Mallareddy : ఇప్పటిదాకా తెలంగాణ ప్రాంతంలో ఆంధ్ర వ్యాపారులు దండిగా వ్యాపారం చేశారు. చేస్తూనే ఉన్నారు. విద్యాసంస్థల నుంచి మొదలుపెడితే ఫార్మా కంపెనీల వరకు తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్ర ప్రాంత వ్యాపారులు నిర్వహిస్తున్నారు. తెలంగాణ నుంచి భారీగానే వ్యాపారులు ఉన్నప్పటికీ.. వారెవరు కూడా అక్కడ వ్యాపారాలు చేయడం లేదు.
ఈ థియరీని పూర్తిగా మార్చేశారు తెలంగాణ ఎమ్మెల్యే మల్లారెడ్డి.. మల్లారెడ్డికి తెలంగాణ వ్యాప్తంగా విద్యాసంస్థలు ఉన్నాయి. ఇంజనీరింగ్ నుంచి మొదలు పెడితే మెడిసిన్ కాలేజీల వరకు.. అన్ని విద్యాసంస్థలు ఆయన ఆధ్వర్యంలో కొనసాగుతున్నాయి. ఆయన లక్నోలో.. ఇతర ప్రాంతాలలో విశ్వవిద్యాలయాలు ఏర్పాటు చేయడానికి రంగం సిద్ధం చేసుకున్నారు. గతంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగిని కలిశారు. లక్నోలో యూనివర్సిటీ ఏర్పాటుకు మార్గం సుగమం చేసుకున్నారు. మల్లారెడ్డి లక్నో.. ఇతర ప్రాంతాలతోనే ఆగిపోవడం లేదు. ఆంధ్రప్రదేశ్లో కూడా ఆయన అడుగు పెట్టారు.
పుణ్యభూమిగా.. దేవ భూమిగా పేరుగాంచిన తిరుపతిలో మల్లారెడ్డి యూనివర్సిటీ ఏర్పాటు చేశారు. మోహన్ బాబుకు పోటీగా పూర్తి ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్ కోర్సులు అందించే యూనివర్సిటీని నెలకొల్పారు. ఇప్పటికే అడ్మిషన్లు కూడా పూర్తయ్యాయి. సోమవారం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకుని.. యూనివర్సిటీ ప్రారంభించారు. శ్రీవారిని దర్శించుకున్న తర్వాత విలేకరులతో మల్లారెడ్డి మాట్లాడారు..”ఈరోజు నేను మల్లారెడ్డి యూనివర్సిటీని తిరుపతిలో ప్రారంభించాను. చాలా ఆనందంగా ఉంది. అడ్మిషన్లు కూడా చాలా బాగా జరిగాయి. యూనివర్సిటీని ఏర్పాటు చేసుకోవడం ఆనందంగా ఉంది. ఆంధ్ర ప్రాంతానికి చెందిన వారు మాత్రమే తెలంగాణలో విద్యాసంస్థలు ఏర్పాటు చేశారు. ఇప్పుడు నేను దానిని పూర్తిగా మార్చబోతున్నాను. తెలంగాణ ప్రాంతానికి చెందినవారు ఆంధ్రాలో విద్యాసంస్థలు ఏర్పాటు చేసేందుకు నేను అడుగులు వేశాను. ఇదంతా దైవ సంకల్పం. వెంకటేశ్వర స్వామి నేను కోరింది ఇస్తున్నాడు. నా జన్మదినం రోజున తిరుమల వచ్చాను. స్వామివారిని విశ్వవిద్యాల ఏర్పాటు గురించి అడిగాను. దానికి ఆయన సమ్మతం తెలిపారు. మొత్తంగా విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేసేందుకు నాకు వరం ఇచ్చారు. స్వామివారి దయతో అంతా బాగా జరిగాయని”మల్లారెడ్డి పేర్కొన్నారు.
మల్లారెడ్డి తిరుపతిలో భారీ విస్తీర్ణంలోనే విశ్వవిద్యాలయం ఏర్పాటు చేశారు. అందులో అధునాతన సౌకర్యాలు కల్పించారు. గతంలో తిరుపతిలో ఓ విద్యాసంస్థ ఉండేది. అది ఆర్థిక నష్టాల వల్ల మూతపడింది. దాని గురించి తెలుసుకున్న మల్లారెడ్డి.. ఆ భవనాన్ని కొనుగోలు చేశారు. ఇప్పటి కాలానికి అనుగుణంగా అందులో మార్పులు చేశారు. నేటి విద్యార్థులకు అనుగుణంగా అందులో కోర్సులు ఏర్పాటు చేశారు. అనతి కాలంలోనే ఇక్కడ విశ్వవిద్యాలయాన్ని ప్రారంభించారు. తిరుపతి ప్రాంతంలో మోహన్ బాబుకు శ్రీ విద్యానికేతన్ పేరుతో విశ్వవిద్యాలయం ఉంది. ఇప్పుడు మల్లారెడ్డి ఏర్పాటుచేసిన విశ్వవిద్యాలయం శ్రీ విద్యానికేతన్ కు పోటీ ఇస్తుందని విశ్లేషకులు అంటున్నారు.
BRS MLA Malla Reddy casually debunks the narrative that Telangana people CANNOT do business in Andhra Pradesh.!!
His college is now in Tirupati, and by his own admission, the response from AP has been very good.
“With the blessings of Lord Venkateswara, admissions to our… pic.twitter.com/aGje6XA5Bw
— Telugu360 (@Telugu360) August 17, 2026