Bigg Boss 10 Telugu: ప్రతీ వారం లాగానే ఈ వారం కూడా బిగ్ బాస్ హౌస్ లో నామినేషన్స్ ప్రక్రియ మంచి ఊపు మీద సాగింది. అయితే ఈ వారం సెలబ్రిటీలు చాలా తెలివిగా ‘అగ్ని పరీక్ష 2’ కంటెస్టెంట్స్ అందరినీ నామినేషన్స్ లోకి తీసుకొచ్చారు. అందుకే సుధీర్ , రామ్ ప్రసాద్ వంటి సెలబ్రిటీల నామినేషన్స్ లో ఎలాంటి పాయింట్స్ దొరకవు. చాలా సిల్లీ కారణాలతో నామినేషన్స్ చేశారు. అయితే అందుతున్న విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఈ వారం ఎలిమినేషన్ ‘అగ్ని పరీక్ష 2’ కంటెస్టెంట్స్ లోనే ఉంటుందని అంటున్నారు విశ్లేషకులు. అంతే కాదు , ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉండే అవకాశాలు కూడా ఉన్నాయట. చివరి మూడు స్థానాల్లో నరేష్ , చరణ్, శ్రేష్టి ఉన్నారు. వీరిలో శ్రేష్టి , చరణ్ డేంజర్ జోన్ లో ఉన్నారట.
దీంతో ఈ వారం సింగిల్ ఎలిమినేషన్ పెడితే శ్రేష్టి ఎలిమినేట్ అవుతుందని, డబుల్ ఎలిమినేషన్ పెడితే శ్రేష్టి తో పాటు చరణ్ కోసం ఎలిమినేట్ అవుతాడని అంటున్నారు. ప్రస్తుతం ఓటింగ్ లో అందరికంటే శ్రేష్టి నే చివరి స్థానంలో లో ఉంది. గత వారం సుధీర్ పట్ల ఆమె వ్యవహరించిన తీరు కారణంగా సోషల్ మీడియా లో తీవ్రమైన నెగెటివిటీ ని కొనితెచ్చుకుంది. ఆ తర్వాత ఆమె అనేక సార్లు క్షమాపణలు చెప్పింది కానీ, ఆమె చుట్టూ గేమ్ ని తిప్పుకునే లాగా ఆడకపోవడం తో గ్రాఫ్ లో ఎలాంటి మార్పు రాలేదు. దీంతో ఈ వారం ఈమె కచ్చితంగా ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈమె తర్వాత చరణ్ కి కూడా ఎలిమినేట్ అయ్యే అవకాశాలు సమానంగా ఉన్నాయి. రెండవ సారి బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చే అరుదైన అవకాశం ఈయనకు దక్కింది. కానీ ఆ అవకాశాన్ని సరిగా ఉపయోగించుకోవడం లేదు.
రీ ఎంట్రీ తర్వాత చరణ్ ‘అబ్బా.. ఏమి ఆడాడు రా’ అని అనిపించినా సందర్భం ఒక్కటి కూడా లేదు. గత వారం రోహిత్ నామినేషన్స్ లో లేకపోవడం తో , ఆయన అభిమానులు మొత్తం చరణ్ కి ఓటు వెయ్యడం వల్ల సేవ్ అయ్యాడు. కానీ ఈ వారం అగ్ని పరీక్ష 2 కంటెస్టెంట్స్ అందరూ నామినేషన్స్ లోకి రావడం వల్ల , చరణ్ డేంజర్ జోన్ లో పడ్డాడు. వీళ్లిద్దరు కాకుండా, అమన్ , త్రిగున్ లు ఈ వారం బిగ్ బాస్ హౌస్ లో హద్దులు దాటి ప్రవరించారు. వీళ్లకు రెడ్ కార్డు ఇచ్చి బయటకు పంపే అవకాశాలు కూడా ఉన్నాయి, ఏదైనా జరగొచ్చు అనే రేంజ్ lo ఉన్నాయి ప్రస్తుత పరిస్థితులు , చూడాలి మరి ఏమి జరగబోతుంది అనేది.