Toxic Movie Disaster: రెండు రోజుల క్రితం భారీ అంచనాల నడుమ విడుదలైన ‘టాక్సిక్’ చిత్రం కమర్షియల్ గా ఎంత పెద్ద డిజాస్టర్ ఫ్లాప్ గా నిల్చిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈమధ్య కాలం లో ఒక పాన్ ఇండియన్ సినిమాకు ఈ రేంజ్ డిజాస్టర్ టాక్ దేనికి రాలేదు అని చెప్పడం లో ఎలాంటి సందేహం లేదు. అయితే ఈ సినిమా తెలుగు వెర్షన్ థియేట్రికల్ రైట్స్ ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు 120 కోట్ల రూపాయిలకు కొనుగోలు చేసాడు. దిల్ రాజు ప్రతీ ఒక్కటి చాలా లెక్కలు వేసుకొని, సేఫ్ సైడ్ ఉండేలా బిజినెస్ చేస్తాడనే విషయం అందరికీ తెలిసిందే. చాలా తెలివైన నిర్మాత/డిస్ట్రిబ్యూటర్ అని అందరూ అంటుంటారు. అందుకు మరో ఉదాహరణగా నిల్చింది టాక్సిక్ చిత్రానికి ఆయన డీల్ చేసుకున్న విధానం.
పూర్తి వివరాల్లోకి వెళ్తే ఈ చిత్రానికి మొదటి రోజు తెలుగు రాష్ట్రాల నుండి 8 కోట్ల రూపాయిల వరకు షేర్ వసూళ్లు వచ్చాయి. కానీ 2 వ రోజున కనీసం కోటి రూపాయిల షేర్ కూడా రాలేదు. దీంతో దిల్ రాజు పని మటాష్ అని అనుకున్నారు అందరూ. కానీ ఆయన ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ ని కొనుగోలు చేసింది రీకవరీ బేసిస్ మీద. అంటే ఈ సినిమా ఆడకపోతే నిర్మాతలు 2 వారాల్లో డబ్బులు మొత్తం తిరిగి ఇచ్చేయాలి అనే విధంగా అగ్రిమెంట్ చేసుకున్నారు. ఈ చిత్రాన్ని KVN ప్రొడక్షన్స్ తో పాటు , యాష్ కూడా సహనిర్మాతగా వ్యవహరించాడు. అందుకే అగ్రిమెంట్ లో భాగంగా యాష్ కూడా ఒక సినిమా ఈ బ్యానర్ లో చేస్తానని విడుదలకు ముందు సంతకం చేశాడట. అందుకే దిల్ రాజు కి ఒక్క పైసా నష్టం కూడా రాలేదని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు.
మరోపక్క అదే యాష్ నిర్మాతగా వ్యవహరించిన హిందీ ‘రామాయణ్’ తెలుగు వర్షన్ రైట్స్ ని కూడా దిల్ రాజు నే కొనుగోలు చేశాడట. దాదాపుగా 100 కోట్ల రూపాయలకు ఆయన ఈ సినిమాని కొన్నట్టు వార్తలు వినిపించాయి. ఇందులో ఎంత వాస్తవం ఉందో తెలియదు కానీ, ‘టాక్సిక్’ మూవీ డబ్బులను తిరిగి ఇచ్చేందుకు బదులుగా ‘రామాయణ్’ తెలుగు వెర్షన్ రైట్స్ ని దిల్ రాజు కి ఉచితంగా యాష్ ఇచ్చి ఉంటాడని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. ఏది ఏమైనా దిల్ రాజు సమయస్ఫూర్తి, చాకచక్యం గురించి మెచ్చుకోవాల్సిందే. అందుకే ఇన్ని ఫ్లాప్స్ వచ్చినప్పటికీ కూడా ఇండస్ట్రీ లో స్థిరంగా నిలబడ్డాడు.