Homeజాతీయ వార్తలుNEET Topper Inspiration: కరెంట్ లేదు.. ఇంటర్నెట్ రాదు.. బంధువుల చందాలతో నీట్ ర్యాంక్

NEET Topper Inspiration: కరెంట్ లేదు.. ఇంటర్నెట్ రాదు.. బంధువుల చందాలతో నీట్ ర్యాంక్

NEET Topper Inspiration: నీట్ పేపర్ లీకేజీ అయితే.. చాలామంది విద్యార్థులు నిరాశ చెందారు. నీరసపడిపోయారు. కొందరైతే ఉద్యమంలోకి వెళ్లారు. అయితే ఇతర మాత్రం పేపర్ లీక్ అయినప్పటికీ బాధపడలేదు. పైగా తన ప్రతిభను నమ్ముకున్నాడు. తన మేధస్సుకు మళ్లీ పరీక్ష పెట్టుకున్నాడు. గతానికంటే ఎక్కువ మార్కులు సాధించే విధంగా ప్రిపేర్ అయ్యాడు. ఫలితంగా నీట్ పరీక్షలో అద్భుతమైన ర్యాంక్ సాధించాడు. అతడి తల్లిదండ్రులు గొప్పగా చదువుకున్న వాళ్ళు కాదు. అతడిది గొప్ప నేపథ్యం కాదు. కాకపోతే […]

NEET Topper Inspiration: నీట్ పేపర్ లీకేజీ అయితే.. చాలామంది విద్యార్థులు నిరాశ చెందారు. నీరసపడిపోయారు. కొందరైతే ఉద్యమంలోకి వెళ్లారు. అయితే ఇతర మాత్రం పేపర్ లీక్ అయినప్పటికీ బాధపడలేదు. పైగా తన ప్రతిభను నమ్ముకున్నాడు. తన మేధస్సుకు మళ్లీ పరీక్ష పెట్టుకున్నాడు.

గతానికంటే ఎక్కువ మార్కులు సాధించే విధంగా ప్రిపేర్ అయ్యాడు. ఫలితంగా నీట్ పరీక్షలో అద్భుతమైన ర్యాంక్ సాధించాడు. అతడి తల్లిదండ్రులు గొప్పగా చదువుకున్న వాళ్ళు కాదు. అతడిది గొప్ప నేపథ్యం కాదు. కాకపోతే కష్టపడి చదువుకున్నాడు. వైద్యుడు కావాలని కలలు కన్నాడు. ఆ కలలను సాకారం చేసుకోవడానికి తీవ్రంగా కష్టపడ్డాడు. చివరికి అనుకున్నది సాధించాడు.

అతడు ఉన్నచోట కరెంటు ఉండేది కాదు. ఇంటర్నెట్ సదుపాయం అంతంత మాత్రమే. సదుపాయాలు లేకపోయినప్పటికీ.. కష్టాన్ని మాత్రమే నమ్ముకున్నాడు. రాత్రి పగలు అని కాకుండా.. ఒక పద్ధతి ప్రకారం చదువుకునేవాడు. పుస్తకాలతో కుస్తీపట్టేవాడు. చివరికి అనుకున్న సాధించాడు.. వైట్ ఆఫ్రాన్ వేసుకోవడానికి సిద్ధమయ్యాడు.

ఇలా కష్టపడి నీట్ ర్యాంకు సాధించిన ఆ యువకుడి పేరు బిషూ. ఇతడు నీట్ పరీక్షలో ఏకంగా 610 మార్కులు సాధించాడు. ఇతడు సాధించిన మార్పులకు 7320 ర్యాంకు వచ్చింది. బిషూ తండ్రి ఒక పేద రైతు. డబ్బులు లేకపోవడంతో బంధువుల సహాయంతో బిషూ కష్టపడి చదివాడు. చివరికి ఉచితంగా సీట్ సంపాదించాడు..

కరెంట్ లేదని బాధపడలేదు. ఇంటర్నెట్ అందుబాటులో లేదని ఇబ్బంది పడలేదు. పేపర్ లీక్ అయిందని వీధుల్లోకి వచ్చి గోల చేయలేదు. ఈసారి ఎలాగైనా సరే ఉన్నతమైన ర్యాంక్ సాధిస్తానని అనుకున్నాడు. అనుకున్నట్టుగానే చేసి చూపించాడు. కొందరు పరాన్న జీవుల మాదిరిగా రోడ్లమీదకి వచ్చారు. ప్రభుత్వం మీద విమర్శలు చేశారు. కానీ బిషూ కష్టాన్ని నమ్ముకున్నాడు. నీట్ ర్యాంకర్ అయ్యాడు.

వైద్యుడిగా మారిన తర్వాత తమ గ్రామంలో పేద ప్రజలకు ఉచితంగా వైద్య సేవలు అందిస్తానని.. భవిష్యత్తు కాలంలో ఒక ఆసుపత్రి నిర్మిస్తానని బిషూ చెబుతున్నాడు. వైద్యం అందక చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారని.. అటువంటి వారి కోసం కచ్చితంగా అత్యున్నతమైన వైద్యాన్ని తాను అందిస్తానని ఆ యువకుడు చెబుతున్నాడు. బిషూ పుట్టిన ప్రాంతం అత్యంత వెనుకబడింది. ఇక్కడి నుంచి కష్టపడి చదివి ఈ స్థాయికి వచ్చాడు అతడు. లక్షల మందికి అతడు ఆదర్శంగా నిలుస్తున్నాడు. పెద్దపెద్ద కాలేజీలలో చదవకపోయినప్పటికీ నీట్ ర్యాంక్ సాధించవచ్చు అని అతడు నిరూపిస్తున్నాడు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper