Toxic Movie: కన్నడ హీరో యాష్ నటించిన లేటెస్ట్ భారీ బడ్జెట్ పాన్ ఇండియన్ చిత్రం ‘టాక్సిక్’ రీసెంట్ గానే భారీ అంచనాల నడుమ విడుదలై , మొదటి ఆట నుండే ఘోరమైన డిజాస్టర్ టాక్ ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. మొదటి రోజు ఓపెనింగ్ వసూళ్లు బాగానే వచ్చాయి కానీ, రెండవ రోజు నుండి మాత్రం టాక్ ప్రభావం చాలా గట్టిగా పడింది. ఉదాహరణకు కర్ణాటక నే తీసుకుందాం. మొదటి రోజు ఈ చిత్రానికి ఆ రాష్ట్రం నుండి దాదాపుగా 30 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. కానీ రెండవ రోజు మాత్రం కేవలం 10 కోట్ల రూపాయిల గ్రాస్ మాత్రమే వచ్చిందట. అంటే మూడు రేట్లు వసూళ్లు తగ్గిపోయాయి. ఇక మూడవ రోజు అయితే కేవలం 6 కోట్ల గ్రాస్ వసూళ్లు మాత్రమే వచ్చినట్టు సమాచారం. ఇక తెలుగు రాష్ట్రాల సంగతి సరేసరి. షేర్ వసూళ్ల సంగతి కాసేపు పక్కన పెడితే బయ్యర్స్ కి గ్రాస్ రావడమే ఎక్కువైంది.
అయితే ఈ చిత్రానికి నార్త్ ఇండియా బాక్స్ ఆఫీస్ శ్రీ రామ రక్షా లాగా నిలుస్తుందని చెప్పడం లో ఎలాంటి సందేహం లేదు. రెండవ రోజు మాత్రమే కాదు, మూడవ రోజు కూడా ఈ ప్రాంతం నుండి డీసెంట్ స్థాయి వసూళ్లు నమోదు అయ్యాయి. ఓవర్సీస్ లో కూడా ఉన్నంతలో పర్వాలేదు అని చెప్పొచ్చు. ఓవరాల్ గా ఈ రెండు ప్రాంతాల కారణంగా మూడవ రోజు కూడా ఈ చిత్రానికి 38 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయి. కానీ ఎంత వసూళ్లు వచ్చిన రేపటి వరకే, ఆ తర్వాత ఈ చిత్రానికి వసూళ్లు రావడం కష్టమే. సోమవారం నుండి అనేక ప్రాంతాల్లో ఈ చిత్రాన్ని తొలగిస్తున్నారట. సినిమా పెద్ద ఫ్లాప్ అయ్యింది కాబట్టి, ఓటీటీ లోకి కూడా అనుకున్న దానికంటే ముందుగానే స్ట్రీమింగ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.
పూర్తి వివరాల్లోకి వెళ్తే ఈ సినిమాకు సంబంధించిన డిజిటల్ రైట్స్ ని ‘జీ 5’ సంస్థ మంచి ఫ్యాన్సీ రేట్ కి కొనుగోలు చేసింది. ముందుగా అనుకున్న ఒప్పందం ప్రకారం అయితే, ఈ చిత్రాన్ని 4 వారాల నుండి 8 వారాల మధ్యలో విడుదల చెయ్యాలి. కానీ ఇప్పుడు ఈ సినిమా పెద్ద ఫ్లాప్ అయ్యింది కాబట్టి, 4 వారాలు పూర్తి అయ్యాక విడుదల చెయ్యాలని ఆలోచిస్తున్నారు అట మేకర్స్. అంటే సెప్టెంబర్ 3 వ వారం లో ఈ చిత్రాన్ని ‘జీ 5’ లో చూడొచ్చు అన్నమాట. తెలుగు, తమిళం , మలయాళం , కన్నడ భాషల్లో 4 వారాల్లోనే ఎంట్రీ ఇవ్వొచ్చు కానీ, హిందీ వెర్షన్ ని మాత్రం కచ్చితంగా 8 వారాల తర్వాతనే విడుదల చేయాల్సి ఉంటుంది.