Homeఎంటర్టైన్మెంట్Varanasi: 'వారణాసి' లో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్.. ఎలాంటి పాత్రలో కనిపించబోతున్నాడంటే..

Varanasi: ‘వారణాసి’ లో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్.. ఎలాంటి పాత్రలో కనిపించబోతున్నాడంటే..

Varanasi: సూపర్ స్టార్ మహేష్ బాబు , రాజమౌళి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘వారణాసి’ చిత్రం పై అభిమానుల్లో , ప్రేక్షకుల్లో అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఎప్పుడెప్పుడు ఈ సినిమా విడుదల అవుతుందా అని ఆతృతగా ఎదురు చూస్తున్నారు అభిమానులు, ప్రేక్షకులు. రీసెంట్ గానే మహేష్ బాబు పుట్టిన రోజు వచ్చింది, అభిమానులు ఈ సినిమా నుండి ఏదైనా భారీ అప్డేట్ వస్తుందేమో అని ఆశపడ్డారు. కానీ చివరికి షూటింగ్ […]

Varanasi: సూపర్ స్టార్ మహేష్ బాబు , రాజమౌళి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘వారణాసి’ చిత్రం పై అభిమానుల్లో , ప్రేక్షకుల్లో అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఎప్పుడెప్పుడు ఈ సినిమా విడుదల అవుతుందా అని ఆతృతగా ఎదురు చూస్తున్నారు అభిమానులు, ప్రేక్షకులు. రీసెంట్ గానే మహేష్ బాబు పుట్టిన రోజు వచ్చింది, అభిమానులు ఈ సినిమా నుండి ఏదైనా భారీ అప్డేట్ వస్తుందేమో అని ఆశపడ్డారు. కానీ చివరికి షూటింగ్ మేకింగ్ ఫోటోలు కొన్ని వదిలారు. దీనిపై అభిమానులు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు . కనీసం మహేష్ బాబు శ్రీరాముడి గెటప్ లో ఉన్న ఫస్ట్ లుక్ పోస్టర్ అని అయినా విడుదల చేస్తారని ఆశించారు , అది కూడా జరగలేదు. ఇదంతా పక్కన పెడితే, ఈ సినిమా గురించి సోషల్ మీడియా లో జరుగుతున్న ఒక ప్రచారం హాట్ టాపిక్ గా మారింది.

ఈ చిత్రం లో ‘రామాయణం’ బ్యాక్ డ్రాప్ లో వచ్చే సీక్వెన్స్ దాదాపుగా 20 నిమిషాల వరకు ఉంటుంది అనే విషయం అందరికీ తెలిసిందే. ఈ సీక్వెన్స్ లో శ్రీరాముడు , లక్ష్మణుడు , కుంభకర్ణుడు , హనుమంతుడు ఉంటారు. శ్రీరాముడి క్యారెక్టర్ మహేష్ బాబు చేస్తున్నాడు అనేది పాత విషయమే , కానీ హనుమంతుడి క్యారెక్టర్ కోసం రాజమౌళి ఏకంగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ని సంప్రదించినట్టు టాక్ వినిపిస్తోంది. అంతే కాదు , రామ్ చరణ్ కి హనుమాన్ లుక్ తో ఫోటో షూట్ జరిపి , ఆయనపై 5 నిమిషాల నిడివి ఉన్న సన్నివేశాన్ని చాలా రహస్యంగా చిత్రీకరించారట. ఈ విషయాన్ని రాజమౌళి చాలా గోప్యంగా ఉంచే ప్రయత్నం చేసినట్టు ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న టాక్. ఇదే కనుక నిజమైతే , ‘వారణాసి’ రేంజ్ ఇంకా పెద్దది అయ్యే అవకాశాలు ఉన్నాయి.

రామ్ చరణ్ , మహేష్ బాబు వంటి బిగ్గెస్ట్ సూపర్ స్టార్స్ ని , కోట్లాది మంది భక్తులు కొలిచే దేవుళ్ళ పాత్రల్లో కనిపిస్తే వెండితెర పై చూసేందుకు రెండు కళ్ళు సరిపోవు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇకపోతే ఈ చిత్రం షూటింగ్ ఇప్పటికే 80 శాతం కి పైగా పూర్తి అయ్యింది. వచ్చే నెల చివరి లోపు కానీ , అక్టోబర్ నెలాఖరు లోపు కానీ ఈ సినిమా షూటింగ్ ప్యాచ్ వర్క్ తో సహా పూర్తి చేసే ప్లాన్ లో ఉన్నాడు రాజమౌళి. ముందు చెప్పినట్టుగానే ఏప్రిల్ 7,2027 న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి లైన్ క్లియర్ చేస్తున్నట్టు టాక్.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper