Kaala Bhairava: చాలా కాలం నుండి సోషల్ మీడియా లో కీరవాణి కొడుకు కాలభైరవ, ‘బలగం’ హీరోయిన్ కావ్య కళ్యాణ్ రామ్ ప్రేమలో ఉన్నారని, వీళ్లిద్దరు ప్రస్తుతం డేటింగ్ లో ఉన్నారని, సోషల్ మీడియా లో తెగ ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. అనేక సందర్భాల్లో వీళ్లిద్దరు కలిసి తిరగడం వంటివి చూసిన తర్వాత వీళ్ళ మధ్య నిజంగానే ఎదో జరుగుతుందని ఫిక్స్ అయిపోయారు నెటిజెన్స్. కానీ ఇన్ని రోజులు ఈ విషయాన్ని వీళ్లిద్దరు బహిరంగంగా ప్రకటించలేదు. అయితే నేడు వీళ్ళ బంధం బహిర్గతమైంది. స్వయంగా కాలభైరవ , కావ్య కళ్యాణ్ రామ్ లు ఈ విషయాన్ని ఇన్ స్టాగ్రామ్ ద్వారా వెల్లడించారు. అందులో భాగంగా వీళ్ళు అప్లోడ్ చేసిన కొన్ని ఫోటోలు చూసేందుకు చాలా క్యూట్ గా అనిపించాయి, అవి ఇప్పుడు బాగా వైరల్ అయ్యాయి.
ఈ సందర్భంగా కాలభైరవ మాట్లాడుతూ ‘నీతో సమయం గడపడం అంటే, కొండల ఒడ్డున కూర్చొని సెలయేటిని చూస్తున్నట్లుగా ఉంటుంది. నీతో మాట్లాడడం అంటే చలికాలపు పొద్దునే ఇష్టమైన కాఫీ తాగుతున్నట్టు ఉంటుంది. ఇప్పుడు మనమిద్దరం జీవితాంతం ఒకే ఇంట్లో ఉంటామనే విషయాన్ని ఇప్పుడు మన అభిమానులకు తెలియజేయడం చాలా సంతోషాన్ని ఇస్తుంది’ అంటూ చెప్పుకొచ్చాడు భైరవ. ఆయన మాట్లాడిన ఈ మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. ఇది చూసిన తర్వాత కాలభైరవ మంచి సింగర్, మ్యూజిక్ డైరెక్టర్ మాత్రమే కాదు, ఒక మంచి కవి కూడా అని సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అయితే వీళ్లిద్దరి మధ్య పరిచయం ఎలా ఏర్పడింది?, కలిసి ఒక్క సినిమా కోసం కూడా పని చేయలేదు కదా అనే సందేహం నెటిజెన్స్ లో ఏర్పడింది.
ఈమధ్య కాలం లో సినీ ఇండస్ట్రీ లో వివాహాలు మొత్తం ఇలాగే , మిస్టీరియస్ గా ఉన్నాయి. కలిసి పనిచేస్తే పరిచయం ఏర్పడుతుంది, తద్వారా ప్రేమ, పెళ్లి వరకు వెళ్తుంది. కానీ కలిసి పని చేయకపోయినప్పటికీ కూడా వీళ్ళ మధ్య ప్రేమ ఎలా పుట్టింది అనేది తెలియాలంటే , స్వయంగా వాళ్ళే తమ ప్రయాణం గురించి చెప్పాల్సి ఉంటుంది. ఇక కాలభైరవ కెరీర్ విషయానికి వస్తే, ఈయన ప్రస్తుతం టాలీవుడ్ లో టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్ లో ఒకరిగా కొనసాగుతున్నాడు. అదే విధంగా కావ్య కళ్యాణ్ రామ్ విషయానికి వస్తే, ఈమె బాలనటిగా అప్పట్లో తెలుగు ఆడియన్స్ ని ఒక రేంజ్ లో అలరించి , పెద్దయ్యాక హీరోయిన్ గా మారి అనేక సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది. మరి పెళ్లి తర్వాత ఆమె హీరోయిన్ గా కెరీర్ ని కొనసాగిస్తుందో లేదో చూడాలి.
View this post on Instagram