Homeక్రీడలుక్రికెట్‌Indian Cricket Team: టీమ్ ఇండియాకు గుడ్ న్యూస్.. స్టార్ ప్లేయర్లు వచ్చేస్తున్నారు

Indian Cricket Team: టీమ్ ఇండియాకు గుడ్ న్యూస్.. స్టార్ ప్లేయర్లు వచ్చేస్తున్నారు

Indian Cricket Team: వచ్చే ఏడాది వన్డే వరల్డ్ కప్ జరగనుంది. ఈ నేపథ్యంలో టీమిండియా స్టార్ ప్లేయర్లు గాయాల బారిన పడ్డారు. వారు ఇటీవల కొన్ని కీలకమైన టోర్నీలకు దూరమయ్యారు. ఆ ప్రభావం టీమిండియా మీద గట్టిగానే పడింది. ఇటీవల లంకతో జరిగిన రెండు టెస్టుల సిరీస్ లో రెండో మ్యాచ్ టీమ్ ఇండియా దాదాపు ఓడిపోయినంత పని అయింది. కీలకమైన ప్లేయర్లు లేకపోవడంతో భారత జట్టుకు ఇబ్బంది తప్పలేదు. ఆ మ్యాచ్ డ్రా అయినప్పటికీ.. […]

Indian Cricket Team: వచ్చే ఏడాది వన్డే వరల్డ్ కప్ జరగనుంది. ఈ నేపథ్యంలో టీమిండియా స్టార్ ప్లేయర్లు గాయాల బారిన పడ్డారు. వారు ఇటీవల కొన్ని కీలకమైన టోర్నీలకు దూరమయ్యారు. ఆ ప్రభావం టీమిండియా మీద గట్టిగానే పడింది. ఇటీవల లంకతో జరిగిన రెండు టెస్టుల సిరీస్ లో రెండో మ్యాచ్ టీమ్ ఇండియా దాదాపు ఓడిపోయినంత పని అయింది. కీలకమైన ప్లేయర్లు లేకపోవడంతో భారత జట్టుకు ఇబ్బంది తప్పలేదు. ఆ మ్యాచ్ డ్రా అయినప్పటికీ.. ఒక రకంగా టీమ్ ఇండియాకు ఓటమి లాంటిది.

తదుపరి టీమిండియా ఆఫ్ఘనిస్తాన్ జట్టుతో సెప్టెంబర్ 13 నుంచి 3 t20 మ్యాచ్ ల సిరీస్ ఆడనుంది. టీమ్ ఇండియాకు ఎంతో ముఖ్యమైన సిరీస్ ఇది. ఈ సిరీస్ లో సత్తా చూపించాలని టీమిండియా భావిస్తోంది. టీమిండియా ఇటీవల టీ20 వరల్డ్ కప్ గెలిచినప్పటికీ.. కొన్ని కీలకమైన సిరీస్లలో అంత గొప్పగా ఆడలేకపోయింది. దీంతో ఆఫ్గనిస్తాన్ సిరీస్ టీమ్ ఇండియాకు అత్యంత ముఖ్యంగా మారింది. ఈ నేపథ్యంలో టీమిండియాలోకి కీలకమైన ప్లేయర్లు వచ్చేశారు. ఇది ఒక రకంగా టీమ్ ఇండియాకు శుభవార్త లాంటిది.

స్టార్ ప్లేయర్లు బుమ్రా, హార్దిక్ పాండ్యా, వాషింగ్టన్ సుందర్, నితీష్ కుమార్ రెడ్డి కొద్దిరోజులుగా బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీలో శిక్షణ పొందుతున్నారు. కొద్దిరోజులుగా వారు బెంగళూరులోనే ఉంటున్నారు. అయితే ఇటీవల మేనేజ్మెంట్ నిర్వహించిన పరీక్షలలో వీరు నూటికి నూరు శాతం సామర్థ్యాన్ని సాధించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే వారిని ఆఫ్ఘనిస్తాన్ సిరీస్ కు ఎంపిక చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఒకవేళ వారిని గనుక ఎంపిక చేస్తే టీమిండియా కు ఇది శుభవార్త. ఎందుకంటే 2027లో జరిగే వన్డే వరల్డ్ కప్ లో ఈ ముగ్గురు ఆటగాళ్లు టీమ్ ఇండియాకు అత్యంత కీలకం కాబోతున్నారు. బుమ్రా భారత బౌలింగ్ దళాన్ని ముందుండి నడిపించబోతున్నాడు. పైగా ఇటీవల అతడు లేని లోటు శ్రీలంక సీరీస్ లో స్పష్టంగా కనిపించింది. అందువల్లే అతడు భారత జట్టులో ఉండాల్సిన అవసరం ఉంది.

ఆఫ్గనిస్తాన్ సిరీస్ తర్వాత టీమిండియా న్యూజిలాండ్ జట్టుతో టెస్ట్ సిరీస్ ఆడబోతోంది. టీమిండియా కు ఈ సిరీస్ అత్యంత ముఖ్యమైనది. టీమిండియా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ ఫైనల్స్ లోకి వెళ్ళాలి అంటే కచ్చితంగా ఈ సిరీస్ గెలవాలి. గతంలో భారతదేశంలో న్యూజిలాండ్ పర్యటించినప్పుడు టెస్టు సిరీస్ ను వైట్ వాష్ చేసింది. దానికి కచ్చితంగా టీమిండియా ప్రతీకారం తీర్చుకోవాల్సిన అవసరం ఉంది. టీమిండియా ఆ స్థాయిలో ఆడాలి అంటే కచ్చితంగా జట్టులో బుమ్రా.. నితీష్ కుమార్ రెడ్డి లాంటివారు ఉండాల్సిందే.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper