Toxic Movie: కన్నడ సూపర్ స్టార్ యాష్ హీరో గా నటించిన ‘టాక్సిక్’ చిత్రం విడుదలై అప్పుడే వారం రోజులు కావొస్తుంది. విడుదలకు ముందు ఈ చిత్రం జెన్ జీ ఆడియన్స్ లో క్రియేట్ చేసిన హైప్ సాధారణమైనది కాదు. ప్రమోషనల్ కంటెంట్ మొత్తం హాలీవుడ్ రేంజ్ లో ఉండడం తో, ఈ సినిమా కచ్చితంగా బాక్స్ ఆఫీస్ వద్ద వండర్స్ క్రియేట్ చేస్తుందని అంతా అనుకున్నారు. కానీ కట్ చేస్తే మొదటి రోజే ఈ చిత్రం థియేటర్స్ కి వచ్చిన ఆడియన్స్ కి చుక్కలు చూపించింది. ఇదేమి సినిమా బాబోయ్ అని థియేటర్స్ డోర్స్ తీసి పరుగులు పెట్టేలా చేసింది ఈ చిత్రం. అంతటి ఘోరమైన రెస్పాన్స్ ని సొంతం చేసుకున్నప్పటికీ కూడా హైప్ ఉండడం వల్ల , ఈ సినిమాకు మొదటి వీకెండ్ మంచి వసూళ్లు నమోదు అయ్యాయి.
ప్రాంతాల వారీగా చూస్తే కర్ణాటక రాష్ట్రం నుండి ఈ చిత్రానికి 64 కోట్ల 45 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చిందట. అక్కడి సూపర్ హిట్ సినిమాలకు కూడా ఈ రేంజ్ గ్రాస్ వసూళ్లు రావడం చాలా అరుదు. అలాంటిది ఈ రేంజ్ డిజాస్టర్ టాక్ తో కూడా అంత వసూళ్లు రాబట్టడం అనేది సాధారణమైన విషయం కాదు. హీరో యాష్ కి అక్కడ ఎలాంటి క్రేజ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. అదే విధంగా తెలుగు రాష్ట్రాల నుండి ఈ చిత్రానికి 32 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు రాగా, తమిళనాడు నుండి 11 కోట్ల 75 లక్షలు, కేరళ నుండి 4 కోట్లు, హిందీ + రెస్ట్ ఆఫ్ ఇండియా నుండి 149 కోట్లు , ఓవర్సీస్ నుండి 28 కోట్ల 75 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఓవరాల్ గా ఈ చిత్రానికి 290 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు, 135 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి.
బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకోవాలంటే ఈ చిత్రానికి ఇంకా 314 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు రావాలి. అది కలలో కూడా సాధ్యం అవ్వదు. ఇక నేడు వర్కింగ్ డే అవ్వడం తో , ఈ చిత్రానికి దాదాపుగా అన్ని ప్రాంతాల్లోనూ చుక్కలు కనిపించాయి. గుడ్డిలో మెల్ల అన్నట్టు, నార్త్ ఇండియా లో కాస్త బెటర్ పెర్ఫార్మన్స్ ని నేడు కూడా సొంతం చేసుకుంది ఈ చిత్రం. ఓవరాల్ గా 6 వ రోజున ఈ చిత్రానికి 12 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఫుల్ రన్ లో 350 నుండి 400 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను ఈ చిత్రం రాబట్టే అవకాశం ఉండొచ్చని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు.