Homeఎంటర్టైన్మెంట్Bullet Bhaskar : వామ్మో ..'జబర్దస్త్' లోకి రాకముందు 'బులెట్ భాస్కర్' 7 ఏళ్ళు అలాంటి...

Bullet Bhaskar : వామ్మో ..’జబర్దస్త్’ లోకి రాకముందు ‘బులెట్ భాస్కర్’ 7 ఏళ్ళు అలాంటి పనులు చేసేవాడా?

Bullet Bhaskar : ఈటీవీ లో గత 12 ఏళ్లుగా ప్రసారం అవుతున్న ‘జబర్దస్త్’ కామెడీ షో ద్వారా ఇండస్ట్రీ కి ఎంతో మంది టాలెంటెడ్ కమెడియన్స్ పరిచమయ్యారు. నేడు టాలీవుడ్ లో గెటప్ శ్రీను , సుడిగాలి సుధీర్, హైపర్ ఆది , చమ్మక్ చంద్ర వంటి కమెడియన్స్ ఉన్నత స్థాయిలో చలామణి అవుతున్నారంటే అందుకు ముఖ్య కారణం ముమ్మాటికీ ‘జబర్దస్త్’ మాత్రమే. అయితే కొంతమంది కమెడియన్స్ మాత్రం , మంచి కామెడీ టైమింగ్ తో […]

Bullet Bhaskar : ఈటీవీ లో గత 12 ఏళ్లుగా ప్రసారం అవుతున్న ‘జబర్దస్త్’ కామెడీ షో ద్వారా ఇండస్ట్రీ కి ఎంతో మంది టాలెంటెడ్ కమెడియన్స్ పరిచమయ్యారు. నేడు టాలీవుడ్ లో గెటప్ శ్రీను , సుడిగాలి సుధీర్, హైపర్ ఆది , చమ్మక్ చంద్ర వంటి కమెడియన్స్ ఉన్నత స్థాయిలో చలామణి అవుతున్నారంటే అందుకు ముఖ్య కారణం ముమ్మాటికీ ‘జబర్దస్త్’ మాత్రమే. అయితే కొంతమంది కమెడియన్స్ మాత్రం , మంచి కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను ఎన్నో ఏళ్ళ నుండి అలరిస్తున్నప్పటికీ , ఇప్పటికీ జబర్దస్త్ ని దాటి బయటకు రానోళ్లు ఉన్నారు. అలాంటి వారిలో ఒకరు బులెట్ భాస్కర్. ఈయనకు ఇప్పటి వరకు సినిమాల్లో నటించే అవకాశం రాలేదు. ఇప్పటికీ ‘జబర్దస్త్’, ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’ వంటి షోస్ లోనే కొనసాగుతున్నాడు. అయితే బులెట్ భాస్కర్ గురించి ఎవరికీ తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు మీ ముందు ఉంచబోతున్నాము.

జబర్దస్త్ లోకి రాకముందు బులెట్ భాస్కర్ 7 ఏళ్ళ పాటు రేడియో జాకీ గా పనిచేసేవాడ. తాను రేడియో జాకీ గా పనిచేసే రోజుల్లో హైదరాబాద్ లో ఒక్క రేడియో స్టేషన్ కూడా ఉండేది కాదని, ఆంధ్ర ప్రదేశ్ లోని వైజాగ్ లోనే రేడియో స్టేషన్ ఉండేది అట. అక్కడ 7 ఏళ్ళు పని చేసిన తర్వాత కొన్నేళ్లు రేడియో స్టేషన్ హెడ్ గా కూడా పనిచేసాడట. అంతే కాదు , ఇతని ప్రత్యేకత ఏమిటంటే , వైజాగ్ లో రేడియో జాకీ గా పని చేసే రోజుల్లోనే , ఇండియా లోనే ‘ది బెస్ట్ రేడియో జాకీ’ గా అవార్డు ని కూడా అందుకున్నాడట. ఇక ఆ తర్వాత కొంత మిస్ కమ్యూనికేషన్ కారణం గా అక్కడి నుండి హైదరాబాద్ కి వచ్చేసాడట. ఇక తర్వాత సినిమాల్లో అవకాశాల కోసం తిరగడం , యాదృచ్చికంగా ‘జబర్దస్త్’ లో అవకాశం రావడం జరిగిందట.

ఇక జబర్దస్త్ లోకి ఎంట్రీ ఇచ్చాక ఆయన రేంజ్ ఎలా మారిపోయిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. జబర్దస్త్ షో ని ఇప్పటికీ ఆడియన్స్ చూస్తున్నారంటే , అందుకు ప్రధాన కారణాల్లో బుల్లెట్ భాస్కర్ కూడా ఒకరు అనడం లో ఎలాంటి సందేహం లేదు. అంతే కాదు ఈయన సినిమాల్లో డబ్బింగ్ కూడా చెప్తూ ఉంటాడట. సూపర్ స్టార్ మహేష్ బాబు వాయిస్ ని ఈయన రేంజ్ లో ఎవ్వరూ ఇమిటేట్ చెయ్యలేరని అంటుంటారు. కొన్ని ఇంటర్వూస్ లో ఆయన మహేష్ బాబు వాయిస్ ని డిట్టో గా అనుకరిస్తూ మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. 1 నేనొక్కడినే చిత్రం లో మహేష్ బాబు కి పలు సన్నివేశాల్లో డబ్బింగ్ కూడా చెప్పాడట బుల్లెట్ భాస్కర్.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Related News

Most Popular

Oktelugu Epaper