Bigg Boss 10 Telugu: ఈ సీజన్ బిగ్ బాస్ హౌస్ లో కంటెంట్ కోసం ఎంత దూరమైనా వెళ్ళడానికి సిద్ధంగా ఉండే కంటెస్టెంట్ ఎవరైనా ఉన్నారా అంటే అది త్రిగున్ మాత్రమే. హౌస్ లో ఉన్న 24 గంటలు తోటి కంటెస్టెంట్స్ ని ట్రిగర్ చేయడం, వాళ్ళు ట్రిగర్ అయ్యాక ఇతనితో గొడవకు రావడం , తద్వారా బోలెడంత స్క్రీన్ స్పేస్ ని దక్కించుకోవడం , ఇదే త్రిగున్ గేమ్ ప్లాన్. ఆరంభం లో పర్వాలేదులే , సంజన లాగా కంటెంట్ ఇస్తున్నాడు , హౌస్ లో డైనమిక్స్ ని మారుస్తున్నాడు , ఇలాంటి కంటెస్టెంట్స్ ఉంటేనే గేమ్ రసవత్తరంగా ఉంటుంది అని అంతా అనుకున్నారు. కానీ ఇతను హద్దులన్నీ దాటేస్తున్నాడు. అతను మాట్లాడే మాటలకు కంటెస్టెంట్స్ బిగ్ బాస్ రూల్స్ ప్రకారం సైలెంట్ గా ఉండాల్సి వస్తుంది. ఇదే మాటలు బయట మాట్లాడి ఉండుంటే పెద్ద కొట్లాటలు జరిగేవి.
మొదటి వారం లోనే రోహిత్ పై వ్యక్తిగతంగా అత్యంత నీచమైన కామెంట్స్ చేసాడు. ఆ వీకెండ్ లోనే నాగార్జున త్రిగున్ పై ఫైర్ అయ్యుంటే కంట్రోల్ లో ఉండేవాడేమో , కానీ నాగార్జున పెద్దగా పట్టించుకోకపోవడం తో , తన కంటెంట్ ని జనాలు నచ్చుతున్నారు అనే భ్రమలో త్రిగున్ అత్యంత నీచంగా దిగజారుతున్నాడు. ఈ వారం రోహిత్ పై ఆడంగి అంటూ కామెంట్ చేయడం , అతని వైపు చూసి ఉమ్మడం వంటివి చేసిన త్రిగున్, నేడు అమన్ పై అత్యంత నీచమైన కామెంట్స్ చేసాడు. దీంతో అమన్ కి విపరీతమైన కోపం రావడం , త్రిగున్ పై ఫిజికల్ దాడి చేయడం వంటివి జరిగాయి. దీంతో అమన్ కి రెడ్ కార్డు , త్రిగున్ కి ఎల్లో కార్డు వచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు నెటిజెన్స్. ముఖ్యంగా నాగార్జున ఈ వారం త్రిగున్ కి కోటింగ్ ఇవ్వకపోతే , ఈ సీజన్ డిజాస్టర్ వైపు వెళ్తున్నట్టే అనుకోవచ్చు.
ఎందుకంటే త్రిగున్ వేసే వేషాలు కుటుంబం తో కలిసి చూసే బిగ్ బాస్ లాంటి రియాలిటీ కి తగినవి కాదు , ఆడియన్స్ కి కూడా సహనం ఉంటుంది, సినిమాల్లో విలన్ హీరో ని వంద సార్లు కొడితే , హీరో తిరిగి ఒక్కసారి కొట్టినా కిక్ వస్తుంది, అలా త్రిగున్ ని కనీసం ఈసారైనా నాగార్జున మందలిస్తాడా ?, లేదా ఎప్పటి లాగానే ఇతన్ని బుజ్జగించి , రోహిత్ దే తప్పు అన్నట్టుగా చూపిస్తారా? అనేది తెలియాలంటే ఈ వీకెండ్ వరకు ఆగాల్సిందే.