Varanasi Movie : సూపర్‌స్టార్ మహేశ్ బాబు, దర్శకధీరుడు ఎస్‌ఎస్ రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ చిత్రం వారణాసి’ (Varanasi) పై అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఈ సినిమాకు సంబంధించిన కీలకమైన రామాయణం ఎపిసోడ్‌పై ఆసక్తికరమైన అప్‌డేట్ సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది.
సినిమాలో అత్యంత కీలకంగా నిలిచే రామాయణం ఎపిసోడ్‌కు సంబంధించిన గ్రాఫిక్స్ వర్క్ పూర్తైనట్లు సమాచారం. ఈ ఎపిసోడ్‌లో మహేశ్ బాబు శ్రీరాముడి పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఇందులోని యుద్ధ సన్నివేశాలకు సంబంధించిన విజువల్స్‌పై దర్శకుడు రాజమౌళి ప్రత్యేక శ్రద్ధ పెట్టినట్లు సమాచారం.
తాజాగా పూర్తయిన గ్రాఫిక్స్‌ను చూసిన రాజమౌళి.. యుద్ధ సన్నివేశాల విజువల్స్‌పై పూర్తి సంతృప్తి వ్యక్తం చేసినట్లు సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. భారీ స్థాయిలో, హాలీవుడ్ చిత్రాలను తలపించేలా ఈ సన్నివేశాలను రూపొందించినట్లు తెలుస్తోంది.
ఇక సినిమా షూటింగ్ దాదాపు పూర్తయినట్లు సమాచారం. ప్రస్తుతం వీఎఫ్ఎక్స్, రీ-రికార్డింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ప్రతి సన్నివేశాన్ని అత్యంత జాగ్రత్తగా తీర్చిదిద్దుతున్న రాజమౌళి.. సినిమాను ప్రేక్షకులకు సరికొత్త విజువల్ అనుభూతిని అందించేలా రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది.
మహేశ్ బాబు శ్రీరాముడిగా కనిపించే ఈ కీలక ఎపిసోడ్ ఎలా ఉండబోతోందన్న ఆసక్తి అభిమానుల్లో ఇప్పటికే నెలకొంది. ఈ సన్నివేశాలకు సంబంధించిన అధికారిక వివరాలు, ఫస్ట్ లుక్ లేదా వీడియో ఎప్పుడు బయటకు వస్తాయో చూడాలి.