Homeఎంటర్టైన్మెంట్Bigg Boss 10 Telugu: షాలిని దెబ్బకు తగ్గుతున్న రోహిత్ ఓటింగ్.. ఈ వారం ఏ...

Bigg Boss 10 Telugu: షాలిని దెబ్బకు తగ్గుతున్న రోహిత్ ఓటింగ్.. ఈ వారం ఏ స్థానంలో ఉన్నాడంటే!

Bigg Boss 10 Telugu: ఈ సీజన్ బిగ్ బాస్ టైటిల్ విన్నింగ్ రేస్ లో అందరికంటే ముందున్న కంటెస్టెంట్ ఎవరైనా ఉన్నారా అంటే అది రోహిత్ నాయుడు మాత్రమే అని చెప్పడం లో ఎలాంటి సందేహం లేదు. ‘అగ్ని పరీక్ష 2’ ద్వారా బిగ్ బాస్ హౌస్ లోకి సామాన్యుడిగా ఎంట్రీ ఇచ్చిన ఆయన , మొదటి ఎపిసోడ్ నుండి , నేటి ఎపిసోడ్ వరకు ప్రతీ టాస్క్ లోనూ సింహం లాగా ఆడాడు. అందుకే […]

Bigg Boss 10 Telugu: ఈ సీజన్ బిగ్ బాస్ టైటిల్ విన్నింగ్ రేస్ లో అందరికంటే ముందున్న కంటెస్టెంట్ ఎవరైనా ఉన్నారా అంటే అది రోహిత్ నాయుడు మాత్రమే అని చెప్పడం లో ఎలాంటి సందేహం లేదు. ‘అగ్ని పరీక్ష 2’ ద్వారా బిగ్ బాస్ హౌస్ లోకి సామాన్యుడిగా ఎంట్రీ ఇచ్చిన ఆయన , మొదటి ఎపిసోడ్ నుండి , నేటి ఎపిసోడ్ వరకు ప్రతీ టాస్క్ లోనూ సింహం లాగా ఆడాడు. అందుకే అతని గ్రాఫ్ రోజురోజుకి పెరుగుతూ వెళ్తోంది. ప్రస్తుతం రోహిత్ కి 70 శాతం ఓటింగ్ పడితే , మిగిలిన బిగ్ బాస్ కంటెస్టెంట్స్ అందరికీ కలిపి 30 శాతం ఓటింగ్ నమోదు అవుతోంది. ఈ స్థాయి డామినేషన్ గతం లో ఏ బిగ్ బాస్ సీజన్ లో కూడా జరగలేదు. అయితే రోహిత్ ఓటింగ్ షాలిని ప్రభావం పడే అవకాశం ఉందని అంటున్నారు విశ్లేషకులు.

ఆమెతో రోహిత్ నడిపే లవ్ ట్రాక్ , రాబోయే రోజుల్లో నెగెటివ్ గా మారే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. అయితే ఈ వారం షాలిని రోహిత్ పై కొన్ని మాటలు జారింది. ఆమె జారిన మాటలకు రోహిత్ చాలా ఫీల్ అయ్యాడు. అప్పటి నుండి ఆమెతో మాట్లాడడం బాగా తగ్గించేసాడు రోహిత్. కానీ షాలిని మాత్రం రోహిత్ వెంట పడుతూనే ఉంది. దయచేసి నాతో మాట్లాడు , చాలా బాధేస్తుంది అంటూ షాలిని రోహిత్ ని పట్టుకొని బ్రతిమిలాడడం, ఆయన్ని కొరుక్కొని తినేలా చూడడం, చేతులు గట్టిగా పట్టుకొని పిసికేయడం వంటివి చేస్తోంది షాలిని. ఈమె ట్రాప్ లో పొరపాటున రోహిత్ పడితే , అతని గేమ్ మొత్తం నాశనం అయ్యే అవకాశాలు ఉన్నాయని , ఆమెకు దూరం గా ఉండాల్సిందిగా రోహిత్ ఫ్యాన్స్ సోషల్ మీడియా లో కామెంట్స్ చేస్తున్నారు.

కానీ షాలిని కి దూరంగా రోహిత్ కూడా ఉండలేకపోయాడు. నేడు కూడా లైవ్ లో వీళ్లిద్దరు కలిసి ఉన్నారు. ఇలాగే కొనసాగితే , కచ్చితంగా రోహిత్ గ్రాఫ్ రాబోయే రోజుల్లో తగ్గే అవకాశాలు ఉన్నాయి. గత సీజన్స్ లో కూడా టాప్ కంటెస్టెంట్స్ లవ్ ట్రాక్స్ వల్లే గేమ్ లో బాగా వెనకపడ్డారు. అందుకు బెస్ట్ ఉదాహరణ డిమోన్ పవన్. ఇతనికి విన్నర్ అయ్యేంత కెపాసిటీ ఉంది , కానీ రీతూ చౌదరి తో లవ్ ట్రాక్ పెట్టుకోవడం వల్ల , ఇతని గేమ్ బాగా దెబ్బతినింది. చివరికి విన్నర్ అవ్వాల్సిన కంటెస్టెంట్ టాప్ 3 తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. రోహిత్ షాలిని తో లవ్ ట్రాక్ కట్ చేసుకోకపోతే ఆయన పరిస్థితి కూడా ఇంతే అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper