ప్చ్.. ఏభై ఏళ్ల వ్యక్తితో ‘ఇలియానా’ ప్రేమ వ్యవహారాలు !

‘గోవా సుంద‌రి ఇలియానా’ను పుకార్ల రాయుళ్లు ఇప్పట్లో వదిలేలా లేరు. రీసెంట్ గా ఇలియానాకి కడుపు వచ్చిందని ఒక రూమర్ పుట్టించారు. పాపం, ఇలాంటి వార్తలు విని విని విసిగిపోయిన ఇలియానా అలాంటి వార్తలను పట్టించుకోవడం మానేసినా.. ఆమె అభిమానులను మాత్రం అవి తీవ్రంగా బాధిస్తున్నాయట, ఇల్లీ బేబీ పై తాజా పుకార్లలో భాగంగా బాలీవుడ్ మీడియా ఇలియానా త్వరలోనే పెళ్లి చేసుకోబోతుందనే రూమర్ ను పుట్టించింది. అయితే, ఈ రూమర్ కూడా ఇలియానా మేకప్ వేసుకోవడం […]

  • Written By: NARESH
  • Published On:
ప్చ్.. ఏభై ఏళ్ల వ్యక్తితో ‘ఇలియానా’ ప్రేమ వ్యవహారాలు !

Follow us on

Ileana
‘గోవా సుంద‌రి ఇలియానా’ను పుకార్ల రాయుళ్లు ఇప్పట్లో వదిలేలా లేరు. రీసెంట్ గా ఇలియానాకి కడుపు వచ్చిందని ఒక రూమర్ పుట్టించారు. పాపం, ఇలాంటి వార్తలు విని విని విసిగిపోయిన ఇలియానా అలాంటి వార్తలను పట్టించుకోవడం మానేసినా.. ఆమె అభిమానులను మాత్రం అవి తీవ్రంగా బాధిస్తున్నాయట, ఇల్లీ బేబీ పై తాజా పుకార్లలో భాగంగా బాలీవుడ్ మీడియా ఇలియానా త్వరలోనే పెళ్లి చేసుకోబోతుందనే రూమర్ ను పుట్టించింది. అయితే, ఈ రూమర్ కూడా ఇలియానా మేకప్ వేసుకోవడం మొదలుపెట్టినప్పటి నుండి వినిపిస్తునే ఉంది కదా అంటే.. నిజమే.

అయితే ఈసారి వచ్చిన రూమర్ లో కొత్త విషయం ఏమిటంటే.. ఇలియానా పెళ్లి చేసుకోబోయేది ఏభై ఏళ్ల వ్యక్తిని అట. గోవాలో హోటల్ బిజినెస్ చేసే ప్రముఖ బిజినెస్ మెన్ తో ఇలియానా ప్రేమలో ఉందని, ఆ ప్రేమే మొత్తానికి పెళ్లికి దారి తీసిందని, త్వరలోనే వీరి పెళ్లి జరగనుందని ఆ వార్తల పుకారు. తనకంటే వయసులో ఇరవై ఏళ్ళు పెద్దవాడితో ప్రేమ ఏమిటి ? పైగా అతగాడితో పెళ్లికి రెడీ అవ్వడం ఏమిటి ? మరి ఈ వార్తలో ఏ మాత్రం నిజం ఉన్నా.. ఇలియానా అభిమానులు కుమిలిపోతారు.

నిజానికి ఇలియానా ప్రేమ కోసం, ఆమెను పెళ్లి చేసుకోవడం కోసం మంచి పొజిషన్ లో ఉన్న చాలామంది కుర్రాళ్ళు రెడీగా ఉన్నారు. మరి ఇలియానాకి ఏభై ఏళ్ల పెద్దాయనలోనే ఏమి నచ్చిందో. నిజానికి ఎప్పుడో నాలుగేళ్ళ క్రితమే ఈ గోవా బ్యూటీ తన ఫోటోగ్రాఫర్ ప్రియుడితో పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇలియానా – ఆండ్రూల పెళ్లికి ఇరు కుటుంబాల వారు కూడా సుముఖ‌త‌ వ్య‌క్తం చేసి పెళ్లికి కూడా ఏర్పాట్లు చేసినట్టు టాక్. పైగా ఆండ్రూతో ఇలియానా చాలా ఘాటుగానే ప్రేమ వ్యవహారాన్ని నడిపింది.

కానీ ఆ తరువాత వీరిద్దరి మధ్య జరిగిన ఓ గొడవ కారణంగా ఏర్పడిన ఇగో కారణంగా మొత్తానికి బ్రేకప్ చెప్పుకొని విడిపోయారు. తనకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిన ప్రియుడు ఒక్కసారిగా దూరం అయిపోయే సరికి ఇలియానా పూర్తిగా డిప్రెషన్ కి లోనైంది. అతన్ని మర్చిపోవడానికి మళ్ళీ సినిమాల్లోకి కూడా ఎంట్రీ ఇచ్చింది. అలాగే ఛాన్స్ ల కోసం డైరెక్టర్ల చుట్టూ తిరిగింది. ఈ క్రమంలో కొన్ని సినిమాలు చేసింది. కానీ ఈ సీనియర్ బ్యూటీకి ఒక్క హిట్ కూడా రాలేదు. దాంతో అవకాశాలు కూడా తగ్గాయి. ఈ మధ్యలో ఏభై ఏళ్ల ఆ బిజినెస్ మెన్ తో బంధం ఏర్పడింది.

Read Today's Latest Tollywood News, Telugu News LIVE Updates on Oktelugu

సంబంధిత వార్తలు