Toxic Movie: కన్నడ సూపర్ స్టార్ యాష్ హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘టాక్సిక్’ రీసెంట్ గానే భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకొచ్చి, మొదటి ఆట నుండే ఘోరమైన డిజాస్టర్ టాక్ ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే యాష్ కి యూత్ లో ఉన్న క్రేజ్ తో పాటుగా, ఈ సినిమాపై మొదటి నుండి అన్ని భాషల్లోనూ అంచనాలు భారీగా ఉండడం తో, ఓపెనింగ్స్ అదిరిపోయాయి. ట్రేడ్ పండితులు అందిస్తున్న లెక్కల ప్రకారం చూస్తే , ఈ చిత్రానికి నాల్గవ రోజున కూడా ప్రపంచవ్యాప్తంగా 33 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి అట. థియేటర్ వైపు కన్నెత్తి కూడా చూడకండి అనే రేంజ్ పబ్లిక్ టాక్ తోనే ఈ రేంజ్ గ్రాస్ వసూళ్లను రాబడుతుందంటే, కేజీఎఫ్ రేంజ్ టాక్ వస్తే వసూళ్లు ఏ రేంజ్ లో ఉండేవో మీరే ఊహించుకోండి.
ముందుగా తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే, ఈ సినిమా తెలుగు వెర్షన్ రైట్స్ ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు 110 కోట్ల రూపాయలకు కొనుగోలు చేయగా, మొదటి మూడు రోజులకు కలిపి 17 కోట్ల 30 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు , 30 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. మొదటి రోజు ఈ చిత్రానికి తెలుగు రాష్ట్రాల నుండి ఏకంగా 12 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. కానీ నాల్గవ రోజున ఈ చిత్రానికి కేవలం 1 కోటి 10 లక్షల రూపాయిల షేర్ మాత్రమే వచ్చింది. దీన్ని బట్టీ మన తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా ఏ రేంజ్ డిజాస్టర్ అనేది అర్థం చేసుకోవచ్చు. ఇక కర్ణాటక రాష్ట్రం విషయానికి వస్తే, అక్కడ ఈ చిత్రానికి 4 రోజుల్లో 56 కోట్ల 30 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి.
అదే విధంగా తమిళనాడు రాష్ట్రం నుండి 10 కోట్ల 70 లక్షలు, కేరళ నుండి 3 కోట్ల 70 లక్షలు, హిందీ + రెస్ట్ ఆఫ్ ఇండియా నుండి 133 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఈ సినిమాకు ఆయువు పట్టులాగా నిల్చిన మార్కెట్ ఏదైనా ఉందా అంటే, అది నార్త్ ఇండియా మార్కెట్ అని చెప్పడం లో ఎలాంటి సందేహం లేదు. ఇక ఓవర్సీస్ లో అయితే అత్యంత దారుణమైన రెస్పాన్స్ ని సొంతం చేసుకుంది ఈ చిత్రం. 4 రోజుల్లో కేవలం 26 కోట్ల 65 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు మాత్రమే వచ్చాయట. ఓవరాల్ గా విడుదలకు ముందు 450 కోట్ల రూపాయిల ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఇప్పటి వరకు 260 కోట్ల గ్రాస్ వసూళ్లు, 122 కోట్ల షేర్ వసూళ్లు వచ్చాయి. బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకోవడానికి మరో 327 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టాలి, అది దాదాపుగా అసాధ్యమని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు