Homeఎంటర్టైన్మెంట్Yash mother Pushpa: 'టాక్సిక్' ట్రోల్స్ పై హీరో యాష్ తల్లి ఆవేదన.. నిర్మాత అల్లు...

Yash mother Pushpa: ‘టాక్సిక్’ ట్రోల్స్ పై హీరో యాష్ తల్లి ఆవేదన.. నిర్మాత అల్లు అరవింద్ పై ఫైర్!

Yash mother Pushpa: కన్నడ సూపర్ స్టార్ యాష్ హీరో గా నటించిన లేటెస్ట్ భారీ బడ్జెట్ పాన్ ఇండియన్ చిత్రం ‘టాక్సిక్’ రీసెంట్ గానే భారీ అంచనాల నడుమ విడుదలై మొదటి ఆట నుండే ఘోరమైన డిజాస్టర్ టాక్ ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. అంతే కాకుండా ఈ షో పై సోషల్ మీడియా లో రోజురోజుకి ట్రోల్స్ భారీ రేంజ్ లో జరుగుతున్నాయి. ఈమధ్య కాలం లో ఒక పెద్ద సినిమాకు ఈ […]

Yash mother Pushpa: కన్నడ సూపర్ స్టార్ యాష్ హీరో గా నటించిన లేటెస్ట్ భారీ బడ్జెట్ పాన్ ఇండియన్ చిత్రం ‘టాక్సిక్’ రీసెంట్ గానే భారీ అంచనాల నడుమ విడుదలై మొదటి ఆట నుండే ఘోరమైన డిజాస్టర్ టాక్ ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. అంతే కాకుండా ఈ షో పై సోషల్ మీడియా లో రోజురోజుకి ట్రోల్స్ భారీ రేంజ్ లో జరుగుతున్నాయి. ఈమధ్య కాలం లో ఒక పెద్ద సినిమాకు ఈ రేంజ్ ట్రోల్స్ రావడం ఎప్పుడూ చూడలేదని విశ్లేషకులు సైతం ఆశ్చర్యపోతూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే సోషల్ మీడియా లో వస్తున్నటువంటి ఈ ట్రోల్స్ పై యాష్ తల్లి పుష్ప చాలా తీవ్రంగా స్పందించారు. ముఖ్యంగా మన టాలీవుడ్ ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ని ఉద్దేశించి పరోక్షంగా ఈమె చేసిన కామెంట్స్ ఇప్పుడు ఇండస్ట్రీ లో హాట్ టాపిక్ గా మారింది.

ఆమె మాట్లాడుతూ ‘నా కొడుకు ఎదుగుదల ని చూసి కొంతమంది ఓర్వలేకపోతున్నారు. కావాలని ఉద్దేశపూర్వకంగానే ఈ సినిమాపై నెగిటివిటీ వ్యాప్తి చేసున్నారు. దీనిపై ప్రశ్నించడం ఒక తల్లిగా నా భాద్యత, అందుకే ఈ ప్రెస్ మీట్ ని ఏర్పాటు చేశాను. యాష్ ఎదుగుదల ని అడ్డుకోవడానికి కొందరు కుట్రలు చేస్తున్నారు, ఈ కుట్రలకు ఏ మాత్రం భయపడము. యాష్ ఎక్కడి నుండి వచ్చాడని?, కేజీఎఫ్ కి ముందు అతను ఎవరని కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. వాళ్లకు నేను ఒక్కటే చెప్తున్నాను. నా కొడుకుని ఎందుకు మీరిలా టార్గెట్ చేసి వేధిస్తున్నారు?.. కర్ణాటక లోని ఒక సాధారణ మధ్య తరగతి కుటుంబం లో పుట్టి, నేడు ఈ స్థాయికి ఎదిగాడు. కేజీఎఫ్ కి ముందే అతనికి ఎన్నో సంచలనాత్మక బ్లాక్ బస్టర్స్ ఉన్నాయి. అది కర్ణాటక లో ఉండే ప్రతీ ఒక్కరికి తెలుసు’ అంటూ చెప్పుకొచ్చింది.

ఇంకా ఆమె మాట్లాడుతూ ‘కేజీఎఫ్ కి ముందు యాష్ ఎవరు అని అంటున్న వాళ్లకు కాస్త సిగ్గుండాలి. ఒక సామాన్యుడు ఇండస్ట్రీ లో ఎదగడం వీళ్లకు ఇష్టం లేదా?, యాష్ సినిమా వస్తుందంటే ఎందుకు ఇంతలా భయపడుతున్నారు?’ అంటూ యాష్ తల్లి పుష్ప ఆవేదన వ్యక్తం చేస్తూ ఏర్పాటు చేసిన ఈ ప్రెస్ మీట్ ఇప్పుడు సంచలనం గా మారింది. ఎంతమంది నా కొడుకుని తొక్కే ప్రయత్నం చేసినా , వాడి వెనుక కోట్లాది మంది అభిమానుల ఆశీర్వాదం ఉందని, అది ఉన్నంత వరకు అతని ఎదుగుదల ని అడ్డుకోవడం ఎవరి తరం కాదంటూ ఈ సందర్భంగా చెప్పుకొచ్చింది పుష్ప. ప్రత్యక్షంగా అల్లు అరవింద్ పేరు ని ఆమె ప్రస్తావించకపోయిన, ఆయన చేసిన కామెంట్స్ కి పరోక్షంగా ఇలా రెస్పాన్స్ ఇచ్చింది అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper