Homeఎంటర్టైన్మెంట్Bigg Boss 10 Telugu: హీరో రామ్ కజిన్ 'బిగ్ బాస్ 10' లో ఒక...

Bigg Boss 10 Telugu: హీరో రామ్ కజిన్ ‘బిగ్ బాస్ 10’ లో ఒక కంటెస్టెంట్ గా ఉన్నాడు.. ఎవరో చెప్పగలరా!

Bigg Boss 10 Telugu:  ఈ బిగ్ బాస్ సీజన్ అనుకున్న దానికంటే స్ట్రాంగ్ గా ముందుకు దూసుకెళ్తోంది. నాలుగైదు వారాల తర్వాత గేమ్ రసవత్తరంగా మారడం సహజం. కానీ ఈ సీజన్ మొదటి వారం నుండే రసవత్తరంగా మారింది. కంటెస్టెంట్స్ మధ్య గొడవలు, కొట్లాటలు తారా స్థాయికి చేరుకున్నాయి. టాస్కులు కూడా బిగ్ బాస్ టీం ఆ రేంజ్ లోనే ప్లాన్ చేసింది. అయితే ఈ సీజన్ లో కంటెంట్ అంటే మన అందరికీ గుర్తుకొచ్చే […]

Bigg Boss 10 Telugu:  ఈ బిగ్ బాస్ సీజన్ అనుకున్న దానికంటే స్ట్రాంగ్ గా ముందుకు దూసుకెళ్తోంది. నాలుగైదు వారాల తర్వాత గేమ్ రసవత్తరంగా మారడం సహజం. కానీ ఈ సీజన్ మొదటి వారం నుండే రసవత్తరంగా మారింది. కంటెస్టెంట్స్ మధ్య గొడవలు, కొట్లాటలు తారా స్థాయికి చేరుకున్నాయి. టాస్కులు కూడా బిగ్ బాస్ టీం ఆ రేంజ్ లోనే ప్లాన్ చేసింది. అయితే ఈ సీజన్ లో కంటెంట్ అంటే మన అందరికీ గుర్తుకొచ్చే కంటెస్టెంట్ త్రిగున్ . బహుశా భవిష్యత్తులో కూడా ఈ రేంజ్ కంటెంట్ ని ఇచ్చే కంటెస్టెంట్ ని మళ్లీ చూడలేము ఏమో , ఆ స్థాయిలో గేమ్ ఆడుతున్నాడు. అయితే త్రిగున్ గురించి సోషల్ మీడియా లో రోజుకో వార్త లీక్ అవుతూ బాగా వైరల్ అవుతున్నాయి. నిన్న మొన్నటి వరకు ఈయన బిగ్ బాస్ సీజన్ 6 టైటిల్ విన్నర్ రేవంత్ కి దూరపు బంధువు అంటూ ప్రచారం జరిగింది.

ఇప్పుడు లేటెస్ట్ గా ఈయనకు సంబంధించి మరో ఆసక్తికరమైన వార్త ప్రచారం లోకి వచ్చింది. ఈయన ప్రముఖ యంగ్ హీరో రామ్ పోతినేని కి స్వయానా కజిన్ బ్రదర్ అవుతాడట. అతని రికమండేషన్ తోనే ఈయన ఇండస్ట్రీ లోకి ‘కథ’ అనే చిత్రం ద్వారా ఎంట్రీ ఇచ్చాడని, అప్పటి నుండి రీసెంట్ సూపర్ హిట్ ‘చెన్నై లవ్ స్టోరీ’ వరకు ఆయన సినీ ప్రస్థానం సాగిందని అంటున్నారు. త్రిగున్ ఫేస్ కట్ కూడా రామ్ తో పోలి ఉండడాన్ని చూసి, ఇతనికి రామ్ కి లింక్ ఏదైనా ఉందా అనే సందేహం ఈయన బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టిన మొదటి రోజే ఆడియన్స్ లో ఉండేది. ఇప్పుడు నిజంగా వీళ్లిద్దరు కజిన్స్ అనే వార్త ప్రచారం లోకి రావడం హాట్ టాపిక్ గా మారింది.

అయితే త్రిగున్ పై ప్రస్తుతం సోషల్ మీడియా లో తీవ్రమైన నెగెటివిటీ ఏర్పడింది. ఎందుకంటే ఈయన ప్రతీ కంటెస్టెంట్ ని ట్రిగర్ చేసి , వారిపై నోరు జారడం వంటివి చేస్తున్నాడు. పైగా నాగార్జున కూడా ఇతన్ని ఆశించిన స్థాయిలో మందలించకపోవడం తో , ఇతని నోటికి, చేసే చేష్టలకు లిమిట్ లేకుండా పోయింది. ఇదొక్క లక్షణం తగ్గించుకుంటే , త్రిగున్ కి టైటిల్ కొట్టేంత సత్తా ఉందని అంటున్నారు నెటిజెన్స్. ప్రస్తుతానికి ఆయన అధికారిక ఓటింగ్ లో టాప్ 3 స్థానం లో కొనసాగుతుండగా , మొదటి స్థానం లో రోహిత్ కనీవినీ ఎరుగని రేంజ్ భారీ ఓటింగ్ మార్జిన్ ఆధిక్యంతో కొనసాగుతున్నాడు. మరి రాబోయే రోజుల్లో ఏమి జరగబోతుందో చూడాలి.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper