Pawan Kalyan: జనసేన పార్టీ ని తక్కువ అంచనా వేసిన కొంతమంది రాజకీయ విశ్లేషకులకు రాబోయే రోజుల్లో ఊహించని షాక్ పవన్ కళ్యాణ్ ఇవ్వబోతున్నాడా అంటే అవుననే చెప్పాలి. ఇంతకాలం పవన్ కళ్యాణ్ తన పార్టీ కి పటిష్టమైన నాయకత్వం కోసం ఇతర పార్టీ నేతలను తన పార్టీ లోకి ఆహ్వానించలేదు. ఎవరైనా తన ఆశయాలను నచ్చి పార్టీ లో చేరితే చేర్పించుకునేవాడు కానీ, ఇతర పార్టీ అధినేతలు లాగా , తమకు కావాల్సిన నాయకుల కోసం రెడ్ కార్పెట్ పరచలేదు. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ తన పంధా ని మార్చినట్టు తెలుస్తోంది. ‘ఆపరేషన్ ఆకర్ష్’ ని మొదలు పెట్టిన పవన్ కళ్యాణ్ , వైసీపీ నుండి ముఖ్య నాయకులందరినీ తన పార్టీ లోకి తీసుకుంటున్నాడు. గడిచిన వారం రోజుల్లో జనసేన పార్టీ లో ఏ రేంజ్ చేరికలు జరిగాయో మనమంతా చూసాము.
రాబోయే రోజుల్లో మైండ్ బ్లాక్ అయ్యే రేంజ్ నేతలు జనసేన లో చేరబోతున్నారు అట. ముఖ్యంగా ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలపై పవన్ కళ్యాణ్ ప్రత్యేకమైన ద్రుష్టి పెట్టినట్టు సమాచారం. ఈ రెండు జిల్లాల్లో వైసీపీ పార్టీ పూర్తిగా ఖాళీ అయ్యే అవకాశాలు ఉన్నాయట. దసరా లోపు ఊహించని నేతలతో జనసేన పార్టీ కళకళలాడబోతుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో కొత్తగా చేరిన వీళ్లంతా కీలక బాధ్యతలు చేపట్టబోతున్నారట. ఇక ఉభయ గోదావరి జిల్లాల్లో కూడా కీలక వైసీపీ నేతలు జనసేన పార్టీ లో చేరేందుకు సిద్ధంగా ఉన్నారట. అందులో ముఖ్యంగా గత ఎన్నికల్లో వైసీపీ పార్టీ తరుపున పోటీ చేసిన చలమశెట్టి సునీల్ ఉన్నట్టు తెలుస్తోంది. త్వరలోనే ఈయన పవన్ కళ్యాణ్ సమక్షం లో జనసేన పార్టీ కండువా కప్పుకోనున్నాడు. అదే విధంగా పిఠాపురం లో గత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ కి పోటీ గా చేసిన వంగా గీత కూడా జనసేన పార్టీ లో చేరబోతున్నట్టు టాక్ వినిపిస్తోంది. ఇలా రాబోయే రోజుల్లో ఆపరేషన్ ఆకర్ష్ పేరిట పవన్ కళ్యాణ్ వైసీపీ పార్టీ ని కోలుకోలేని దెబ్బ తీయబోతున్నాడని రాజకీయ వర్గాల్లో జోరుగా ఒక ప్రచారం సాగుతోంది.