Nayanathara: కన్నడ సూపర్ స్టార్ యాష్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియన్ చిత్రం ‘టాక్సిక్’ రీసెంట్ గానే భారీ అంచనాల నడుమ విడుదలై మొదటి ఆట నుండే ఘోరమైన డిజాస్టర్ టాక్ ని సొంతం చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే టాక్ తో సంబంధం లేకుండా మొదటి రోజు ఈ చిత్రానికి అద్భుతమైన ఓపెనింగ్ వసూళ్లు వచ్చాయి, రెండవ రోజు సౌత్ లో పెద్దగా వసూళ్లు రాకపోయినా, బాలీవుడ్ కారణంగా 50 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వచ్చినట్టు చెప్తున్నారు ట్రేడ్ విశ్లేషకులు. ఓవరాల్ గా ఈ చిత్రానికి రెండు రోజుల్లో 200 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. నేడు కూడా ఈ చిత్రానికి 40 కోట్ల గ్రాస్ వసూళ్లు వచ్చే అవకాశం ఉందని , ఫుల్ రన్ లో కచ్చితంగా 300 కోట్ల గ్రాస్ ని కొల్లగొట్టే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.
డిజాస్టర్ టాక్ వస్తేనే ఈ రేంజ్ వసూళ్లు వచ్చాయంటే, ఇక పాజిటివ్ టాక్ వచ్చి ఉండుంటే , ఏ రేంజ్ వసూళ్లు వచ్చి ఉండేవో మీరే ఊహించుకోండి. ఇకపోతే ఈ చిత్రం లో కియారా అద్వానీ, రుక్మిణి వాసంత్, తారా సుతారియా, హుమా ఖురేషి వంటి టాప్ హీరోయిన్స్ తో పాటు, నయనతార కూడా నటించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం లో ఆమె హీరో కి అక్కగా , మంచి పవర్ ఫుల్ క్యారెక్టర్ లో కనిపించింది. అయితే ఈ సినిమా ఫ్లాప్ పై ఆమె లేటెస్ట్ గా ఇన్ స్టాగ్రామ్ లో మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. ఆమె మాట్లాడుతూ ‘సినీ రంగం ఊహించని మలుపులతో కూడుకున్నది. ఏ సినిమాకు ఎలాంటి ఫలితం వస్తుందో ఎవ్వరూ ఊహించలేరు’ అంటూ చెప్పుకొచ్చింది.
ఇంకా ఆమె మాట్లాడుతూ ‘కొన్ని సినిమాలపై నేను ఎన్నో ఆశలు పెట్టుకున్నాను. కచ్చితంగా భారీ బ్లాక్ బస్టర్ అవుతుందనే నమ్మకం తో ఉండేదాన్ని. కానీ ఆ సినిమాలు పెద్ద డిజాస్టర్ ఫ్లాప్స్ గా నిలిచాయి. అదే విధంగా కొన్ని సినిమాలపై ఎలాంటి ఆశలు పెట్టుకోలేదు. అనూహ్యంగా అలాంటివే నాకు భారీ బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి. అయితే హిట్ వచ్చినా, ఫ్లాప్ వచ్చినా, సమానమైన భావం తోనే చూడడం నాకు తెలిసిన నీతి. ఇది నా కెరీర్ ప్రారంభం నుండే నేర్చుకున్నాను. అనుభవాలు చాలానే ఉన్నాయి’ అంటూ చెప్పుకొచ్చింది నయనతార. ఆమె నేరుగా టాక్సిక్ పేరుని ఇక్కడ ప్రస్తావించకపోయిన, సరిగ్గా టాక్సిక్ విడుదలైన కొత్తల్లోనే ఆమె ఇలా మాట్లాడడం చూస్తుంటే, టాక్సిక్ ని ఉద్దేశించే ఇలా మాట్లాడిందని అంటున్నారు నెటిజెన్స్.