Hi Nanna: నాని ఏడిస్తే.. సినిమా పక్కా హిట్? హాయ్ నాన్న సినిమా సక్సెస్ అవుతుందా?

సినిమా పక్కా హిట్ అంటూ మాట్లాడుకుంటున్నారు నెటిజన్లు. అందరికీ ఈ సినిమాలో ఉన్న ఎమోషనల్ సీన్స్ వల్లే కాన్ఫిడెన్స్ వచ్చిందని తెలుస్తోంది. ఇందులో ఎమోషనల్ సన్నివేశాలు ఎక్కువగా ఉన్నాయని.. దీంతోనే నాని కాన్ఫిడెంట్ గా చెప్పాడని టాక్.

  • Written By: Suresh
  • Published On:
Hi Nanna: నాని ఏడిస్తే.. సినిమా పక్కా హిట్? హాయ్ నాన్న సినిమా సక్సెస్ అవుతుందా?

Follow us on

Hi Nanna: హీరో నాని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈయన నటించే సినిమాలు ఈ మధ్య సూపర్ సక్సెస్ ను అందుకుంటున్నాయి. రీసెంట్ గా వచ్చిన దసరా సినిమా ఏ రేంజ్ లో హిట్ ను సొంతం చేసుకుందో తెలిసిందే. ప్రస్తుతం హాయ్ నాన్న సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధం అవుతున్నాడు నాని. ఈ సినిమా గురించి ఆయన అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సినిమా విడుదల అవకముందే మా నాని సినిమా పక్కా సూపర్ హిట్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరి దానికి కూడా ఓ కారణం ఉంది. ఇంతకీ ఏంటి అనుకుంటున్నారా?

ఈ సినిమా కచ్చితంగా ప్రేక్షకులను అలరిస్తుందని ప్రామిస్ చేసి మరీ చెప్పారు నాచురల్ స్టార్ నాని. ఈ మధ్య కాలంలో ఇంత కాన్ఫిడెన్స్ గా ఎప్పుడు కనిపించలేదని.. దీంతో సినిమా పక్కా హిట్ అంటూ మాట్లాడుకుంటున్నారు నెటిజన్లు. అందరికీ ఈ సినిమాలో ఉన్న ఎమోషనల్ సీన్స్ వల్లే కాన్ఫిడెన్స్ వచ్చిందని తెలుస్తోంది. ఇందులో ఎమోషనల్ సన్నివేశాలు ఎక్కువగా ఉన్నాయని.. దీంతోనే నాని కాన్ఫిడెంట్ గా చెప్పాడని టాక్. అయితే ట్రైలర్ లో కూడా ఇదే నిజం అన్నట్టుగా కనిపిస్తోంది. ట్రైలర్ చూసిన ప్రేక్షకులకు కన్నీళ్లు వస్తుంటాయి.

గతంలో నాని కన్నీళ్లు పెట్టుకొని, ఎమోషనల్ అయిన సినిమాలు హిట్ ను అందుకున్నాయి. ఇక ఈ సినిమాలో కూడా నాని ఎమోషనల్ అయ్యారు. అందుకే ఈ సినిమా కూడా హిట్ అంటూ కామెంట్లు వస్తున్నాయి. సెంటిమెంట్ వర్కౌట్ అయితే నానికి హాయ్ నాన్న మరో బిగ్ కమర్షియల్ మూవీగా నిలవడం పక్కా. కేవలం తెలుగులో మాత్రమే కాకుండా అన్ని భాషల్లో కూడా పాన్ ఇండియా రేంజ్ లో విడుదల అవబోతున్న నేపథ్యంలో ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో కీలకపాత్రలో శృతి హాసన్ కూడా కనిపించబోతుంది. ఇక ఈ సినిమా డిసెంబర్ 7న ప్రేక్షకుల ముందకు రావడానికి సిద్ధమవుతుంది.

Read Today's Latest Tollywood News, Telugu News LIVE Updates on Oktelugu

సంబంధిత వార్తలు