Homeఎంటర్టైన్మెంట్Agni Pareeksha 2 : అగ్ని పరీక్ష 2: ఉప్పల్ బాలూ వివాదం.. నన్నే ట్రోల్...

Agni Pareeksha 2 : అగ్ని పరీక్ష 2: ఉప్పల్ బాలూ వివాదం.. నన్నే ట్రోల్ చేస్తారా? నవదీప్ సంచలన వీడియో..

Agni Pareeksha 2 : రీసెంట్ గానే స్టార్ మా, జియో హాట్ స్టార్ లలో స్ట్రీమింగ్ ని మొదలు పెట్టుకున్న ‘అగ్ని పరీక్ష 2’ షో కి సోషల్ మీడియా లో నెటిజెన్స్ నుండి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో మన కళ్లారా చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా జడ్జీలపై , యాంకర్ శ్రీముఖి పై నెటిజెన్స్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. ఎంతో కష్టపడి ఇంత దూరం వచ్చిన సామాన్యులను , వీళ్ళు పైన నుండి దిగొచ్చిన దేవుళ్ళు […]

Agni Pareeksha 2 : రీసెంట్ గానే స్టార్ మా, జియో హాట్ స్టార్ లలో స్ట్రీమింగ్ ని మొదలు పెట్టుకున్న ‘అగ్ని పరీక్ష 2’ షో కి సోషల్ మీడియా లో నెటిజెన్స్ నుండి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో మన కళ్లారా చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా జడ్జీలపై , యాంకర్ శ్రీముఖి పై నెటిజెన్స్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. ఎంతో కష్టపడి ఇంత దూరం వచ్చిన సామాన్యులను , వీళ్ళు పైన నుండి దిగొచ్చిన దేవుళ్ళు లాగా, తక్కువ చేసి చూడడం , ఇష్టమొచ్చినట్టు వాళ్ళతో ప్రవర్తించడం అసలు నచ్చడం లేదని, అసలు ఈసారి ‘బిగ్ బాస్’ షో నే చూడము అంటూ చెప్పుకొచ్చారు. ముఖ్యంగా నవదీప్ ఉప్పల్ బాలు ని అవమానించిన తీరుపై సోషల్ మీడియా లో నెటిజెన్స్ భగ్గుమన్నారు. ఈ అంశాలపై నవదీప్ కాసేపటి క్రితమే తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో ఒక వీడియో ద్వారా స్పందించారు. ఈ వీడియో లో ఆయన మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి.

ఆయన మాట్లాడుతూ ”బిగ్ బాస్’ అనే ఒక మినీ సైజు సొసైటీ. రకరకాల మైండ్ సెట్ ఉన్న వాళ్ళు , యాటిట్యుడ్స్ , ఆలోచనలు ఉండే మనుషుల మధ్యలో 100 రోజులు బ్రతుకుతున్నప్పుడు ఎవరెవరో ఏదేదో అంటారు. అలా అన్నప్పుడు ఆ మాటల్ని ఎలా తీసుకుంటాము, ఎలా రియాక్ట్ అవుతాము , ఎలా మనల్ని మనం కండక్ట్ చేసుకుంటాము అనేదే పాయింట్. దానికి టెస్ట్ నే అగ్ని పరీక్ష. మాకు కంటెస్టెంట్స్ కి కేటాయిస్తారు. ఇంటర్నెట్ లో సాధారణంగా ఎదురయ్యే నెగెటివ్ కామెంట్స్ , ట్రోల్స్ ని మేము వాళ్లపై ఉపయోగిస్తాము. వాటిని వాళ్ళు తట్టుకొని ఎలా ముందుకు వెళ్తారు అనేదే ఈ షో కాన్సెప్ట్. 100 రోజుల పాటు ఒక మినీ సొసైటీ లో రకరకాల ఎమోషన్స్ ని తట్టుకోగలరా లేదా అనేది మేము చూడాలి. అలా తట్టుకొని ముందుకు వెళ్ళేవాళ్ళు అనిపిస్తేనే మేము బిగ్ బాస్ లోకి పంపుతాము. దయచేసి ఈ ఫార్మటు ని అందరూ అర్థం చేసుకోండి’ అంటూ చెప్పుకొచ్చాడు నవదీప్. మరి నవదీప్ క్లారిటీ ఇచ్చిన తర్వాత అయినా సోషల్ మీడియా లో ఆయన పై నెగెటివిటీ తగ్గుతుందో లేదో చూడాలి.

 

View this post on Instagram

 

A post shared by Nav Deep 2.0 (@pnavdeep)

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper