Homeజాతీయ వార్తలుIndian Railways: రైళ్లల్లో ప్రయాణిస్తున్నారా.. అదనపు లగేజ్ ఉందా.. ఇది మీకోసమే..

Indian Railways: రైళ్లల్లో ప్రయాణిస్తున్నారా.. అదనపు లగేజ్ ఉందా.. ఇది మీకోసమే..

Indian Railways: ద్విచక్ర వాహనాల పెరిగిపోతున్నాయి. కార్లు కూడా రోడ్లమీద జోరుగా రాకపోకలు సాగిస్తున్నాయి. ఈ వాహనాల సంఖ్య అంతకంతకు పెరిగిపోతుంది. అయినప్పటికీ రైలు ద్వారా ప్రయాణం చేసే ప్రయాణికుల సంఖ్య ఏమాత్రం తగ్గడం లేదు. మనదేశంలో రైల్వే వ్యవస్థ అద్భుతమైన ప్రయాణ సాధనంగా ఉంటుంది. అందరికీ అందుబాటులో టికెట్ ధరలు ఉంటాయి. అందువల్లే రైల్వే శాఖకు ప్రతీ ఏడాది వేలకోట్ల ఆదాయం వస్తూ ఉంటుంది. రైళ్ల ద్వారా ప్రయాణ సాగించే వారి సంఖ్య విపరీతంగా పెరిగిపోతుంది. […]

Indian Railways: ద్విచక్ర వాహనాల పెరిగిపోతున్నాయి. కార్లు కూడా రోడ్లమీద జోరుగా రాకపోకలు సాగిస్తున్నాయి. ఈ వాహనాల సంఖ్య అంతకంతకు పెరిగిపోతుంది. అయినప్పటికీ రైలు ద్వారా ప్రయాణం చేసే ప్రయాణికుల సంఖ్య ఏమాత్రం తగ్గడం లేదు.

మనదేశంలో రైల్వే వ్యవస్థ అద్భుతమైన ప్రయాణ సాధనంగా ఉంటుంది. అందరికీ అందుబాటులో టికెట్ ధరలు ఉంటాయి. అందువల్లే రైల్వే శాఖకు ప్రతీ ఏడాది వేలకోట్ల ఆదాయం వస్తూ ఉంటుంది. రైళ్ల ద్వారా ప్రయాణ సాగించే వారి సంఖ్య విపరీతంగా పెరిగిపోతుంది. ప్రయాణికుల సంఖ్యకు తగ్గట్టుగానే రైల్వే శాఖ కూడా రైళ్లను పెంచుకుంటూ పోతుంది. అద్భుతమైన సౌకర్యాలను ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకొస్తుంది.

రైళ్లల్లో ప్రయాణం చేసేవరకు బాగానే ఉంటుంది. లగేజ్ ఒక పరిమిత స్థాయిలో ఉన్నంతవరకు ఇబ్బంది ఉండదు. కానీ లగేజ్ ఎక్కువగా ఉన్నప్పుడు అవస్థలు పడాల్సి ఉంటుంది. పైగా రైల్వే శాఖ తీసుకువచ్చిన నిబంధనల వల్ల అదనపు లగేజీ తీసుకుపోవడానికి పార్సిల్ ఆఫీసులకు వెళ్లాల్సి ఉంటుంది.. అది ఒక ప్రయాస. ఆ ఇబ్బంది పడలేక చాలామంది అదనపు లగేజ్ తీసుకెళ్లడానికి ఇష్టపడరు. దీనివల్ల ప్రయాణికులకు ఇబ్బంది.. లగేజీ రూపంలో ఆదాయం రాకపోవడంతో రైల్వే శాఖకు కూడా ఇబ్బంది. అయితే ఇకపై ఈ సమస్య ఉండదు.

రైల్వే శాఖ తీసుకువచ్చిన తాజా నిబంధనల ప్రకారం పార్సిల్ ఆఫీసులకు వెళ్లకుండానే అదనపు లగేజీ తీసుకుపోవచ్చు. ఇలా చేయాలంటే ముందుగా టికెట్ బుకింగ్ సమయంలో ఐఆర్సిటిసి లో పార్సిల్ పోర్టల్ లో ఎక్స్ట్రా లగేజ్ కోసం బుక్ చేసుకునే సదుపాయాన్ని ఇండియన్ రైల్వే శాఖ మొదలుపెట్టింది. అయితే ఏసి 3 టైర్.. చైర్ కార్ మినహా మిగతా కేటగిరి ప్యాసింజర్లకు ఈ సదుపాయాన్ని కల్పించింది. ఏసీ త్రీ టైర్.. చైర్ కార్ ప్రయాణికులకు అనుమతించే ఉచిత.. గరిష్ట లగేజీ పరిమితి 40 కిలోలు మాత్రమే ఉండటమే అసలు కారణం.

రైల్వే శాఖ తీసుకువచ్చిన ఈ నిబంధన వల్ల ప్రయాణికులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీనివల్ల అదనపు లగేజీ తీసుకెళ్లడం ఈజీ అని వారు భావిస్తున్నారు. ఫలితంగా రైల్వే శాఖకు కూడా ఆదాయం దండిగానే దీని ద్వారా లభించే అవకాశం ఉంది. గతంలో అదనపు లగేజీ కోసం పార్సిల్ ఆఫీసుల చుట్టూ ప్రయాణికులు తిరిగేవారు. దీనివల్ల ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో రైల్వే శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. ఆదాయం పరంగా.. ప్రయాణికుల సౌకర్యం పరంగా అనుకూలంగా ఉండడంతో.. రైల్వే శాఖ తీసుకున్న నిర్ణయం పట్ల ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper