Hyundai Cars : ఈ కార్లపై భారీ డిస్కౌంట్లు.. లక్షల వరకు క్యాష్ డిస్కౌంట్..

హ్యుందాయ్ ఆరా సీఎన్ జీ మోడల్ విషయానికొస్తే రూ.33 వేల వరకు డిస్కంట్, రూ.20 వేల వరకు క్యాష్ డిస్కౌంట్, రూ. 10 వేల పాటు ఎక్చ్సేంజ్ బోనస్ ను అందిస్తున్నారు.

  • Written By: NARESH
  • Published On:
Hyundai Cars : ఈ కార్లపై భారీ డిస్కౌంట్లు.. లక్షల వరకు క్యాష్ డిస్కౌంట్..

Follow us on

Hyundai Cars : ఏదైనా వస్తువు కొనుగోలు చేయాలనుకుంటే డిస్కౌంట్ల కోసం ఎదురుచూస్తాం. దీంతో పండుగల సమయంలో వాటిని కొనుగోలు చేయాలని అనుకుంటాం. కానీ కొన్ని కంపెనీలు సేల్స్ పెంచుకోవడానికి సాధారణ రోజుల్లోనూ డిస్కౌంట్లను ప్రకటిస్తూ ఉంటాయి. తాజాగా హ్యుందాయ్ కంపెనీకి చెందిన కొన్ని కార్లను భారీ డిస్కౌంట్లతో అందిస్తున్నారు. డిసెంబర్ నెల చివరి వరకు గడవును విధించి వీటిని విక్రయిస్తున్నారు. కొన్ని మోడళ్లు కొనుగోలు చేస్తే వినియోగదారులు రూ.3 లక్షల వరకు సేవ్ చేసుకోవచ్చని అంటున్నారు. మరి ఆ కార్ల గురించి తెలుసుకునేందుకు వివరాల్లోకి వెళ్లండి…

ఆటో మోబైల్ రంగంలో హ్యుందాయ్ కంపెనీ తనకంటూ ప్రత్యేకతను చాటుకుంది. మిగతా వాటితో పోటీపడుతూ సేల్స్ ను పెంచుకుంటోంది. డిసెంబర్ నెల చివరి వరకు టార్గెట్ పెట్టుకొని కొన్ని కార్లపై భారీ డిస్కౌంట్ ఆఫర్ల ను ప్రకటించింది. ఈ ఆఫర్లు ఆయా ప్రాంతాలను భట్టి మారుతూ ఉంటాయి. కొత్త కారు కొనాలనుకునేవారికి ఇది మంచి అవకాశం అని కంపెనీ ప్రతినిధులు అంటున్నారు. హ్యాుందాయ్ కంపెనీకి చెందిన గ్రాండ్ ఐ10 నియోస్ కారుపై రూ.48 వేల వరకు తగ్గింపు చేసుకునే అవకాశం ఉంది. దీనిపై క్యాష్ డిస్కౌంట్ రూ.35 వేలు, ఎక్చైంజ్ బోనస్ రూ.10 వేల వరకు ఉంది.

హ్యుందాయ్ ఆరా సీఎన్ జీ మోడల్ విషయానికొస్తే రూ.33 వేల వరకు డిస్కంట్, రూ.20 వేల వరకు క్యాష్ డిస్కౌంట్, రూ. 10 వేల పాటు ఎక్చ్సేంజ్ బోనస్ ను అందిస్తున్నారు. అలాగే కార్పొరేట్ డిస్కౌంట్ కింద రూ.10 వేల డిస్కౌంట్ ఇస్తున్నారు. ఇందులోని ఐ 20 మోడల్ పై రూ.40 వేల వరకు తగ్గింపును అందిస్తున్నారు. అలాగే ఎక్చేంజ్ బోనస్ రూ.10 వేలు, రూ.30 వేల వరకు క్యాష్ డిస్కౌంట్ అందిస్తున్నారు. వెర్నా మోడల్ కారుపై రూ.45 వేల వరు తగ్గింపు ఉంటుంది. అయితే ఈ డిస్కౌంట్లు డిసెంబర్ నెలలోపే ఉంటాయని అంటున్నారు.

Read Today's Latest Business News, Telugu News LIVE Updates on Oktelugu

సంబంధిత వార్తలు