ABN RK Vs Jagan: ఆడుదాం ఆంధ్రా.. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి క్రీడలను ప్రోత్సహించేందుకు ఇటీవలే శ్రీకారం చుట్టారు. ఆడుదాం ఆంధ్రా పేరుతో గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకూ పోలీలు నిర్వహించాలని ఆదేశించారు. ఈమేరకు ఇటీవల అధికారులతో సమీక్ష నిర్వహించి దిశానిర్దేశం చేశారు. క్రీడల నిర్వహణకు రూ.50 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. మూడు నెలల్లో ఆటలు పూర్తిచేసేలా ప్రణాళిక సిద్ధం చేయాలని తెలిపారు. దీంతో ఆంధ్రా క్రీడాకారుల్లో ఉత్సాహం కనిపిస్తోంది. టాలెంట్, క్రీడా నైపుణ్యం ఉన్న అనేక మంది క్రీడాకారులు తమ సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నారు.
ఆర్కే నాయుడికి మింగుడ పడక..
ఆడుదాం ఆంధ్రా పేరుతో ఏపీ ప్రభుత్వం నిర్వహించే క్రీడలు ఆంధ్రజ్యోతి పత్రిక ఎండీ రాధాకృష్ణ, ఏపీ ప్రతిపక్ష నేత నారా చంద్రబాబునాయుడుకు మింగుడు పడడం లేదు. ఏపీ సీఎం ఏ కార్యక్రమం చేపట్టినా దానిలో లోపాలను వెతకడమే అక్కడి కొన్ని మీడియా సంస్థలు పనిగా పెట్టుకున్నాయి. ఇందులో భాగంగానే ఆంధ్రజ్యోతి ఎండీ క్రీడల్లో లోపాలను వెతికి చంద్రబాబుకు పాజటివ్‌గా తన పత్రికలో కథనం వండి వార్చారు. అయితే.. ఇది బూమరాంగ్ అయింది. ప్రభుత్వ తీరును తప్పు పడతారని అనుకుంటే.. అది బెడిసి కొట్టి ఆంధ్రజ్యోతినే తిట్టిపోస్తున్నారు. క్రీడాకారులు.
క్రీడలను ప్రోత్సహించేలా..
ఐపీఎల్‌లో చెన్నై, ముంబై, గుజరాత్, హైదరాబాద్ ఇలా ఒక్కో రాష్ట్రానికి ఒక్కో టీం ఉన్నాయి. ఏపీకి మాత్రం ఐపీఎల్‌లో చాన్స్ లేదు. ఈ నేపథ్యంలో ఇటీవల ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ఐపీఎల్‌లో ఏపీ టీం కోసం విశాఖ వారియర్స్ పేరుతో రూపొందించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందుకోసం మాజీ క్రికెటర్ అంబటి రాయుడుతోపాటు మరికొందరి సహకారం తీసుకుంటున్నారు. ఇదే క్రమంలో ఏపీలో గ్రామీణ క్రీడాకారులను వెలికి తీసుకువచ్చేందుకు ఆడుదాం ఆంధ్ర పేరుతో క్రీడల నిర్వహణకు ప్రణాళిక రూపొందించారు. మూడు నెలలపాటు నిర్వహించే క్రీడలకు ప్రణాళిక సిద్ధమవుతోంది.
బాబు చేస్తే సంపారం.. జగన్ చేస్తే..
బాబు చేస్తే సంసారం.. జగన్ చేస్తే వ్యభిచారం అన్నట్లుగా ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ ఆడుదాం ఆంధ్ర క్రీడలను తన కథనంలో తప్పు పట్టారు. కేవలం ఎన్నికల స్టంట్‌గా అభివర్ణించారు. ఆర్కే చెప్పినట్లు ఎన్నికల కోసమే అనుకుందాం.. మరి చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు పెట్టిన పసుపు కుంకుమ, పెట్టుబడి సాయం ఇతర పథకాలు దేనికోసమో ఆర్కే చెప్పాలి. అసలు ఐదేళ్లు ముఖ్యమంత్రిగా ఉండి ఏపీలో క్రీడలు నిర్వహించలేకపోయిన 40 ఇయర్స్ ఇండస్ట్రీ ముఖ్యమంత్రిని ఆర్కే అడిగి ఉంటే బాగుండు అన్న అభిప్రాయం ఆంధ్రా క్రీడాకారుల్లో వ్యక్తమవుతోంది.