Homeఎంటర్టైన్మెంట్Ritu Chowdary: రీతూ చౌదరి తో బ్రేకప్ చేసుకున్న డిమోన్ పవన్..సంచలనం రేపుతున్న పోస్ట్!

Ritu Chowdary: రీతూ చౌదరి తో బ్రేకప్ చేసుకున్న డిమోన్ పవన్..సంచలనం రేపుతున్న పోస్ట్!

Ritu Chowdary: ప్రతీ బిగ్ బాస్ సీజన్ లో ఆడియన్స్ కి చిరాకు కలిగించేది ఏదైనా ఉందా అంటే, అది లవ్ ట్రాక్ అనే చెప్పాలి. బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు లవ్ ట్రాక్ నడపడం, బయటకు వెళ్లిన తర్వాత నీకు నాకు సంబంధం లేదు అన్నట్టుగా వ్యవహరించడం వంటివి ఆడియన్స్ చూసారు కాబట్టే, లవ్ ట్రాక్స్ అంటేనే ఇప్పుడు చిరాకు పడిపోతున్నారు. కానీ గత సీజన్ లో డిమోన్ పవన్, రీతూ చౌదరి మధ్య […]

Ritu Chowdary: ప్రతీ బిగ్ బాస్ సీజన్ లో ఆడియన్స్ కి చిరాకు కలిగించేది ఏదైనా ఉందా అంటే, అది లవ్ ట్రాక్ అనే చెప్పాలి. బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు లవ్ ట్రాక్ నడపడం, బయటకు వెళ్లిన తర్వాత నీకు నాకు సంబంధం లేదు అన్నట్టుగా వ్యవహరించడం వంటివి ఆడియన్స్ చూసారు కాబట్టే, లవ్ ట్రాక్స్ అంటేనే ఇప్పుడు చిరాకు పడిపోతున్నారు. కానీ గత సీజన్ లో డిమోన్ పవన్, రీతూ చౌదరి మధ్య జరిగిన లవ్ ట్రాక్ ని మాత్రం ఆడియన్స్ నచ్చారు. మొదట్లో వీళ్ళ లవ్ ట్రాక్ చాలా చిరాకు కలిగించేది, కానీ ఆ తర్వాత రోజులు గడిచే కొద్దీ వీళ్లిద్దరి లవ్ ట్రాక్ లో నిజాయితీ ఉందని గమనించి ఆడియన్స్ ఆదరించారు. వాళ్ళు ముద్దుగా ఈ జంటని రివాన్ అనే పేరుతో పిలుచుకునేవారు.

బయటకు వచ్చిన తర్వాత కూడా వీళ్ళ మధ్య మంచి రిలేషన్ నడిచింది, భవిష్యత్తులో పెళ్లి కూడా చేసుకుంటారేమో అని అంతా అనుకున్నారు. అయితే ఈ జంటపై ఎవరి దిష్టి తగిలిందో ఏమో తెలియదు కానీ, నిన్న డిమోన్ పవన్ తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో రీతూ తో రిలేషన్ బ్రేక్ చేసుకున్నట్టు చెప్పుకొచ్చాడు. ఈ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియా లో సంచలనం గా మారింది. ఆయన మాట్లాడుతూ ‘చాలా రోజుల తర్వాత రివాన్ అనే అంశం పై మాట్లాడాలని నిర్ణయించుకున్నాను. సోషల్ మీడియా లో రీతూ నన్ను తన గేమ్ కోసం వాడుకుందని, లేదా నేను నా గేమ్ కోసం తనని వాడుకున్నానని అంటున్నారు. అందులో ఎలాంటి నిజం లేదు. కానీ గత కొంతకాలంగా మా మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఏ రిలేషన్ లో అయినా గొడవలు కామన్. మా మధ్య కూడా అలాంటివ్ ఉండేవి. కానీ అవి ఇప్పుడు తారాస్థాయికి చేరుకోవడం తో మా స్నేహాన్ని కట్ చేసుకున్నాము. నన్ను రీతూ చౌదరి వాట్సాప్ లో బ్లాక్ చేసింది, కోపం వచ్చింది నేను ఇన్ స్టాగ్రామ్ లో ఆమెని రెమొవె చేశాను. కాసేపటికి ఆమె ఇన్ స్టాగ్రామ్ లో కూడా బ్లాక్ చేసింది. ఇక ఎవరి జీవితాలు వారివి, దయచేసి ఇక రివాన్ అని పిలవకండి’ అంటూ చెప్పుకొచ్చాడు.

చూడముచ్చటగా ఒకరి కోసం ఒకరు అన్నట్టుగా ఉండే ఈ జంట ఇలా విడిపోవడం పై సోషల్ మీడియా లో నెటిజెన్స్ బాధపడుతున్నారు. రీసెంట్ గానే వీళ్లిద్దరు కలిసి చేసిన ‘బంగారం’ అనే కవర్ సాంగ్ కోటి కి పైగా వ్యూస్ ని సొంతం చేసుకుంది, భవిష్యత్తు లో వీళ్లిద్దరి కాంబినేషన్ లో మరిన్ని ప్రాజెక్ట్స్ వస్తాయని అనుకున్నారు, కానీ ఇంతలోపే ఈ ట్విస్ట్ వచ్చింది. చూడాలి మరి భవిష్యత్తు లో వీళ్ళు కలుస్తారా లేదా అనేది.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper