయడం విశేషం.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper