Mahesh Babu: నిన్న మొన్నటి వరకు కేవలం రీజనల్ మూవీస్ కి మాత్రమే తన మార్కెట్ ని పరిమితం చేసిన సూపర్ స్టార్ మహేష్ బాబు , ‘వారణాసి’ చిత్రం తో ఏకంగా పాన్ వరల్డ్ మార్కెట్ పై గురి పెట్టిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ సినిమా తర్వాత మహేష్ బాబు ఇంటర్నేషనల్ లెవెల్ ఇమేజ్ వస్తుంది కాబట్టి , ఆయన నుండే అదే రేంజ్ స్కేల్ ఉన్న సినిమాలు వస్తాయనే ఆశతో ఉన్నారు అభిమానులు. వాళ్ళ అంచనాలకు తగ్గట్టుగానే మహేష్ బాబు తన తదుపరి చిత్రాలను ప్లాన్ చేసుకుంటున్నాడు. ‘వారణాసి’ తర్వాత సందీప్ వంగ తో సినిమా చేయదనే రూమర్ సోషల్ మీడియా లో చాలా రోజుల నుండి. అదే విధంగా అనిల్ రావిపూడి తో కూడా ఒక సినిమా చేస్తాడనే రూమర్ ఉంది. కానీ అందరి అంచనాలను తలక్రిందులు చేస్తూ మహేష్ తీసుకున్న సరికొత్త నిర్ణయం ఇప్పుడు అందరినీ షాక్ కి గురి చేస్తోంది.
పూర్తి వివరాల్లోకి వెళ్తే బాలీవుడ్ లో పీరియడ్ జానర్ చిత్రాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిల్చిన సంజయ్ లీలా భన్సాలీ తో మహేష్ బాబు తన తదుపరి చిత్రం చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. హిస్టారికల్ నేపథ్యం లో ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారట. వచ్చే ఏడాది జూన్ నెల నుండి ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ మొదలయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. అంతే కాదు ఈ సినిమా తర్వాత మహేష్ బాబు చేయబోయే ప్రతీ ప్రాజెక్ట్ ఇంటర్నేషనల్ లెవెల్ లో ఉండేలా చూసుకుంటున్నాడట. మన టాలీవుడ్ లో ఇప్పట్లో ఆయన సినిమాలు చేసే అవకాశం లేదని అంటున్నారు. ఇందులో ఎంత వరకు నిజముందో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే. ఇక ‘వారణాసి’ మూవీ విషయానికి వస్తే , ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ఏప్రిల్ 7 న ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషల్లోనూ విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు .
దానికి తగ్గట్టుగానే షూటింగ్ ని పూర్తి చేసే పనిలో పడ్డాడు రాజమౌళి. ప్యాచ్ వర్క్ మినహా , సినిమాకు సంబంధించిన షూటింగ్ మొత్తం దాదాపుగా 80 శాతం పూర్తి అయ్యిందట. అక్టోబర్ నెలాఖరు లోపు షూటింగ్ కార్యక్రమాలు పూర్తి అవుతాయని , డిసెంబర్ లోపు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ని పూర్తి చేసి, జనవరి నుండి నాన్ స్టాప్ గా ప్రమోషనల్ కార్యక్రమాల్లో పాల్గొనేలా ప్లాన్ చేసుకున్నాడు రాజమౌళి. చూడాలి మరి , రాబోయే రోజుల్లో ఈ సినిమా పై ఆడియన్స్ లో ఎలాంటి అంచనాలు ఏర్పడబోతున్నాయి అనేది.