Harish Shankar: బంపర్ ఆఫర్ కొట్టేసిన హరీష్ శంకర్…డైరెక్ట్ గా ఆ స్టార్ హీరోతోనే సినిమా చేస్తున్నాడుగా..?

హరీష్ శంకర్ ఏం చేయాలో అర్థం కాక ఈ ఆరు నెలల గ్యాప్ లో ఏదైనా సినిమా చేయాలని అనుకున్నాడు. అందులో భాగంగానే రవితేజకు ఒక కథ చెప్పి ఒప్పించినట్లుగా తెలుస్తుంది.

  • Written By: Gopi
  • Published On:
Harish Shankar: బంపర్ ఆఫర్ కొట్టేసిన హరీష్ శంకర్…డైరెక్ట్ గా ఆ స్టార్ హీరోతోనే సినిమా చేస్తున్నాడుగా..?

Follow us on

Harish Shankar: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది డైరెక్టర్లలో కమర్షియల్ డైరెక్టర్ గా మంచి గుర్తింపు పొందిన వాళ్లలో హరీష్ శంకర్ ఒకరు…ఒక సినిమాని ఏ విధంగా తీస్తే ఆ సినిమా జనాలకు నచ్చుతుంది, కమర్షియల్ గా వర్క్ అవుట్ అవుతుంది అనేది ఈయనకు తెలిసినంత బాగా మరే డైరెక్టర్ కి తెలియదనే చెప్పాలి.

ఇక ఇలాంటి క్రమంలోనే ఈయన పవన్ కళ్యాణ్ తో గబ్బర్ సింగ్ అనే సినిమా చేసి ఇండస్ట్రీ ని షేక్ చేశారనే చెప్పాలి.ఇక ఆ తర్వాత వీళ్ళిద్దరి కాంబినేషన్ కోసం పవన్ కళ్యాణ్ అభిమానులు విపరీతంగా ఎదురు చూశారు అందులో భాగంగానే వీళ్ళిద్దరి కాంబినేషన్ సెట్ అయింది. ఇక వీళ్ళ కాంబో లో వస్తున్న సినిమానే ఉస్తాద్ భగత్ సింగ్ నిజానికి ఈ సినిమా ఎప్పుడో స్టార్ట్ అయింది. ఇప్పటికీ ఎప్పుడో ఈ సినిమా రిలీజ్ కావాలి కానీ పవన్ కళ్యాణ్ పాలిటిక్స్ లో బిజీ గా ఉండటం వల్ల లేట్ అవుతూ వస్తుంది. ఇక ఇప్పుడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో ఎలక్షన్స్ ఉండటం వల్ల పవన్ కళ్యాణ్ చాలా బిజీగా ఉంటున్నారు. అందువల్లే ఈ సినిమా షూటింగ్ ని తాత్కాలికంగా నిలిపివేశారు.

దాంతో హరీష్ శంకర్ ఏం చేయాలో అర్థం కాక ఈ ఆరు నెలల గ్యాప్ లో ఏదైనా సినిమా చేయాలని అనుకున్నాడు. అందులో భాగంగానే రవితేజకు ఒక కథ చెప్పి ఒప్పించినట్లుగా తెలుస్తుంది.ఇక ఇప్పుడు రవితేజ కూడా ఖాళీగా లేకపోవడంతో ఏం చేయాలో తెలియని అయోమయ పరిస్థితి లో హరీష్ ఉన్నాడు. అయితే రీసెంట్ గా తెలుస్తున్న విషయం ఏంటంటే రవితేజ, గోపీచంద్ మలినేని కాంబోలో వస్తున్న సినిమా బడ్జెట్ పెరిగి పోవడంతో మైత్రి మూవీ మేకర్స్ వారు ప్రస్తుతానికి ఆ సినిమాని హోల్డ్ లో పెట్టినట్టుగా తెలుస్తుంది.

ఇక దీంతో హరీష్ శంకర్ సినిమాకి రూట్ క్లియర్ అయిందనే వార్తలైతే వస్తున్నాయి. ఇక ప్రస్తుతం హరీష్ శంకర్ రవితేజ తో సినిమా చేసే ప్లాన్ లోనే బిజీగా తిరుగుతున్నాడు.రవితేజ గోపిచంద్ మలినేని సినిమాకి కొంచం గ్యాప్ వచ్చినట్టు అయితే ఈ గ్యాప్ లో హరీష్ శంకర్ తన సినిమా కొట్టేసి రిలీజ్ చేయాలనే ఉద్దేశ్యం లో ఉన్నాడు. ఎందుకంటే హరీష్ శంకర్ నుంచి సినిమా వచ్చి దాదాపు 5 సంవత్సరాలు కావస్తుంది. 2019లో వచ్చిన గద్దలకొండ గణేష్ సినిమానే అతనికి లాస్ట్ సినిమా అప్పటినుంచి ఇప్పటివరకు ఒక్క సినిమా కూడా రిలీజ్ చేయలేదు.

తనతో పాటు డైరెక్షన్ చేసిన ప్రతి ఒక్కరు ఇప్పటికి రెండు, మూడు సినిమాలు చేస్తూ బిజీగా గడుపుతుంటే తను మాత్రం ఖాళీ గా కూర్చొని ఉన్నాడు. అందువల్ల ఇప్పుడు రవితేజ సినిమా చేసి మంచి హిట్ కొట్టాలని అనుకుంటున్నట్టు గా తెలుస్తుంది.మరి ఈ సినిమా స్టార్ట్ అవుతుందా లేదా అనేది తెలియాల్సి ఉంది…

Read Today's Latest Tollywood News, Telugu News LIVE Updates on Oktelugu

సంబంధిత వార్తలు