Homeఎంటర్టైన్మెంట్Chiranjeevi : చిరంజీవి కి ఇలాంటి కథ రాస్తావా అని ఆ స్టార్ రైటర్ ను...

Chiranjeevi : చిరంజీవి కి ఇలాంటి కథ రాస్తావా అని ఆ స్టార్ రైటర్ ను అవమానించిన టాప్ ప్రొడ్యూసర్…

Chiranjeevi : గత 50 సంవత్సరాలుగా తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎనలేని సేవలను అందిస్తున్న నటుడు మెగాస్టార్ చిరంజీవి… ఆయన నుంచి వచ్చిన ప్రతి సినిమాలో ఏదో ఒక వైవిధ్యమైన కథాంశమైతే ఉంటుంది. ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాల విషయంలో చాలా క్లారిటిని మెయింటైన్ చేస్తూ ముందుకు దూసుకెళ్తున్నాడు. ఇక ఇదిలా ఉంటే గతంలో ఒక స్టార్ రైటర్ మెగాస్టార్ చిరంజీవి కోసం ఒక అదిరిపోయే కథను రాశాడు. ఆ స్టోరీ ప్రొడ్యూసర్స్ కి వినిపించినప్పుడు ప్రొడ్యూసర్స్ […]

Chiranjeevi : గత 50 సంవత్సరాలుగా తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎనలేని సేవలను అందిస్తున్న నటుడు మెగాస్టార్ చిరంజీవి… ఆయన నుంచి వచ్చిన ప్రతి సినిమాలో ఏదో ఒక వైవిధ్యమైన కథాంశమైతే ఉంటుంది. ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాల విషయంలో చాలా క్లారిటిని మెయింటైన్ చేస్తూ ముందుకు దూసుకెళ్తున్నాడు. ఇక ఇదిలా ఉంటే గతంలో ఒక స్టార్ రైటర్ మెగాస్టార్ చిరంజీవి కోసం ఒక అదిరిపోయే కథను రాశాడు. ఆ స్టోరీ ప్రొడ్యూసర్స్ కి వినిపించినప్పుడు ప్రొడ్యూసర్స్ అతన్ని తీవ్రంగా విమర్శించారు అంటూ కొన్ని వార్తలైతే వస్తున్నాయి. ఇంతకీ ఆ రైటర్ ఎవరు అతన్ని హేళన చేసిన ప్రొడ్యూసర్ ఎవరు అనే విషయాలను మనం ఒకసారి తెలుసుకుందాం… 2002వ సంవత్సరంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా వచ్చిన ‘ఇంద్ర’ సినిమా భారీ రికార్డులను కొల్లగొడుతూ ఇండస్ట్రీ రికార్డులను బ్రేక్ చేసిందనే విషయం మనందరికి తెలిసిందే. అయితే ఈ సినిమా రైటర్ అయిన చిన్నికృష్ణ దీనికి ముందు నరసింహనాయుడు అనే సినిమాతో బ్లాక్ బాస్టర్ ఇండస్ట్రీ హిట్ దక్కించుకున్నాడు. ఇక ఆ తర్వాత ప్రముఖ ప్రొడ్యూసర్ అయిన అశ్విని దత్ చిన్నికృష్ణ ను పిలిపించి చిరంజీవికి ఒక కథ రాయమని అడిగారట.

దాంతో ఆయన కొన్ని రోజుల సమయం తీసుకొని ఇండస్ట్రీ మూవీ కథని రాసుకున్నాడు. ఆ మూవీ స్టోరీ ని అశ్వినీదత్, డైరెక్టర్ బి గోపాల్ ఇద్దరికి వినిపించడంతో ఆయన మెగాస్టార్ చిరంజీవి అంటే సినిమా కథ నెక్స్ట్ లెవెల్లో ఉండాలి. అంతే తప్ప ఈ రాయలసీమ ప్రజల కోసం ఆయన ల్యాండ్ వదిలేసి కాశీకి వెళ్లిపోవడమేంటి అంటూ అతన్ని డిస్కరేజ్ చేస్తూ కొన్ని మాటలైతే మాట్లాడట. దాంతో చిన్ని కృష్ణకు విపరీతమైన కోపమైతే వచ్చిందట.

వెంటనే ఆయన అక్కడి నుంచి లేచి బయటకెళ్ళిపోయారట. ఇక పరుచూరి గోపాలకృష్ణ కోరిక మేరకు చిన్ని కృష్ణ ఈ కథను చిరంజీవికి చెప్పడంతో కథ ఆయనకి బాగా నచ్చి అందులో చిన్న చిన్న మార్పులు చేర్పులు చేసి బి గోపాల్ డైరెక్షన్లో సినిమాని సెట్స్ మీదకి తీసుకెళ్లారు. ఫైనల్ గా ఈ సినిమా ఇండస్ట్రీ రికార్డులను బ్రేక్ చేస్తూ చిరంజీవి ఇమేజ్ ను అమాంతం పెంచే సినిమాగా మారిపోయింది.

మొదటిసారి చిరంజీవి ఫ్యాక్షనిస్ట్ గా కనిపించడం తో సినిమాలో ఉన్న ప్రతి ఒక్క ఎలిమెంట్ ప్రేక్షకులందరికి బాగా కనెక్ట్ అయింది… దాంతో ఈ సినిమా సూపర్ డూపర్ సక్సెస్ ను సాధించింది. ఇక ప్రొడ్యూసర్ ఇన్సల్ట్ చేసిన విషయాన్ని చిన్ని కృష్ణ తనే స్వయంగా ఒక ఇంటర్వ్యూ లో తెలియజేయడం విశేషం…ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది…

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Related News

Most Popular

Oktelugu Epaper