Homeలైఫ్ స్టైల్Protein Rich Foods : మన దేశం బలంగా ఉండాలంటే ఏం చేయాలి?

Protein Rich Foods : మన దేశం బలంగా ఉండాలంటే ఏం చేయాలి?

Protein Rich Foods : దేశమంటే మట్టి కాదోయ్.. దేశమంటే మనుషులోయ్.. అన్నారు పెద్దలు. అంటే ఒక దేశం బాగుండాలంటే భూస్వరూపం అందంగా ఉండడం అని కాదు. ఆ దేశంలో ప్రగతితోపాటు ప్రజలు సంతోషంగా ఉండాలి. అయితే ప్రజలు సంతోషంగా ఉండాలంటే వారికి సకల సౌకర్యాలు అందుబాటులో ఉండాలి. మరీ ముఖ్యంగా వారు ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యంగా ఉండడానికి సరైన ఆహారం తీసుకోవాలి. ఎలాంటి ఆహారం తీసుకుంటే ప్రజలు ఆరోగ్యంగా ఉంటారు? ప్రస్తుత కాలంలో చాలామంది స్ట్రీట్ ఫుడ్ […]

Protein Rich Foods : దేశమంటే మట్టి కాదోయ్.. దేశమంటే మనుషులోయ్.. అన్నారు పెద్దలు. అంటే ఒక దేశం బాగుండాలంటే భూస్వరూపం అందంగా ఉండడం అని కాదు. ఆ దేశంలో ప్రగతితోపాటు ప్రజలు సంతోషంగా ఉండాలి. అయితే ప్రజలు సంతోషంగా ఉండాలంటే వారికి సకల సౌకర్యాలు అందుబాటులో ఉండాలి. మరీ ముఖ్యంగా వారు ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యంగా ఉండడానికి సరైన ఆహారం తీసుకోవాలి. ఎలాంటి ఆహారం తీసుకుంటే ప్రజలు ఆరోగ్యంగా ఉంటారు?

ప్రస్తుత కాలంలో చాలామంది స్ట్రీట్ ఫుడ్ కు అలవాటు పడ్డారు. కొందరు కొత్తరకం టేస్టీ కోసం రకరకాల ఆహార పదార్థాలను తయారు చేస్తున్నారు. అయితే వీటిలో ఎంతవరకు ప్రోటీన్ ఉంది? అన్నది ఆలోచించుకోవాలి. కేవలం టెస్ట్ కోసం కాకుండా అందులో ప్రోటీన్ ఉంటేనే అది శరీరానికి సరైన ఆరోగ్యాన్ని అందిస్తుంది. ప్రోటీన్ లేని ఆహారం ఎంత తీసుకున్నా కూడా శరీరం సరైన ఆకృతిలో ఉండకపోవడమే కాకుండా అనేక అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ అనారోగ్య సమస్యలు రాకుండా ఉండాలంటే ప్రోటీన్లతో కలిగిన ఆహారాన్ని తీసుకోవాలి.

మార్కెట్లో దొరికే ఎన్నో రకాల ఆహార పదార్థాల్లో ప్రోటీన్లు పుష్కలంగా ఉంటున్నాయి. కానీ వాటిని ఎంపిక చేసుకోవడంలోనే చాలామంది పొరపాటు పడుతున్నారు. కొందరు సరైన ప్రోటీన్ ఇచ్చే ఆహారాన్ని వద్దనుకొని.. కేవలం తాత్కాలికంగా రుచిని ఇచ్చే వాటిని కోరుకుంటున్నారు. ఇలాంటి వల్ల ఆరోగ్యంగా ఉండడం కంటే అనారోగ్య సమస్యలు తెచ్చుకోవడమే అవుతుంది. అంతేకాకుండా ప్రోటీన్లతో కూడిన ఆహారం రుచిగా ఉండకపోవచ్చు. కానీ శరీరానికి ప్రోటీన్ల అవసరం చాలా ఉంది. గుడ్లు, చికెన్, చేపలు, పనీర్, పప్పు ధాన్యాలు, శనగలు, బాదం పప్పులు, సోయా ఉత్పత్తులలో (టోఫు) ప్రొటీన్లు పుష్కలంగా లభిస్తాయి

అందువల్ల కేవలం రుచి కోసమే కాకుండా శరీరానికి సరైన ప్రోటీన్లు అందించే ఆహారాన్ని తీసుకోవాలి. అప్పుడే ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండగలుగుతారు. అలా ఆరోగ్యంగా ఉన్నప్పుడే సరైన ఆలోచనలు ఉంటాయి.. సరైన విధంగా పనిచేయగలుగుతారు. ఇలా దేశం మొత్తం ఆరోగ్యంగా ఉంటూ.. సరైన మార్గంలో నిలవడం వల్ల దేశం అభివృద్ధి చెందడం పెద్ద విషయం కాదు. దేశమంటే కేవలం నిర్మాణాలు బలంగా ఉండటమే కాదు.. ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉంటేనే అభివృద్ధి చెందినట్లు అని కొందరు ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అందువల్ల ఇప్పటినుంచి అయినా మనం ఎంతవరకు ప్రోటీన్ల ఆహారం తీసుకుంటున్నాం? ఎలాంటి ఆహారంలో ప్రోటీన్లు లభిస్తాయి అనే వాటిపై ప్రత్యేకంగా ఆలోచించాలి.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News

Most Popular

Oktelugu Epaper